రొటీన్ ఇంటర్వ్యూ – రొటీన్ ఏడుపు

“ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్(MCB)” – ఇది ఇంగ్లండ్ లో, ముస్లింల సంక్షేమం కోసం పని చేసే అతిపెద్ద సామాజిక సేవా సంస్థ. దీని ఆధ్వర్యం లో దాదాపు 500 ఇతర సంస్థలు పనిచేస్తున్నాయి. ఇంత ప్రతిష్ఠాత్మక సంస్థ కు సెక్రెటరీ జనరల్ గా గత వారం ‘జారా మహమ్మద్’ అనే 29 సంవత్సరాల బ్రిటీష్ మహిళ ఎన్నికైంది. ఇస్లాం-మహిళలు అనే అంశం గురించి సమాజంలో చలామణీలో ఉన్న అభిప్రాయాల దృష్ట్యా చూస్తే ఇదో విప్లవాత్మక విషయమనే చెప్పొచ్చు.

బీబీసీ లో “ఉమన్ అవర్” అని వారానికోసారి మహిళల విషయాలను చర్చించే కార్యక్రమం ఒకటుంది. దీనికి వ్యాఖ్యాత గా ‘ఎమ్మా బర్నెట్’ అనే ఆవిడ వ్యవహరిస్తుంది. ఇది కూడా బాగానే పాపులర్ అయిన షో. గతవారం ఈ షోలో భాగంగా ఎమ్మా బర్నెట్, జారా మహమ్మద్ ను ఇంటర్వ్యూ చేసింది.ఆ ఇంటర్వ్యూలో, జారా మహమ్మద్ లక్ష్యాలు,ప్రణాళికల గురించి ఫోకస్ చేయకుండా, పనిగట్టుకుని పదే,పదే అడిగిన ఓ ప్రశ్న, ఇస్లాం పట్ల, మరీ ముఖ్యంగా ముస్లిం మహిళల పట్ల, సోకాల్డ్ స్త్రీజనోద్ధారకుల యాటిట్యూడ్ ఎలా ఉంటుందనే విషయాన్ని క్లియర్ గా నిరూపించింది. “బ్రిటన్లో ఎంతమంది మహిళా ఇమామ్ లు ఉన్నారు?అసలు ఇస్లాం లో స్త్రీలు ఇమామ్ గా ఉండొచ్చా?” – ఇదీ ఆ ప్రశ్న. ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ అనేది ముస్లింల సామాజిక అంశాలు చూసే సంస్థేతప్ప, మత విషయాలు చూసే సంస్థ కాదనీ – ఇది తమ పరిధిలోని అంశం కాదనీ, దీనికి సమాధానం తనకు తెలీదనీ జారా మహమ్మద్ చెప్పినా, పదే,పదే గుచ్చి గుచ్చి వివిధ రకాలుగా ఇదే ప్రశ్న అడుగుతూ పోయింది. అడగడమే కాకుండా, అదేదో ఘణకార్యమన్నట్లు, మొత్తం ఇంటర్వ్యూలోనుండీ ఈ పార్ట్ ని కట్ చేసి, దానిని ప్రోమోగా పదే,పదే బీబీసీలో ప్రసారం చేసుకున్నారు. బీబీసీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా ఈ షార్ట్ క్లిప్ ని పోస్ట్ చేశారు. “ఓ పక్క ముస్లిం మహిళల్ని ఎదగనీయరని ఏడుస్తుంటారు, మరో పక్క, MCB లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు హెడ్ గా, ఓ మహిళ ఎన్నికైతే, ఆమెను అభినందించాల్సింది పోయి, ఈ రకంగా పోలీసు ఇంటరాగేషన్ చేసినట్లు దిక్కుమాలిన ప్రశ్నలడిగి ఆమెను ఇబ్బందిపెట్టడం ఏ రకమైన అభ్యుదయం, ఏ రకమైన జర్నలిజం” – అని జనాలు నిలదీసి అడగడంతో – సైలెంట్ గా ఆ ప్రోమో వీడియోను డిలీట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రెండు విషయాలున్నాయి. 