Damned if you do, Damned if you don’t :(

Damned if you do, Damned if you don’t 🙁
=============================
“ముహర్రం పండగ అసలు పండగే కాదు. ఖురాన్ బోధనల ప్రకారం అలా పీర్లను మొక్కడం, వాటిని ఎత్తుకుని ఊరేగడం లాంటివి తప్పుడు ఆచారాలు” – అని రాశావనుకో –

“నిన్న మొన్నటి దాకా, హిందూ-ముస్లింలు ఎంతో ఐకమత్యంతో ముహర్రం పండుగను కలిసిమెలిసి చేసుకునేవారు. ఇప్పుడు కొందరు ముల్లాలు వచ్చి ఈ పండుగను చేసుకోకూడదని చెప్తున్నారు. దీనితో ఇంతకు ముందులా ఈ పండగను ఇప్పుడు చేసుకోవడం లేదు.ముస్లిముల్లో మతతత్వం పెరిగిపోతుందనడానికి ఇదో నిదర్శనం” – అని కొందరు మేధావి+హేతువాది+మానవతావాదీ+నాస్తికాగ్రేసులు(All in One) వాపోతారు.

అరే ఎందుకొచ్చిన గొడవలే అని రాయకుండా వదిలేశావనుకో –

“చూశారా, హిందూ పండగల గురించి చాలా మంది విమర్శిస్తూ రాశారు. కానీ ముస్లిం పండగల గురించి ఎవరూ విమర్శిస్తూ రాయరు. ఎందుకంటే -ముస్లింలంటే భయం. వాల్లు అసలే మనుషులు కాదుకదా. రాస్తే ఎక్కడ నరికేస్తారేమోనని భయం అందుకే ఎవరూ రాయరు. అదే హిందువులనుకో, పాపం ఎంత విమర్శించినా ఏమీ అనరు. కానీ ముస్లిం లు అలా కాదు కదా. వామ్మో, వాయ్యో.. ” – అని కొందరు – మేధావి+హేతువాది+మానవతావాదీ+నాస్తికాగ్రేసులు(All in One) వాపోతారు.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే – పై రెండు విమర్శలు చేసేవారూ, మరియూ, ఆ విమర్శలకు ఈలలు, చప్పట్లు (లైకులు,కామెంట్లు) కొట్టే, ఇతర సాటి మేధావి+హేతువాది+మానవతావాదీ+నాస్తికాగ్రేసులు(All in One) ఒకే వ్యక్తులు కావడం.

ఏదో అనుకుంటాం గానీ, మేధావి+హేతువాది+మానవతావాదీ+నాస్తికాగ్రేసులు(All in One) గా ఉండటం అంత వీజీ కాదబ్బా…

Leave a Reply

Your email address will not be published.