ఇస్లాం తెంపిన భక్తి సంకెళ్ళు!!

ముందుగా మతం గురించి నాస్తికులు చేసే ఓ తెలివైన, సహేతుకమైన విమర్శ గురించి చూద్దాం.

“ఇతరుల్ని కంట్రోల్ చేయడానికి, మతాన్ని కొందరు తెలివైన వ్యక్తులు క్రియేట్ చేశారు.ఈ విషయం తెలుసుకోలేక చాలా మంది గుడ్డిగా ఆ మతాల్ని ఫాలో అవుతుంటారు. దీనితో వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు. కొందరు ఇతర వ్యక్తులు మాత్రం వీరి నమ్మకాల్ని తెలివిగా వాడుకుంటుంటారు.”

ఇది చాలా మంది నాస్తికులు తరచుగా మతం గురించి చేసే కామెంటు. దీనిలో కొంతవరకూ వాస్తవం ఉంది.

కాకపోతే, ఈ విమర్శను ఇస్లాం కి అప్లై చేసి, దీనిలో నిజం ఎంతో చూద్దాం.

ముందుగా, ఓ వ్యక్తి ఇస్లాం ని ఫాలో అవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం. అస్సలు ఇస్లాం ని ఫాలో అవ్వడం అంటే ఏంటి?

1. రోజూ 5 పూటలా నమాజ్ చేయడం.
2. రంజాన్ నెలలో పగటిపూట తినడం, తాగడం చేయకపోవడం.
3. నీదగ్గర ఖర్చులకుపోనూ, ఏమైనా డబ్బులు,ఆస్తులు మిగిలి ఉంటే, దాన్లోనుండీ 2.5% తీసి నీకంటే పేదరికంలో ఉన్నోల్లకు ఇవ్వడం. దీన్నే జకాత్ అంటారు.
4. ఆరోగ్యమూ,స్థోమతా ఉంటే – జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించడం.

ఓ వ్యక్తి ఇస్లాం ని ఫాలో అవ్వాలంటే, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవి చేయడం వల్ల, ఎవరికి లాభమో చూద్దాం.

2.ఉపవాసం – దీనివల్ల ఆ వ్యక్తికి ఆకలి,దప్పికలు తప్ప వేరే ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదు.
3.జకాత్ – దీనివల్ల సమాజంలోని పేదోల్లకు, అనాధలకూ ఆసరా,ఉపయోగం తప్ప, వేరే ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదు.
4. మక్కా యాత్ర – దీనివల్ల సౌదీ గవర్నమెంటుకు కొంత వీసా ఫీజు చెల్లించాలి. ఆ రకంగా వారికి కొంత ఆదాయం సమకూరుతుంది. కానీ, పాస్పోర్టులు, వీసాలు వంటివి ఇటీవలే చెలామనీలోకొచ్చిన ఆధునిక కాన్సెప్టు తప్ప, ప్రవక్త కాలంలో ఎవరూ, ఎవరికీ ఫీజులు చెల్లించిన దాఖలాలు లేవు. పైగా, జీవితంలో కనీసం ఒక్కసారి మాత్రమే, అది కూడా ధనిక ముస్లింలకు మాత్రమే ఈ నియమం కాబట్టి అదేమంత పెద్ద విషయం కాదు.

ఇక మిగిలింది, ముఖ్యమైంది – నమాజ్.

1. నమాజ్ – రోజుకు ఐదుసార్లు, ఒక్కో తడవకు మహా అంటే 10-15 నిమిషాలు, ఖురాన్లోని అరబిక్ వాక్యాలు మననం చేసుకుంటూ, నిలబడటం,వంగడం,సాష్టాంగపడటం చేయాలి- ఇదే నమాజ్ అంటే. ఓ వ్యక్తి తలుపులేసుకుని ఒంటరిగా ఇంట్లోకానీ, ఆఫీసులో కానీ, ఊరిబయటకానీ, చెట్టుకిందకానీ ఎక్కడైనా నమాజ్ చేయొచ్చు.
కాకపోతే, ఒంటరిగా చేసేకంటే, అందుబాటులో మరికొంతమంది ముస్లింలు ఉండి, అందరూ కలిసి చేస్తే వచ్చే పుణ్యం ఎక్కువ. కాబట్టి సహజంగా చాలా మంది మసీదుకు వెల్తుంటారు. అలా మసీదుకు వెల్లినవారు – అక్కడ చందానో, దక్షిణో, దశమభాగాలో ఇచ్చేదేం ఉండదు. ఎంట్రీ టికెట్లు గట్రా ఏం ఉండవు. ఎవరి జేబులోనుండీ ఒక్కపైసా కూడా బయటికి రాదు.

