ఇటీవల ఉర్లోని ఓ ఫ్రెండ్ కి కాల్ చేశాను. మాటల మధ్యలో,దేశ రాజకీయాల గురించి చర్చ వచ్చింది. “తెలుగు రాష్ట్రాలు ఇప్పటికిప్పుడు ప్రశాంతంగానే ఉన్నాయిగానీ, చెడ్డీగాల్లు బ్యాక్గ్రౌండ్ లో ఏమేం స్కెచ్చు లేస్తున్నారో తెలీదు, వారికొచ్చే ఫండ్స్, వారి ప్రాబల్యం క్రమంగా పెరిగిపోతున్నట్లు మాత్రం క్లియర్ గానే కనిపిస్తుంది” – అన్నాడు. మరో కామెంట్ కూడా చేశాడు. అది – “మనోళ్ళు కూడా ఏమీ తగ్గట్లేదు. పొద్దున 4 గంటలనుండీ మొదలు పెడ్తారు, ప్రతి ఐదు-పది నిమిషాలకీ, “రోజ్ దారో ఉఠో.. సహర్ కరో.. వక్థ్ హోజారా…” – అంటూ, లౌడ్ స్పీకర్ లో అరుస్తున్నారు. చుట్టూ ముస్లిమేతరులు చాలా మంది ఉన్నారు.అసలే వేసవి కాలం, పైన డాబాలమీద పడుకుంటుంటారు, వారికి డిస్టర్బెన్స్ ఎందుకు అనే ఆలోచనలేమీ లేవు. వీళ్ళు చేసే ఇలాంటి పనులే, చెడ్డీ గాల్లు వారి మీటింగ్ లలో హైలెట్ చేస్తుంటారు.. ఈ విషయం మనోళ్ళకు ఎప్పటికి అర్థం కావాలో ఏమో” -అన్నాడు.
కొన్నేళ్ళ క్రితం, ఇదే అంశం గురించి నేను రాసిన “మసీదు లౌడ్ స్పీకర్” వ్యాసం గుర్తొచ్చింది.
‘మన మతం ఇతర మతాల్లా కాదు, అది ఇతరులకు అసౌకర్యం కలిగించదు’ – అనే ఆలోచనతో లౌడ్ స్పీకర్లు వాడకపోవడం – ఇస్లామిక్ సెన్స్.
‘ఆల్రెడీ మనం ఏ తప్పూ చేయకపోయినా, మన గురించి అబద్ధాల్ని అల్లి, మనల్ని సమాజానికి శత్రువులుగా చూపించాలని కొన్ని తోడేల్ల మందలు కాపు కాచి ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో, మనం వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, జాగ్రత్తగా మసలు కోవాలి’ – అనేది జనరల్ అవేర్నెస్ తో వచ్చే కామన్ సెన్స్.
ముస్లింలు , అటు ఇస్లామిక్ సెన్సూ లేకుండా, ఇటు కామన్ సెన్సూ లేకుండా తయారవుతున్నారనేది ఓ పరిశీలన. ఎంత వరకూ నిజమో, ఏం చెస్తే ఈ పరిస్థితి మారుతుందో అల్లాకే ఎరుక.
మసీదు లౌడ్ స్పీకర్!!
వేసవి కాలం.. తెల్లవారు ఘామున.. డాబా మీద మంచమేసుకుని గాఢ నిద్రలో ఉన్నప్పుడు, సడెన్‌గా లౌడ్ స్పీకర్లో నుండీ పెద్ద శబ్ధం వచ్చి, మీ నిద్ర డిస్టర్బ్ ఐతే, మీకేమనిపిస్తుంది?
ముస్లిమైనా, హిందువైనా, క్రైస్తవులైనా, నాస్తికులైనా అప్పుడు కలిగేది -ఇరిటేషనే.
అదృష్టం బాగుండి, ఆరోగ్యంగా ఉన్నోల్లైతే, కొద్ది సేపట్లోనే మంచంపై అటూ,ఇటూ మసలి పడుకుంటారు. నిద్రలేమి, డిప్రెషన్, యాంగ్జైటి వంటి సమస్యలు ఉన్నవారూ, వృద్దులూ.. మల్లీ నిద్రలోకి పోవడం అంత ఈజీ కాదు.
ఇప్పుడా లౌడ్ స్పీకర్ శబ్ధం మసీదు నుండీ వస్తే, ఓ ముస్లిం వ్యక్తి నిద్ర డిస్టర్బ్ ఐనా అతనికి/ఆమెకు ఇరిటేషన్ కలగదు. కానీ, ఇతరులకు మాత్రం తప్పక కలుగుతుంది. దీనిని మిగతా మతస్తులకు, వారి పండగలకూ కూడా అన్వయించుకోవచ్చు.
