సాతాను సామ్రాజ్యం!!
===================
జాన్ యఫ్. కెన్నడీ అని ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్. 1963 లో, అతన్ని రోడ్డుపైనే కాల్చి చంపారు.అనేక విచారణా సంఘాలూ, కమీటీలూ వేశాక కెన్నడీ ని కాల్చింది ఇతనే అని ఓ క్యారెక్టర్ -Xని ప్రవేశ పెట్టారు. పైగా ఆ X ఒంటరిగానే ఇదంతా చేశాడనీ, అతని వెనుక ఇంకెవరూ లేరనీ కూడా తీర్మానించేశారు. అసలు ‘ఇంతకూ ఎందుకు చంపావయ్యా’ అని న్యాయస్థానం అతన్ని రేపో, మాపో ప్రశ్నిస్తుందనగా , ఆ Xని మరో Y అనే అతను చంపేశాడు. ‘ఆ Xని ఎందుకు చంపావ్ రా బై’ , అని అడుగుదామనుకుంటున్నంతలో, ఆ Y జైల్లోనే క్యాన్సర్ రోగంతో ‘హటాత్తుగా ‘ చనిపోయాడు. ఆ రకంగా కెన్నడీ ని ఎవరు ఎందుకు చంపారనే విషయం ఇప్పటికీ తేలలేదు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 దేశాల్లో సైనిక స్థావరాలు, భూమి మీద ఏక్కడ ఏ క్షిపణి లేచినా, దానిని ఠపీమని పసిగట్టే గూఢాచార వ్యవస్థ.. కానీ, తన సొంత దేశాధ్యక్షున్ని పట్టపగలు కాల్చి చంపితే,
ఆ చంపింది ఎవరో,ఎందుకు కాల్చాడో తెలుసుకోలేక పోయారు. అది మనం నమ్మాలి.
“కంటికి కనపడేదంతా నిజం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సాతాను సామ్రాజ్యం ఉంది-” అని అరుంధతిలో ఫకీరు క్యారెక్టరు చెప్పినట్లుగా, కెన్నడీ ని ఇందుకే చంపారు , అని తీర్మానిస్తూ అనేక కన్స్పైరసీ(Conspiracy) థియరీ లు పుట్టుకొచ్చాయి. వీటిలో కొన్ని, నమ్మే విధంగా కూడా ఉంటాయి. ఓపికున్నోల్లు యూటూబ్ లో చూస్కోవచ్చు. ‘అబ్బే, మేము అవన్నీ నమ్మం, ఓ చక్కటి ఆధునిక పౌరుడిగా, ప్రభుత్వం, మీడియా వాల్లు ఏం చెప్తే అది నమ్ముతాం’, అంటారా?.. అలాగే కానివ్వండి. కాకపోతే, ఏ ప్రభుత్వం ఎప్పుడు జనాలకు నిజాల్ని చెప్పింది గనక. “ఇరాక్‌లో రసాయనక, జనహనన ఆయుధాలు గుట్టలు,గుట్టలుగా ఉన్నాయి. మనం ఇరాక్ బారినుండి ప్రపంచాన్ని రక్షించాలి” అని బుష్షు గాడూ, టొనీ బ్లెయిరూ కలిసి ఇరాక్ మీద దండెత్తి 5 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నారు. తీరా వారి ప్రయోజనం నెరవేరాక, తూచ్.. అక్కడ రసాయన ఆయుధాలేం లేవ్.. అని డిక్లేర్ చేసేశారు.
అన్నట్టు.. WTC -ఈ పేరు వినగానే, రెండు విమానాలు రెండు పెద్ద బిల్డింగులను ఢీకొట్టడం, అవి అలా నేలలోకి కృంగిపోవడం మీకు గుర్తొచ్చే ఉంటుంది. కానీ, ఆరోజు అక్కడ కూలిపోయింది రెండు బిల్డింగ్లు కాదు. మొత్తం మూడు బిల్డింగ్లు అని నేనంటే? 47 అంతస్తులున్న మూడవ బిల్డింగ్‌ని, ఏ విమానమూ కొట్టకుండానే, దానికదే, అలా భూమిలోకి కామెడీగా కుంగిపోయిందని చెప్తే? మీరు నమ్మరు కదా. ఎగ్జాక్ట్ గా జరిగింది అదే. అణుమానమున్నోల్లు గూగుల్ సెర్చ్ చేసుకోండి. యూటూబ్ లో ఆ బిల్డింగ్ కూలిపోతున్న వీడియోలు కూడా అనేకం ఉన్నాయి.
అంచాత చెప్పొచ్చేదేటంటే.. “మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సాతాను సామ్రాజ్యం ఉందో లేదో గానీ”, మీడియాలో కంటికి కనపడేదీ, ప్రభుత్వాలు చెప్పేదీ మాత్రం అంతా నిజం కాదు” -అని.
మహమ్మద్ హనీఫ్.
shukravaram.in