ప్రతి మసీదుకూ ఇమామ్ అని ఒకాయన ఉంటాడు. ఆయన మిగతా ముస్లిం ల కంటే స్పెషల్గా చేసేదేం ఉండదు. మిగతా ముస్లింలకు వర్తించే పైన చెప్పిన నియమాలే ఆయనకూ వర్తిస్తాయి. కాకపోతే, ఆయన 5 పూటలా తన నమాజ్ చేసేటప్పుడు మిగతా ముస్లింలు ఆయన వెనకాల నిలబడి, ఆయన్ను అనుకరిస్తూ తమ నమాజు పూర్తిచేస్తారు. ఇమామ్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళి, ఓ రెండు నిమిషాలు ఆలస్యంగా మసీదులోకి వస్తే, ఈలోపల అక్కడున్న ముస్లింలలో ఎవరోఒకరు ముందునిలబడి నమాజ్ మొదలుపెడ్తారు. ఆలస్యంగా వచ్చిన ఇమామ్ గారు, ఇతర ముస్లింలలాగే, వారితో కలిసి వెనక నిలబడాల్సిందే తప్ప, ఆయనకోసం ఏదీ ఆగడమో, ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ లాంటివేవీ ఉండవు. దీనిని బట్టి ఇమామ్ అనేది, నమాజ్ ఫార్మాలిటీస్ ని పూర్తిచేయడానికి ఉద్దేశ్యించిన ఓ ఉద్యోగమే తప్ప, ఆ పోస్టుకు ఎలాంటి ఇతర ప్రత్యేకతలూ లేవు.
->మిగతా ముస్లింల కంటే ఇమామ్ అల్లాకు ఎక్కువ దగ్గరి వాడనో,మిగతా ముస్లింలు తాము చేసిన పాపాలు ఆయన చెవిలో చెప్పి, ఆయన ద్వారా “దేవుడు క్షమించాడుపో” టైపు హామీలు పొందే కాన్సెప్టులు ఏవీ ఇస్లాంలో లేవు.
->ఖురాన్ మొత్తం కంఠతాపట్టి, ప్రవక్త జీవితం, బోధనలపై అవగాహన ఉన్నోల్లు ఎవరైనా ఇమామ్ గా నియమించబడొచ్చు.ఇవికాక ఆయనకు పుట్టుకకు సంబంధించిన ఇతర అర్హతలేవీ అవసరం లేదు.
->ఆయన కూడా చక్కగా పెళ్ళి చేసుకుని, భార్యా బిడ్డలతో కుటుంబ జీవితం ఎంజాయ్ చేస్తుంటాడు. అంతే తప్ప, బ్రమ్హచారిగా మసీదుకోసం జీవితాన్ని త్యాగం చేయాలనే ప్రకృతివిరుద్ధ నియమాలేవీ ఇస్లాంలో లేవు.

బయట డిగ్రీ,పీజీ,పీహెచ్ డీ లాంటివి ఉన్నట్లే, ఇస్లామిక్ స్టడీస్ లోనూ, ఇమాం,మౌల్వి, ముఫ్తి వంటి స్టేజెస్ ఉంటాయి. వీటిలో అన్నిటికంటే పైన ఉండేది ముఫ్తి . పైన చెప్పిన అన్ని నియమాలూ ముఫ్తీకి కూడా వర్తిస్తాయి.కాకపోతే, ఆయన అదనంగా ఫత్వాలు కూడా జారీ చేయొచ్చు. ఫత్వా అంటే, ఖురాన్/ప్రవక్త బోధనల ఆధారంగా ఓ అంశంపై అభిప్రాయాన్ని వెలిబుచ్చడం. అది కేవలం ఓ అభిప్రాయం మాత్రమే. ముస్లింలందరూ దానికి కట్టుబడి ఉండాలనో, దానిని ఒప్పుకుని తీరాలనో నియమం లేదు.

ఇస్లాం ప్రకారం – మహమ్మద్ గారు సృష్టికర్త నుండీ సందేశం అందుకున్న చివరి ప్రవక్త. ఆయనకు ఇవ్వబడిన సందేశమే ఖురాన్ గ్రంధం.

సృష్టికర్త
|
ఖురాన్/ప్రవక్త బోధనలు
|
మానవుడు

సృష్టికర్త ను ప్రసన్నం చేసుకోవడానికి ముస్లిం కి, ఖురాన్/ప్రవక్త బోధనలపై నడవడమే ఏకైక మార్గం తప్ప, వేరే ఏ ఇతర షార్ట్ కట్ లూ లేవు. ఏ ఇతర మానవుడూ, తనకంటే ఉత్తముడనో, పవిత్రుడనో, దేవుడికి దగ్గరివాడనో భావించడం ఇస్లామిక్ భక్తి భావనకే విరుద్ధం.

ఈ అంశాలన్నిటి ఆధారంగా చూస్తే ఓ వ్యక్తి ముస్లిం గా ఉండటం వల్ల వేరే ఏ వ్యక్తికీ, సమూహానికీ ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఓ ముస్లిం ని కంట్రోల్ చేసేది ఖురాన్, ప్రవక్త బోధనలే తప్ప, ఇతర వ్యక్తులు కాదు. కాబట్టి, నాస్తికులు మతాల గురించి రొటీన్ గా చేసే పై కామెంటు ఇస్లాం కి వర్తించదు. కేవలం వారు పుట్టిపెరిగిన మతంలో జరుగుతున్న విషయాల్ని అబ్జర్వ్ చేయడం వల్ల, అన్ని మతాల్లోనూ ఇలాగే ఉంటుందనుకునే అగ్ఞానంతో, అవగాహనాలేమితో అలాంటి కామెంట్లు చేస్తుంటారు. దర్గాలు,బాబాలూ,రొట్టెలపండగలంటూ తిరిగే కొంతమంది సోకాల్డ్ ముస్లింల మూర్ఖత్వం, అగ్ఞానం కూడా , వారికి ఈ అభిప్రాయం కలిగేలా చేస్తుంది.

ఈ రకంగా, ‘భక్తి ‘ అనే భావన చుట్టూ వున్న అనేక సంకెళ్ళను ఇస్లాం తెంచిపడేసి, మనిషిని, అతని పుట్టుక, స్థాయీ బేధాలతో సంబంధం లేకుండా, సర్వోన్నతుడిగా, సర్వ స్వతంత్రుడిగా నిలబెట్టింది.

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.