ఆర్జీవీ చెప్పని ఆబ్జెక్టివిజం

డీకోడింగ్ వర్మ – Part-2.

ఆర్జీవీ చెప్పని ఆబ్జెక్టివిజం
======================

వర్మ అనేక ఇంటర్వ్యూలలో డబ్బు, గౌరవం, పరువు-ప్రతిష్ఠలు, మంచి-చెడు,కులం, మతం, దేశభక్తి లాంటి అనేక అంశాల గురించి, ఆబ్జెక్టివిజ్గా విశ్లేషించాడు. అవన్నీ యూటూబ్ లో ఉన్నాయి. ఇన్ని అంశాల గురించి ఆబ్జెక్టివ్ గా ఆలోచించే వర్మ, కొన్ని అంశాల గురించి మాత్రం భిన్నంగా మాట్లాడతాడు. అవి – మహిళలు, పోర్న్, సెక్స్ etc..

మిగతా అన్ని విషయాల్లాగే, వీటిని కూడా ఆబ్జెక్టివ్గా విశ్లేషిస్తే, వాటికి ఇచ్చే సమాధానాలు ఎలా ఉంటాయో చూద్దాం.

థండర్ థైస్: ( మెరుపు తొడలు)
————–
మనిషి శరీరంలో వివిధ రకాల ఎముకలుంటాయి. వాటి చుట్టూ కండ పేరుకుని ఉంటుంది. అలాంటి ఎముకలన్నిట్లోకి పెద్దది మరియు గట్టిది ఫేముర్ బోన్.( తొడ ఎముక). ఆ ఎముక,దాని చుట్టూ పేరుకుని ఉన్న కండను కలిపి తొడ అని పిలుస్తారు. ఈ తొడ అనే పార్టు, స్త్రీ,పురుషులకు ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే, స్త్రీల శరీరం, పురుషుల శరీరమంత ధృడంగా/గట్టిగా ఉండదు కాబట్టి, ఈ తొడ పార్టు కూడా, పురుషులతో కంపేర్ చేస్తే కాస్తంత మెత్తగా ఉంటుంది. ఇక మిగతాదంతా సేం టు సేం.
కొందరి థైస్ గొప్పగా ఉన్నట్లు, అద్భుతంగా ఉన్నట్లు ఒక్కోసారి జనం/మీడియా సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటారు. ఉదాహరణకు – శ్రీదేవి వి థండర్ థైస్ అంట. వాటిని చూడడం కోసమే జనం టికెట్ కొని మళ్ళీ,మళ్ళీ మూవీకి వచ్చేవారంట. వీల్లందరూ అంత వెరైటీగా ఏం చూసి ఉంటారు? బేసికల్గా వీరు ఆ తొడల్ని చూసిపొందిన ఆనందం కంటే, ఆ తొడల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నామనే ఫీల్ ని ఎంజాయ్ చేసి ఉంటారు. ఇదొక టైపు Programmed రియాక్షన్.

ఇంకా స్ట్రైట్ గా చెప్పాలంటే – ఓ వ్యక్తి KFC రెస్టారెంట్లోకెల్లి, అక్కడి కోడి లెగ్స్ ని చూసి లొట్టలేశాడంటే దానిలో అర్థముంది. ఎందుకంటే, ఆ లెగ్ పీస్ అతని చేతికొస్తే, ఆ బలసిన కండని ఆబగా కొరికి తినొచ్చు కాబట్టి. అంతే తప్ప, ఓ లేడీ లెగ్స్/థైస్ సన్నగా ఉన్నా,లావుగా ఉన్నా, రౌండ్గా ఉన్న, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, అతను చేయగలిందేమిటి? how does it makes any difference to a Man? అతని రొట్టె విరిగి నేతిలో పడి ఆ లెగ్స్/థైస్ అతని చేతికొచ్చినా, ఏం చేసుకుంటాడు వాటిని? ఓ సారి తడిమి చూసుకోవడం తప్ప. అతని తొడల కంటే, ఆమె తొడలు కాస్తంత నునుపుగా,మెత్తగా ఉంటాయి.. అంతే కదా. ఆ మాత్రానికి దేనికా ఆత్రం…?

