ప్రవొకేషన్ – రెచ్చగొట్టుడు

ప్రవొకేషన్ – రెచ్చగొట్టుడు
==========================
నీ మసీదు గోడకు కొట్టిన తెల్లరంగే – ఓ ప్రవొకేషన్
దానిపై అర్జంటుగా కాషాయం రంగు కొట్టు.

నీ మసీదుపై ఉన్న గుమ్మటమే ఓ ప్రవొకేషన్
దానిని తీసి ఓ గంటను వేలాడదియ్.

నీ తలపై ఉన్న టోపీ, నీ గడ్డం ఓ ప్రవొకేషన్
వాటిని తీసి పడేయ్.

నీ అరబిక్ అర్థమొచ్చే పేరు ఓ ప్రవొకేషన్
దానిని మార్చి, ఏ పుల్లయ్య అనో, పెంటయ్య అనో పెట్టుకో.

అల్లా మనుషులందర్నీ సమానంగా పుట్టించాడనే నీ సిద్ధాంతమే ఓ ప్రవొకేషన్
దాన్ని మర్చిపోయి, నీ అరికాలి స్థానమేదో నువ్వు చూస్కోపో.

మొత్తానికి నువ్వే ఓ ప్రవొకేషన్, నీ మనుగడే ఓ ప్రవొకేషన్,
నువ్వు నిటారుగా నిలబడుడె ఓ ప్రవొకేషన్
పో.. అర్జెంటుగా వెళ్ళి ఘర్ వాపసీ చేసుకోపో.

-మహమ్మద్ హనీఫ్.
shukravaram.in

Leave a Reply

Your email address will not be published.