“మనది మనకు హాయిగా ఉంటుంది – ఇతరులకు మాత్రం ఇరిటేషన్, చికాకు,అసౌకర్యం కలిగిస్తుంది”.
“అందరూ వాడుతున్నారు కాబట్టి, మేమూ అలాగే వాడతాం. మిగతా వారినేమీ అనట్లేదు కాబట్టి, మమ్మల్నీ ఏమీ అనకూడదు” – అనేది వాదనలకు కొంత వరకూ ఉపయోగపడుతుంది. కానీ, “మా మతం మిగతా మతాల్లాంటిది కాదు, మాది ఇతరులకు అసౌకర్యాలు కలిగించే మతం కాదు” – అని నమ్మినోల్లు ఎవ్వరూ ఇలాంటి వాదనలు చేయరు, చేయకూడదు.
మహమ్మద్ ప్రవక్త 7 వ శతాబ్ధంలో జీవించారు. లౌడ్ స్పీకర్ 1850 తర్వాత పుట్టింది. 1850 కి ముందు వరకూ, ముస్లింలెవ్వరూ అజా శబ్ధం వినకుండా నమాజు చేయలేదా? రంజాన్ నెలలో తెల్లవారుజామున లౌడ్ స్పీకర్ లో అరిస్తే తప్ప లేవలేదా?గుయ్ మనే సైరన్ శబ్ధాలు లేకుండా, ఇఫ్తార్, సహరీలు చేయలేదా? అసలే ఇప్పుడు ప్రతి ఒక్కరిదగ్గరా టైం చూసుకోవడానికి వాచ్ లు ఉన్నాయి. సెల్ ఫోనుల్లోనే అలారం లు ఉన్నాయి. మనసులో ఈమాన్ ఉన్నోల్లకు ఆటోమేటిక్ గా మెలకువ వచ్చేస్తుంది.
100% ముస్లింలున్న ఏరియాల్లో లౌడ్ స్పీకర్ల ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు గానీ, భిన్న సముదాయాలు కలిసి నివస్తిస్తున్న ఏరియాల్లో మాత్రం దీని ఎఫెక్ట్ ఇన్-డైరెక్ట్ గా ఉంటుంది.
ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా జీవించడం కూడా ఈమాన్ లో భాగమే.
అందువల్ల, మిక్స్డ్ ఏరియాల్లో నివసిస్తున్న ముస్లింలు, ఆ ఏరియాకి చట్టప్రకారం గవర్నమెంట్ విధించిన డెసిబుల్ లిమిట్ ఎంతో తెలుసుకుని, దాని లోబడే సౌండ్ వచ్చేటట్లు మసీదు లౌడ్ స్పీకర్లను సెట్ చేసుకుంటే మంచిది. ఇంకా, వీలైతే, ఆ ఏరియాల్లో నివసించే ముస్లిమేతరులందరినీ ఓ రోజు మసీదుకి ఆహ్వానించి, మా వల్ల మీకేమైనా అసౌకర్యాలు కలుగుతున్నాయా అని విచారించి, జెన్యూన్ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తే ఇంకా బాగుంటుంది.
రాజ్యాంగం కల్పించిన స్వేచ్చను మిస్-యూజ్ చేయడం ఎవ్వరికీ మంచిది కాదు. ఈ రోజు మనం మిస్-యూజ్ చేస్తే, మనల్ని సాకుగా చూపి, రేపు ఇంకొకరు ఇదేపని చేస్తారు. ఇలా, ఎవరికి అనుకూలమైన విషయాల్లో వారు రూల్స్ ని తుంగలో తొక్కుకుంటూ పోతే, చివరికి రాజ్యాంగం,చట్టబద్ధమైన పాలన లాంటివి అర్థం లేని పదాలుగా మిగిలిపోతాయి.
మన దేశం ఇప్పటికే ఆ స్థాయికి చేరిన సూచనలు కనిపిస్తున్నాయి.
“మనది గ్రేట్”, “మనది బెస్ట్” అని ఉత్త మాటలు చెప్పడం కాదు. చేతల్లో కూడా చూపించాలి. ఆ బెస్ట్ ఏదో మన జీవన విధానంలో కనబడాలి. మనం కూడా అందర్లాగే అనుకున్నప్పుడు, “మనం బెస్ట్” అని ఎక్కడా క్లైమ్ చేయకూడదు.
“Indeed, Allah will not change the condition of a people until they change what is in themselves.” -Quran 13:11