ఇస్లాం లో కుల వివక్ష!!

‘మానవులందరూ ఒకేజంట సంతానం’ అనేది ఇస్లాం లో కోర్ కాన్సెప్ట్. ఇది ఇస్లాం కి ఆత్మ లాంటిది. దీనిలో ఎలాంటి కన్‌ఫ్యూజనూ, యాంబిగ్విటీ లేదు. ముస్లింలకు ఖురాన్ తర్వాతే, తెగల అనుబంధాలూ, రక్త సంబంధాలూ, చివరికి కుటుంబ సంబంధాలైనా. ఇస్లాం మొదలైన తొలిరోజు నుండీ ఈ పాటర్న్ ని క్లియర్ గా గమనించొచ్చు.

అక్కడొకటీ, ఇక్కడొకటీ జరిగిన, విన్న సంఘటనల్ని బట్టి -జనరలైజేషన్లు, కన్‌క్లూజన్లూ చేయడం వల్ల ఉపయోగం లేదు.

2005 లో, ఆంధ్రాలో, సయ్యద్,ముఘల్,పఠాన్ లకు తప్ప ఇతర ముస్లింలందరికీ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలియగానే – అరే.. ఎందుకూ పనికి రాని ఈ సయ్యద్,ముఘల్,పఠాన్ అనే తోకలు మనకెందుకొచ్చినయ్ రా బై – అని ఈ వర్గాలవారు తెగ బాధపడ్డారు.ఇప్పటికీ బాధపడుతున్నారు. పదో క్లాసు కంటే తక్కువ క్లాసుల్లో ఉన్న పిల్లల పేర్లనుండీ చాల మంది తల్లిదండ్రులు – ఈ తోకల్ని తీసిపడేసి, షేక్ అని పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఇతర షేక్ ముస్లింలు లైట్ తీసుకున్నారు తప్ప, మీరు వేరు-మేం వేరూ, ఇలా షేక్ అని పేరు మార్చుకుని మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు – అని ఎవ్వరూ అనలేదు. దానినో ఇష్యూ చేయలేదు. అదీ ఆ తోకలకున్న వ్యాల్యూ.

అఫ్కోర్స్ ఇస్లాం గురించి తెలీని ముస్లింలు, సయ్యద్ అనే పేరున్నోల్లందరూ అరేబియానుండీ వచ్చామని భావించే మూర్ఖపు ముస్లింలకు కొదువ లేదు. వారిని బట్టి ఇస్లాంపై ఓ అంచానాకు రావడం కరెక్ట్ కాదు కదా.

నా పేరు – షేక్ మహమ్మద్ హనీఫ్. ఈ మూడు పదాల్లో , మొదటిది,చివరిది బేకార్. చిత్తుకాగితానికున్న విలువకూడా వాటికి లేదు. మధ్యలోని పదమే అసలైంది. అదే నా ఐడెంటిటీ.

Leave a Reply

Your email address will not be published.