అధ్వానీ!!

అధ్వానీ!!
==========

పైన టైటిల్ లో ఒత్తు తప్పేం లేదు. 90 ఏళ్ళ ముసలోడు అద్వానీ చేతులు జోడించి దండం పెడుతుంటే, మోడీ చూసీ,చూడనట్లు, ఓ పురుగును చూసినట్లు, ఏ మాత్రం పట్టించుకోకుండా, రొమ్మువిరుచుకుని ముందునుండీ అలా నడుచుకుంటూ వెళ్ళి, ఆ పక్కనే ఉన్నాయనకి మాత్రం కరచాలనం చేశాడు.రాజకీయాల్లో గెలుపోటములు, ఎత్తుపల్లాలు సహజం. కానీ, ఇంత అధ్వాన పరిస్థితి అద్వానీకి తప్ప మరెవరికీ వచ్చి ఉండదు. ఇది చూసి ఒక్క క్షణం పాటు, అద్వానీ మీద జాలి కలిగింది. కేవలం ఒక్క క్షణమే, ఆ వెంటనే భారతదేశ రాజకీయాలు ప్రస్తుతం ఇలా ఉండటంలో ఆయన పాత్ర గుర్తొచ్చి -Karma is a BITCH కి ఇంతకంటే నిదర్శనం మరోటి ఉండదనిపించింది.

ఓ సారి ఫ్లాష్ బ్యాక్ కి వెళితే.. 2002 లో గుజరాత్లో జరిగిన ముస్లింల నరమేధంలో మోడీ పాత్ర అందరికీ తెలిసిందే. పైకి చెప్పుకోలేక పోయినప్పటికీ, చాలామంది అతన్ని అందుకే అభిమానిస్తారు. అప్పట్లో కేంద్రం లో BJPకి సొంతంగా మెజారిటీ లేదు. అది TDPలాంటి ఇతర ప్రాంతీయ పార్టిలతో కలిసి, NDA గొడుగు కింద, అధికారంలో ఉండింది. ప్రధాని వాజ్ పేయి కూడా ఆర్ ఎస్ ఎస్ నుండే అయినప్పటికీ, ఆ దారుణ నరమేధాన్ని వెనకేసుకురావడం అయ్యేపని కాదని, మోడీని తప్పించాలని ఆశించాడు. అదే సంవత్వరం గోవా లో జరగబోయే పార్టీ జాతీయ సమావేశంలో, దీనికి అనుగునంగా మోడీతో రాజీనామా ఇప్పించి అతని స్థానంలో మరొకరిని గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమించాలని ప్రతిపాదించాడు. దాదాపు ఇదే జరగబోతుందని అందరూ ఊహించారు.
కానీ, అప్పుడే అద్వానీ చక్రం తిప్పాడు. మోడీని ఎట్టిపరిస్థితుల్లో తప్పించరాదని, అలా చేస్తే హిందుత్వ కోర్ క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందనీ, కాబట్టి అతన్నే CM గా కొనసాగించాలనీ బలంగా వాదించి మొత్తానికి మోడీ రాజకీయ జీవితానికి ప్రాణం పోశాడు.
ఇక ఆతర్వాత మోడీ,అమిత్ షాలు గుజరాత్ ని తమ అడ్డాగా ఎలా మార్చుకున్నదీ, (సోషల్)మీడియా మాయాజాలంతో జాతీయ స్థాయి నేతగా,ప్రధానిగా ఎలా ఎదిగిందీ అందరికీ తెలిసిందే.
2013లో, అదే గోవాలో జరిగిన BJP జాతీయ సమావేశంలో, 2014 ఎన్నికలకు BJP ప్రధాని అభ్యర్ధిగా ఎవరుండాలనే అంశం చర్చకు వచ్చింది. వాజ్ పేయ్ వృద్ధ్యాప్యంతో రిటైర్ అయ్యారు కాబట్టి, ప్రధాని అభ్యర్ధిగా తానే సరైనవాన్నని అద్వానీ భావించారు. ఇక్కడే అద్వానీ-మోడీల అణుబంధానికి తెరపడింది. దానికి మోడీ ఇచ్చిన పనిష్మెంటే – ఆ రొమ్మువిరుచుకుని నడుచుకుంటూ వెళ్ళి, అద్వానీ పక్కనున్నాయన్ని పలకరించడం.

సందట్లో సడేమియా – చంద్రబాబు!!
———————————
2002లో NDA జాతీయ కన్వీనర్ చంద్రబాబు. గుజరాత్ లో ముస్లింల నరమేధాన్ని ఇతను కూడా లైట్ తీసుకున్నాడు. తర్వాత, వాజ్ పేయి మోడీని తప్పించబోతున్నారనే వార్త లీక్ అవ్వగానే, CBNలోని పొలిటీషీయన్ మేలుకున్నాడు. ఎలాగూ తప్పిస్తున్నారు కదా,దీనిని వాడుకుని తానూ ఓ సెక్యులరిస్టు సర్టిఫికేట్ కొట్టేద్దామనుకున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి, మనది సెక్యులర్ దేశం కాబట్టి, మోడీ CMగా పనికి రారనీ, అతన్ని అర్జెంటుగా దింపేయాలనీ స్టేటెంట్లు ఇచ్చాడు.( తీసేశాక, తానే తీపించానని చెప్పుకోవచ్చనుకుని) కానీ, అద్వానీ డిఫెన్స్ వల్ల సీన్ మొత్తం తారుమారైంది.
CBN నాలుక్కరుచుకుని, సైలెంటైపోయారు. మోడీ నాయకత్వం గురించి మరోసారి నోరెత్తలేదు. 2004 ఎన్నికల్లో ఘోర ఓటమికి, ముస్లింల మూకుమ్మడి బహిష్కారం కూడా ఓ కారణమని తెలుసుకుని , బీజేపీతో కలవడం ఘోర తప్పిదమనీ, మరోసారి TDP ఆ తప్పు చేయదనీ ప్రతిగ్ఞ చేశాడు. 2009లో, YSR ప్రవేశపెట్టిన ముస్లిం రిజర్వేషన్లు, మరియు ఇతర సంక్షేమ పధకాల వల్ల, మిగతా వర్గాల లాగే, ముస్లింలు కూడా YSRకి మద్దతివ్వడంతో, అప్పుడు సెక్యులరిస్టు ముద్ర కూడా ఏమాత్రం పనికి రాలేదు. ఇక 2014లో మళ్ళీ మోడీతో కలిసిన విషయం అందరికీ తెలిసిందే.

తన ప్రధాని పదవికి పోటీ వచ్చాడనే ఒకే ఒక్క కారణంతో, తన సొంత గురువు, రాజకీయ జీవితానికి ఒకప్పటి ప్రాణదాత అని కూడా చూడకుండా అద్వానీని అంతగా అవమానించే మోడీ, చంద్రబాబు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి తన గురించి చెడుగా చెప్పిన విషయాల్ని అంత ఈజీగా మర్చిపోయి ఉంటాడా? లేదా, సమయం కోసం ఎదురుచూస్తున్నాడా? బహుశా, ఇవన్నీ మనసులో ఉండబట్టే,స్పెషల్ స్టేటస్ విషయంలో మోడీతో కటీఫ్ చెప్పడానికి CBN భయపడుతున్నారా. మొత్తానికి POLITICS IS BITCH.
-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.