ఇలాగే ఫలానా హీరోయిన్ పెల్విస్ బోన్(నడుము) బాగుందనీ, ఫలానా హీరోయిన్ గ్లూటెల్ మజిల్(వెనకాల భాగం) బాగుందనీ, ఫలానా హీరోయిన్ పెదాలు బాగున్నాయనీ, పాపం ఒక్కో పార్టుని, ఒక్కో వాణిజ్య వస్తువుగా చేసేసి, వాటి ఆధారంగా కొన్ని వేల కోట్ల బిజినెస్ చేసేసుకుంటున్నారు. వీటిని, వివిధ రకాల మీడియా, పలు,పలు విధాలుగా, పదే పదే చెప్పి, వినే/చూసే జనాల మెదడుల్లోకూడా , ఈ అభూత కల్పనల్ని ప్రోగ్రాం చేసిపడేస్తున్నారు.

స్త్రీ,పురుషుల మధ్య ఆకర్షణ అనేది ప్రకృతి సహజ సిద్ధంగానే ఏర్పాటు చేసింది. ఈ సినిమాలు, పోర్న్ వీడియోలు, ప్లాస్టిక్ సర్జరీలు,అందాల పోటీలు లాంటివి లేని కాలంలో కూడా, స్త్రీ,పురుషుల మధ్య ఆకర్షణ ఉంది. ఈ కొత్తగా వచ్చిన వింత పోకడల వల్ల జరిగింది ఏమిటంటే – ఇలా ఉంటేనే అందంగా ఉన్నట్లు అని కొన్ని కొలతల్ని నిర్దేషించి, మహిళల్ని అలా ఉండాలని ఆ చట్రం లో బంధించేయడం, ఇలా ఉన్న స్త్రీలను పొందటమే తమ జీవితానికి సార్థకత అని నమ్మేలా మగాల్లను ట్యూన్ చేయడం” జరిగింది. ఈ మాడరన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంతిమంగా చేసింది ఇదే.

**********************

ఆర్జీవీ – మొదటి సినిమాతోనే తెలుగు సినిమా గతిని మార్చేసిన రికార్డును సాధించాడు. దీనితో పాటు ఆర్జీవీకి మరో రికార్డు కూడా ఉంది. – అది అత్యధిక సమయం ఇంటర్వ్యూలు ఇస్తూ గడిపిన దర్శకుడు అనేది. నా లెక్క ప్రకారం, ఏ ఇతర సినిమా వ్యక్తి కానీ, ఈ అంశంలో వర్మ దరిదాపులకు కూడా రాలేడు.

ఇంతకీ వర్మ అన్నేసి సార్లు, ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు?
నా అంచనా ప్రకారం. దీనికి రెండు కారణాలు.
1. తాను నమ్మిన ఫిలసాఫికల్ అంశాలు అందరితో పంచుకోవడం.
2. ఎప్పుడూ వార్తల్లో ఉండి, తన బ్రాండ్ ఇమేజ్ ని సజీవంగా ఉంచుకోవడం.

సినిమా మేకింగ్ లో కీలకమైన అంశం -దాని పబ్లిసిటీ. అంటే ఓ సినిమా గురించి జనాలకు తెలియజేయడం. అంతా బాగుండి కూడా, సరైన పబ్లిసిటీ లేని కారణాన ఫ్లాప్ అయిన సినిమాలు బోలెడున్నాయి. అందుకే, నిర్మాతలు సినిమా మొదలు పెట్టేటప్పుడే, పబ్లిసిటీ మీద ఖర్చుచేయాల్సిన మొత్తాన్ని కూడా, సినిమా బడ్జెట్ లో ఇంక్లూడ్ చేసి ఉంటారు. ఆర్జీవీ విషయంలో, ఈ పబ్లిసిటీకి పెద్దగా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. తన సినిమాల్ని ఎలాంటి ఖర్చు లేకుండా, మీడియా చానెల్ల ద్వారా పబ్లిసైజ్ చేసుకునే కళ ఆర్జీవీకి బాగా ఒంటబట్టింది.