1. ఇస్లాం లో మహిళలు ఇమామ్‌గా ఉండొచ్చా, బ్రిటన్ లో ఎంతమంది మహిళా ఇమామ్‌లు ఉన్నారు- ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి జారా మహమ్మద్ తడబడటం.2. ఇలాంటి ప్రశ్నలడగటం భీబత్సమైన జర్నలిజానికి ప్రతీక అన్నట్లు, బీబీసీ దీనిని ప్రోమోలో వాడుకోవడం. పాశ్చాత్య సమాజానికి స్త్రీ అభ్యుదయమంటే, ‘పురుషులు చేసే పనులన్నీ మక్కికి మక్కి స్త్రీలు చేయడమేననే’ ఓ బెంచ్ మార్క్ ఉంది. ఇదో అసంబద్ధ,అర్థరహిత వాదన అనేవిషయం వారికి తెలిసినా తెలీనట్లే నటిస్తుంటారు. కానీ, ఇస్లాం ప్రకారం స్త్రీ,పురుషులు సరూపాలేగానీ సర్వసమానాలు కారు. ఒకరు ఎక్కువా,ఇంకొకరు తక్కువా కాదు. వారి,వారి శారీరక,మానసిక వ్యవస్థలకనుగుణంగా స్త్రీ-పురుషులకు కొన్ని విషయాల్లో సమాన నియమాలు, కొన్నిట్లో వేర్వేరు నియమాలు సజెస్ట్ చేయబడ్డాయి. ఆ నియమాల ఆధారంగా కోట్లాది మంది స్త్రీ-పురుషులు, సామ్రాజ్యాలూ,సమాజాలూ,దేశాలూ.. గత 1400 సంవత్సరాలుగా శాంతిసౌఖ్యాలతో మనుగడ సాగించారు, ఇంకా సాగిస్తున్నారు. మార్కెట్ శక్తులకూ, రాజకీయాల అవసరాలకూ తగ్గట్లు మారుతుండే పాశ్చాత్య విలువల్ని అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఇస్లాం కు లేదు. ఇమామ్ అంటే అదేదో పెద్ద పదవో, హోదా నో, పవిత్ర స్థానమో కాదు. అదొక ఉద్యోగం లాంటిది మాత్రమే. ఖురాన్,హదీసుల గురించి ప్రసంగాలు,వ్యాఖ్యానాలు, ఫత్వాలు జారీచేసే విషయాల్లో – స్త్రీ-పురుషులకు ఎలాంటి తేడాలేదు. ఈ పనులు చేసే ముస్లిం మహిళా స్కాలర్లు,ముఫ్తీలూ వేలల్లో, ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. స్త్రీలు మాత్రమే నమాజ్ చదివే గ్రూపుల్లో స్త్రీలే ఇమామ్ గా ముందుండి నమాజ్ చదివిస్తారు. స్త్రీ-పురుషులు కంబైండ్ గా ఉండే గ్రూపుల్లో, పురుషులే ముందుండి నమాజ్ చదివిస్తారు, స్త్రీలు వెనకభాగంలో నిల్చుంటారు. ఈ ఏర్పాటు ఎందుకయ్యుండొచ్చనే విషయం – నమాజ్ చదివే స్త్రీ-పురుషులందరికీ ఈజీగానే తెలిసిపోతుంది. నమాజ్ చదవనోల్లకు ఇదేమంత తెలుసుకోవాల్సిన విషయం కాదు, ఎందుకంటే ఇమామ్ అంటే, అదేదో నెత్తిమీద కిరీటం లాంటిది కాదు కాబట్టి. అఫ్కోర్స్, మక్కికి మక్కి పురుషులు చేసే పనులన్నీ చేయడమే మహిళాభ్యుదయమని భావించే వారికి మాత్రం ఇదే ప్రధాన సమస్యలా అనిపిస్తుంది. ఏది ఏంటో సరైన క్లారిటీ లేనప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలా క్లారిటీ లేకుండానే, ఇస్లాం ని చెడుగా డిక్లేర్ చేస్తూ Expert తీర్పులు ఇచ్చే తీర్పరులు మనకు అడుగడుగునా తారసపడుతూనే ఉంటారు. ఇలాంటి వారికి తమ అఙానాన్ని ముఖం మీద కొట్టినట్టు గుర్తుచేయడానికి, ముస్లింలు ఎప్పుడూ ప్రిపేర్డ్ గా ఉండాలి. వారి దగ్గర తడబడుతూ, వారికి సున్నితంగా సమాధానాలివ్వాలని చూస్తే, వారు నెత్తికెక్కి కూర్చుంటారు. జారా మహమ్మద్ విషయంలో ఇదే జరిగింది. “అవును ఇమామ్ గా ముస్లిం మహిళలు ఉండరు, ఐతే ఏంటట, దీంతో ముస్లిం మహిళలకి వచ్చిన నష్టమేంటో చెప్పి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న అడగమని”, జారా మహమ్మద్ స్థిరంగా, కాన్‌ఫిడెంట్ గా చెప్పి ఉంటే, బీబీసీ ఆ పార్ట్ ని మొత్తం ఇంటర్వ్యూ నుండే డిలీట్ చేసి పడేసేవారు తప్ప, ఇలా ప్రోమోగా వాడుకునేవారు కాదు. ఎమ్మా బర్నెట్(Emma Barnett) గురించిన మరో విషయం చూద్దాం. వీరిది బ్రిటన్ లో ఓ సంపన్న యూదు కుటుంబం. ఈమె తల్లిదండ్రులు ఏ వ్యాపారం చేసి సంపన్నులయ్యారో తెలుసుకుంటే మీరు ముక్కున వేలేసుకుంటారు. అది వ్యభిచారం వ్యాపారం. అంటే, ఇతర దేశాల్నుండీ అమ్మాయిల్ని బ్రిటన్ కి అక్రమంగా తరలించి, వారిని విటుల దగ్గరికి పంపించి వ్యభిచారం చేయించడం. ఈ రకంగా ఆమె అమ్మా-నాన్నా కోట్ల కొద్దీ సంపాదించారు. తన తల్లిదండ్రులు ఇలాంటి బిజినెస్ చేస్తున్నరనే విషయం ఎమ్మా బర్నెట్ కి తెలిసినా లైట్ తీసుకుంది. చివరికి వీరి అక్రమ బిజినెస్ గురించి, వీరి నాన్న నుండీ తప్పించుకున్న ఓ టీనేజ్ అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. ఈ వ్యభిచార బిజినెస్ గురించి – ఎమ్మా బర్నెట్ కీ, తన తండ్రికీ మధ్య నడిచిన ఈ-మెయిల్లు కూడా పోలీసులకి దొరికాయి. మొత్తానికి, తన తల్లి-దండ్రుల బిజినెస్ గురించీ తెలిసినా, ఎమ్మా బర్నెట్ ఆ సంపాదనతో విలాసంగా బతికింది తప్ప, తనకు తానుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, అలాంటిది ఈమె ప్రస్తుతం టీవీ స్టూడియోల్లో కూర్చుని మహిళాభ్యుదయం గురించి లెక్చర్లు దంచుతుంది, వినేవారు, నోరెళ్ళబెట్టి ఈమె చెప్పే సోది వింటున్నారు. అదీ పాశ్చాత్య, సో కాల్డ్ అభ్యుదయ వాదాల డొల్లతనం.

www.shukravaram.in

Sources :

https://brokenbottleboy.substack.com/p/the-sins-of-the-father-the-emails

Leave a Reply

Your email address will not be published.