ఇస్లామోఫ్రాన్సియా!!!

ఫ్రాన్స్ లో టీచర్ హత్య దారుణమైన విషయం. ఈ మాట చెప్పడంలో ఎలాంటి ఇఫ్(if),బట్స్(but) ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే, ఈ క్రైం ని మొత్తం ముస్లిం సమాజానికి ఆపాదించి అటు ఫ్రాన్స్ ప్రభుత్వం,ఇటు కొందరు ఇస్లామోఫోబిక్ విశ్లేషకులూ తమ రహస్య అజెండాల్ని అమలుపరిచే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఫ్రాన్స్ కపట రాజకీయాల్ని,దాని ఇస్లామోఫోబిక్ చరిత్రనీ అర్థం చేసుకోవాల్సి ఉంది. ముందుగా, మనోభావాల గురించి ఇటీవల ఫ్రాన్స్ లోనే జరిగిన ఓ గమ్మత్తైన విషయం చూద్దాం.

ఈ సంవత్సరం జులై నెలలో, ఫ్రాన్స్ జాతీయ జెండాలా కనిపించే ఓ బట్టతో, ఓ వ్యక్తి తన బట్(గు* ) తుడుచుకునే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి పాపం ఫ్రెంచ్ ప్రజల మనోభావాలు పెంటకంపు కొట్టాయి. ఫ్రెంచ్ న్యాయ శాఖా మంత్రి, అక్కడి సుప్రీం కోర్టూ, ఆ ఆగంతకుడిపై క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని ఆదేశించారు. ఇకమీదట ఎవరైనా ఇలా ఫ్రాన్స్ జాతీయ జెండాతో తమ గు* తుడుచుకుని ఫ్రెంచ్ ప్రజల మనోభావాల్ని గాయపరిస్తే,అది పబ్లిక్ లో చేసినా, ప్రైవేట్ లో చేసినా , వారికి కనీసం లక్ష రూపాయలు ఫైన్ విధించేలా ఫ్రెంచ్ పార్లమెంటు చట్టం చేసింది. అదండీ ఫ్రెంచు వారి మనోభావాల కథ. దీని గురించి అణుమానమున్నోల్లు -” French law protects flag after bottom-wiping incident” అని గూగుల్ సెర్చ్ చేయండి. కడుక్కుంటే పోయే ఓ బట్ట ముక్క విషయంలోనే ఇంత గింజుకున్న వీరికి, 180 కోట్లమంది ముస్లింలు తమప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించే మహమ్మద్ ప్రవక్తను మాత్రం యదేచ్చగా కించపరిచే స్వేచ్చ కావాలంట. వీళ్ళ ముఖాలకు వీరు లిబరలిజమూ,స్వేచ్చ, ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషనూ.. వంటివాటి గురించి స్పీచులిస్తే మనం వినాలి. ఇక ఆ టీచర్ విషయం చూద్దాం. ఈయన మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా గీసిన కార్టూన్లను గతంలోనూ క్లాస్ రూం లో ప్రదర్శించాడు. దీని మీద ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినా ఆ స్కూల్ యాజమాన్యం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అసలు క్లాస్ రూంలో అలాంటివి ప్రదర్శించడం వెనక ఆయన ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? దీనికి మీడియా ఇచ్చిన సమాధానం – ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి పిల్లలకు వివరించడానికంట. ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని వివరించడానికి మహమ్మద్ ప్రవక్తను కించపరిచే కార్టూన్లు చూపాలా? గు* తుడుచుకునే ఫ్రాన్స్ జెండా ఫోటోలు చూపించి ఉండొచ్చు కదా? అవి ఏవో నాలుగు గీతలు గీసి, వాటికి ప్రాఫెట్ మహమ్మద్ అని పేరు పెట్టిన మామూలు కార్టూన్లు కావు. మహమ్మద్ ప్రవక్త క్యారెక్టర్ ను అత్యంత చెడుగా చూపిస్తూ, ఆయనను నీచంగా చూపే కార్టూన్లు అవి. అలాంటి కార్టూన్లను టీనేజీ విద్యార్థులకు పనిగట్టుకుని చూపించడం ఏ రకమైన టీచింగ్ మెథడాలజీ? సరే, ఆ టీచర్ ఏదో ఓ ఉదాత్త ఆశయంతోనే అలా చేశాడనుకుందాం. ఆయన అలా చేయడం అక్కడి చట్టాలప్రకారం తప్పనిపిస్తే, ఆ ముస్లిం విద్యార్థులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది. పోలీసులు కూడా ఎలాంటి చర్యా తీసుకోకుంటే, ఆ స్కూల్ వదిలేసి మరో స్కూల్ జాయిన్ అవ్వాల్సింది. మహా ఐతే ఓ విద్యా సంవత్సరం వేస్ట్ అవుతుంది. కానీ, ఏకంగా ఓ వ్యక్తి ప్రాణం తీయడం వల్ల ప్రవక్త గౌరవాన్ని ఏ రకంగా కాపాడినట్లు. ఈ రకమైన సంకుచిత ఇస్లాం ని మీకు ఎవరు నేర్పించారు- ఈ ప్రశ్నలన్నీ ఆ టిచర్ ని చంపిన క్రిమినల్ ని అడగాలని