వర్మను ప్రతి ఇంటర్వ్యూలోనూ కామన్ గా అడిగే ప్రశ్నలు – హీరోయిన్లు, అందం, అఫైర్లు. వీటికిగానీ, వర్మ పైన నేను రాసినట్లు ఆబ్జెక్టివ్ ఆన్సర్లు ఇచ్చి ఉంటే – ఏ TV వాల్లూ వర్మని మరో సారి ఇంటర్వ్యూలకు పిలవరు. ఎందుకంటే, అలాంటి ఆన్సర్లలో జనాలను ఎక్సైట్ చేసే కిక్ ఉండదు కదా. వారికి కూడా సెక్స్ ని, ఆడవారి అందాల్ని గ్లోరిఫై చేసి, TRP రేటింగ్ లు పెంచుకోవడమే కావలసింది. . అందుకే వర్మ జనాలకు, TV వారికీ నచ్చే, వారితో లొట్టలేయించే ఆన్సర్లూ ఇస్తుంటాడు.

ఉదాహరణకు :
ప్రశ్న : మీకు ఎంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయి?
ఈ ప్రశ్నను ఇంత స్త్రైట్ గా, ఏ సినిమా వ్యక్తినీ అడిగి ఉండరు. అడిగినా, దానికి ఎవరూ సమాధానం చెప్పి ఉండరు. చెప్పినా, అబ్బే అలాంటివేం లేవని చెప్పి ఉంటారు.
కానీ దీనికి వర్మ ఇచ్చే సమాధానం –
“నేనుగానీ ఆ నంబర్ చెప్పానంటే మీరు కుళ్ళుతో చచ్చిపోతారు”

కానీ, నిజ జీవితంలో వర్మ ఏ హీరోయిన్ తోనూ క్లోజ్ గా మూవ్ అయినట్లుగానీ, వాళ్ళతో హోటల్ రూముల్లో, పబ్బుల్లో, ఫారెన్ టూర్లలో తిరిగినట్లుగానీ ఎప్పుడూ ఎలాంటి సీరియస్ న్యూస్లూ లేవు.

మరో ప్రశ్న: “పొద్దున్నే లేచి మీరేం చేస్తారు”
ఆర్జీవీ: పొద్దున్నే లేచి పోర్న్ చూస్తా.

ఇది ఇంకో తలతిక్క ఆన్సర్. కానీ వర్మ ఇదే ఆన్సర్ ని సీరియస్ ఫేస్ పెట్టి, పదే పదే చెప్పి ఉండటంతో, చాలా మంది దానిని నిజమే అని నమ్మేశారు.

రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి, పొద్దునే లేచిన వ్యక్తి ఎవరైనా, తన పని గురించే మొదట ఆలోచిస్తాడు. అలా కాకుండా, పోర్న్ చూశాడంటే, దానర్థం అతనికి రాత్రంతా నిద్రపట్టలేదనీ, తన శరీరం పొందుకోసం తహతహ లాడుతున్నదనీ. కానీ వర్మకు అంత మంది హీరోయిన్లతో సంబంధం ఉంటే,ఇక పొందు కోసం తహ లాడాల్సిన అవసరం ఏం వచ్చింది. సో, ఇది కూడా జనాల్ని ఎదవల్ని చేసే సమాధానమే తప్ప, నిజం కాదు.

ఈ రకంగా, హీరోయిన్లు, ఎఫైర్లు, పోర్న్ వంటి అనేక అంశాల గురించి వర్మ ఇచ్చే సమాధానాలు జనాలతో లొట్టలేయించడానికి చెప్పే అందమైన అబద్ధాలే తప్ప నిజాలు కాదని, కాస్తంత బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది.

వర్మ – మరో చలం …?
———————–
వర్మను , మరో చలం అని చాలా మంది వర్ణిస్తుంటారు. మిగతావన్నీ ఏమో కానీ, ఒక్క విషయంలో మాత్రం, వర్మకూ, చలానికీ చాలా దగ్గరి పోలిక ఉన్నట్లు నాకనిపిస్తుంది.

అది అభిమానుల అపార్థం!!!

