ఆటోఫజీ అంటే, “తన్ను తాను తినేయడం” అని అర్థం. కొన్ని కణాలు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమని తాము తినేసుకుని/నాశనం చేసుకుని అంతరించిపోతాయి. ఈ కాన్స్పెట్ మొదటిసారి 1950 లో వెలుగులోకి వచ్చింది. యోషినోరీ ఓసుమి అనే జపనీస్ శాస్త్రవేత్త, ఈస్ట్ కణాలపై శాస్త్రీయ అధ్యయనం చేసి, దీనిని ఆధారాలతో నిరూపించాడు. అంతటితో ఆగకుండా, మానవ శరీర కణాలలో కూడా ఆటోఫజీ లక్షణం ఉందని నిరూపించాడు. ఆటోఫాగీ ఆధారంగా క్యాన్సర్,అల్జీమర్స్ లాంటి వ్యాధికారక కణాల్ని నిర్మూలించవచ్చని ప్రతిపాదించాడు. ఈ పరిశోధనలకు గానూ, 2016 లో ఈయనకు వైద్యరంగం లో నోబుల్ బహుమతి లభించింది.
మానవ శరీరంలో ఆటోఫజీ ని యాక్టివేట్ చేసే సులువైన విధానం – కణాలకు కావలసిన పోషకాలను అందివ్వకుండా, పగటి పూట కనీసం 12 గంటల పాటు వాటిని పస్తులుంచడం. గత 14 శతాబ్ధాలుగా రంజాన్ నెలలో ముస్లింలు చేసేది ఇదే.
కాకపోతే, ముస్లింలు ఉపవాసం ఉండేది , ఆటోఫజీ కోసం కాదు. ఖురాన్ లో, సృష్టికర్త ఇచ్చిన ఆదేశాన్ని శిరసావహించే క్రమంలోనే ముస్లింలు ఉపవాసం ఉంటారు.
రేపు ఇంకో శాస్త్రవేత్త ఎవరైనా, ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి నష్టం అనే సిద్ధాంతం ప్రతిపాదించి, దానికి నోబెల్ బహుమతి వచ్చినా – ముస్లింల ఉపవాసంలో ఎలాంటి మార్పు ఉండదు. అది విశ్వాసం/నమ్మకం.
16 వ శతాబ్ధంలో నికోలస్ కొపర్నికస్ అనే ఖగోళ శాస్త్రవేత్త – సూర్యుడు చలనం లేకుండా స్థిరంగా ఉంటాడని ప్రతిపాదించాడు(Copernican Heliocentrism). 19 వ శతాబ్ధం వరకూ చాలామంది ఇదే నిజమని నమ్ముతుండేవారు. కానీ, ఆధునిక టెలీస్కోపుల ఆవిష్కరణల తర్వాత, సూర్యుడు కూడా తన కక్ష్యలో తాను పరిభ్రమిస్తుంటాడని తేలింది.
It is He who created night and day, the sun and the moon, each floating in its orbit. – Quran 21:33
ఇలాంటి ఉదాహరణలు చాలా చెప్పొచ్చు.
రంజాన్ యొక్క సిగ్నిఫికెన్స్ కేవలం పస్తులుండటం కాదు. ఖురాన్ స్పూర్తిని, ప్రవక్త జీవితాన్నీ ప్రతీ క్షణమూ గుర్తుచేసుకుంటూ, ఏదో ఓ రోజు, సృష్టికర్త దగ్గరికే వెళ్ళాల్సి ఉంటుందనే సత్యాన్ని, మనో ఫలకంపై మరింత బలంగా, పునర్ముద్రించుకునేలా చేసేదే రంజాన్.
“Oh you Believe, Decreed upon you is fasting, as it was decreed upon those before you, So that you may become righteous” – Quran 2:183
“To Fast is best for you, If you only knew” – 2:184
“The month of Ramadhan [is that] in which was revealed the Qur’an, a guidance for the people and clear proofs of guidance and criterion” – 2:185