ఉంది. పోలీసులు అతన్ని ప్రాణాలతో పట్టుకుని, ఈ ప్రశ్నలకు సమాధానాలు అతని నోటినుండే రాబట్టి, ఆ తర్వాత అతన్ని చట్ట ప్రకారం ఉరితీసి ఉండాల్సింది. ఇవేవీ లేకుండా అతన్ని చుట్టుముట్టి కాల్చి చంపారు. ఈ ప్రశ్నలన్నిటినీ శాశ్వతంగా ఎన్‌కౌంటర్ చేశారు. బహుశా వారికి ఇదే కావాలేమో. ఇలా చేస్తేనే, అతన్ని టెర్రరిస్ట్ అనీ, ఇస్లామిక్ టెర్రరిజమే దీనికి కారణమనీ ఫ్లాష్ న్యూస్ లు వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వందలాది మసీదుల్ని మూసేయించొచ్చు, ముస్లింలను అర్థరాత్రి ఇండ్ల నుండీ ఎత్తుకెల్లొచ్చు. వారి చారిటీ సంస్థల్ని నిషేధించొచ్చు. లిబరల్స్ గానీ, హక్కుల కార్యకర్తలు గానీ ఎవ్వరూ వీటి గురించి మాట్లాడరు. ఇప్పుడు ఫ్రాన్స్ లో సరిగ్గా ఇదే జరుగుతుంది. పైకి లిబర్టీ, ఫ్రీడం అంటూ నంగనాచి పదాలు వళ్ళెవేసే ఫ్రాన్స్ చరిత్ర మొత్తం హిపోక్రసీతోనే నిండిపోఇంది. అల్జీరియా పై దాడి చేసి, ఆ దేశాన్ని వందేళ్ళపాటు తన కాలనీగా మార్చుకుని అక్కడి లక్షలాది ముస్లింలను కిరాతకంగా చంపేసింది. నాస్తికత్వం పేరుతో వేలాది క్రైస్తవ ఫాదర్లు,పాస్టర్లను హతమార్చింది. ********18 వ శతాబ్ధం చివర్లో, ఇలాగే మహమ్మద్ ప్రవక్తను కించపరిచే ఓ హాస్య నాటికను ప్రదర్శించడానికి ఫ్రాన్స్ సిద్ధమైంది. ఈ విషయం తెలిసి అప్పటి అట్టోమన్ ఖలీఫా సుల్తాన్ అబ్దుల్ హమీద్-II, ‘మర్యాదగా ఈ ప్రయత్నాలను విరమించుకోకపోతే’, తాను ఫ్రాన్స్ పై యుద్ధం ప్రకటిస్తానని హెచ్చరించాడు. అప్పట్లో సుల్తాన్ వార్నింగ్ కి భయపడిన ఫ్రాన్స్- ఆ నాటికను నిషేధించి- ఆ నాటకాన్ని ప్రదర్శించే కళాకారులందరినీ బ్రిటన్ కు పంపించింది. కొన్ని రోజుల తర్వాత, ఈ కళాకారులందర్నీ కూడగట్టి, బ్రిటన్ ఇదే నాటకాన్ని ప్రదర్శించడానికి పూనుకుంది. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సుల్తాన్ కోరగా, అట్టోమన్ కన్నా ఎక్కువ సైనిక,ఆయుధ సంపత్తి బ్రిటన్ దగ్గర ఉండటంతో, సుల్తాన్ హెచ్చరికల్ని బ్రిటన్ పెడచెవిన పెట్టింది, ” This is not France. We have freedom in our borders.” ” – అని సమాధానమిచ్చింది.దీనికి సమాధానంగా – ” ఇస్లాం కోసం మా పూర్వీకులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. అదే బాటలో నడవడానికి నేను ఒక్క క్షణం కూడా సందేహించను. మీరు ఇస్లాం ని పనిగట్టుకుని కించపరుస్తున్నారనీ, మీకు వ్యతిరేకంగా పోరాడటం, ప్రతి ముస్లిం యొక్క కర్తవ్యమనీ నేను ఫత్వా జారీ చేస్తాను. దీని పరిణామాలు ఎలా ఉండబోతాయో మీరు ఊహించుకోవచ్చు – అని సమాధానం ఇచ్చాడు. అప్పట్లో తమ ఆధీనంలో ఉన్న ఇండియా లాంటి దేశాల్లో అధిక సంఖ్యలో ముస్లింలున్న విషయం తెలిసిన బ్రిటన్, ఎందుకొచ్చిన గొడవలెమ్మని – ఆ నాటక ప్రయత్నాల్ని విరమించుకుంది. **********ఇప్పుడు ముస్లింల తరుపున ఇలా ధైర్యంగా,డిప్లొమాటిక్ గా మాట్లాడే నాయకుడు లేదు. పెట్రో సంపదతో తులతూగే దేశాలు ఎవరి తొత్తులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెంట్రల్ లీడర్షిప్ అంటూ ఒకటి లేకపోయినప్పటికీ, ఖురాన్, ప్రవక్త బోధనల్లోని రేషనాలిటీకి అట్రాక్ట్ అయ్యి, అమెరికా,యూరప్ లలో లక్షలాది మంది ఇస్లాం లోకి కన్వర్ట్ అవుతున్నారు. ఈ విషయం అందరికంటే ఎక్కువగా, ఇస్లామోఫోబులకే తెలుసు. దీనికి అడ్డుకట్టవేయాలంటే ఇస్లాం ని బద్నాం చేయడమొక్కటే వారికి పరిష్కారంగా తోస్తుంది. ఎవరికి తోచిన పరిష్కారం వారు చేసుకోవచ్చు. అట్లే, ముస్లింలు చేయాల్సింది – ఇస్లాం లోని మంచిని తెలుసుకోవడం,పది మందికీ చెప్పడం, ఆచరించి చూపడం మాత్రమే. సృష్టికర్త అందరికీ శాంతిని ప్రసాదివ్వుగాక. ఆమీన్.శుక్రవారం.ఇన్(With inputs from Smile2jannah)

Leave a Reply

Your email address will not be published.