స్త్రీ అభ్యుదయం, స్త్రీ స్వేచ్చ గురించి అనేక రచనలు చేసిన చలం, స్వతంత్ర భావాలు గల స్త్రీలకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో, అప్పట్లో ఓ ‘స్త్రీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.” మీకేమైనా సమస్యలుంటే మమ్మల్ని సంప్రదించండి అని ఆ సేవా కేంద్రం అడ్రస్ ని పబ్లిసైజ్ చేశాడు. కానీ, తీరా దానికి వచ్చే లెటర్లను చూసి పాపం తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఎందుకంటే – దానికి వచ్చే లెటర్లలో చాలా వరకూ ఒకే సారాంశం ఉండేదంట. అది – ” నేను మీ పుస్తకాలతో చాలా ప్రభావితమయ్యాను. మీ రాజేశ్వరి లాగే( మైదానం హీరోయిన్) నేను కూడా ఓ నచ్చిన వ్యక్తితో కలిసి ఇల్లొదిలి వచ్చేశాను. ఆ వ్యక్తి పొద్దున్నే ఇడ్లీలు తెస్తానని చెప్పి పత్తా లేకుండా పోయాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి” – ఇలా ఉండేవట, చాలా వరకు ఆ లెటర్లు. దీనితో పాపం, ఆయన -“అమ్మా! నేను చెప్పిన స్త్రీ అభ్యుదయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా. స్త్రీ అభ్యుదయమంటే, ఇల్లొదలి లేచిపోవడం కాదు తల్లో” అని అందరికీ మొరపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు వర్మ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. TV ఛానల్ల అత్యుత్సాహం పుణ్యాన అతను చెప్పిన మిగతా విషయాలన్నీ ఏమోగానీ, అమ్మాయీ-అబ్బాయిలు , రాజేశ్వరీ-అమీర్ ల లాగా ఇసుక తెన్నెల్లో దొర్లడం, దాని గురించి ఫేసుబుక్కుల్లో పదిమందికీ చెప్పుకోవడమే, అసలైన ఆబ్జెక్టివిజం/రామూయిజం అని అతని ఫ్యాన్స్ భావిస్తున్నట్లుగా ఉంది.( అందరూ కాదు).

Twist!!

T.Vల్లో మరీ ఫ్రీక్వెంట్ గా వస్తుండటంతో, వర్మ ఆన్సర్లల్లో కూడా మోనాటనీ అనేది కనిపించడం మొదలైంది. ఈ విషయం పసిగట్టేసినట్లు, వర్మ కూడా ఎంతకాలం ఈ సాఫ్ట్ పోర్న్ అనుకుని, యూరప్ తారతో GST కి తెరతీశాడు. మరో వైపు TV వాల్లకి కూడా TRP ప్రెజర్ బాగా పెరిగిపోయింది. ఎంత సేపని,వర్మని అవే పాత చింతకాయ పచ్చడి ప్రశ్నలు వేస్తుంటారు. అందుకే ఈ సారి డైరెక్ట్ గా మహిళా మండలి సభ్యుల్ని రంగంలోకి దింపారు. వారి పాచిక పారింది. “ఆడదాన్ని పట్టుకుని” అని కనిపించిన వారినందరినీ చెడుగుడు ఆడుకునే మహిళా మండలిని కూడా, దేశముదురైన వర్మ మొదట్లో చుక్కలు చూపించాడు గానీ, ఎంత మహిళా మండలైనా, వాల్లూ మహిళలే కదా, వారి చివరి ఆయుధమైన ‘విక్టిం కార్డ్ ‘ తీయడంతో, RGV ప్రస్తుతం కోర్టు చుట్టూ తిరగాల్సొచ్చింది.

What Next!!!

జీవిత కాలమంతా హేతువాదం, అభ్యుదయం అంటూ ఆవేశపూరిత రచనలు చేసిన చలం, జీవిత చరమాంకంలో పాపం సైద్ధాంతిక సంధిగ్ధంలో పడిపోయాడు. చివరికి రమణ భగవాన్ ఆశ్రమంలో తేలాడు. మరి మాడ్రన్ చలం – ఆర్జీవీ పరిస్థితి ఎలా ఉండబోతుందో.. వేచి చూడాలి.

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.