కొన్నేళ్ళ క్రితం, ఆంధ్రజ్యోతి పత్రికలో, “నేను-మా జేజబ్బ-పాకిస్తాన్” – అనే టైటిల్ తో నేను రాసిన ఓ వ్యాసంలో ఈ క్రింది విషయాలు మెన్షన్ చేశాను. <==నేను పుట్టింది 1981లో, మా నాన్న పుట్టింది 1950లో. కాబట్టి దేశవిభజనతో మాకు ప్రత్యక్ష సంబంధం లేదు. ఎవరైనా అడగాలనుకుంటే, దేశవిభజన సమయంలో నువ్వు పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళలేదని మా జేజబ్బని అడిగి ఉండవచ్చు. ఆయన 1987లోనే మరణించారు కాబట్టి, నిరక్షరాస్యుడు కావడంతో, డైరీలు గట్రా లాంటివేమీ రాయలేదు కాబట్టీ, ఆయన ఎందుకు వెళ్ళలేదనే విషయం కశ్చితంగా తెలిసే ఆస్కారం లేదు. కాకపోతే, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా విశ్లేషిస్తే దానికి సమాధానం దొరికే అవకాశం ఉంది.
-ఆయన కడప,నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న, నరసాపురం అనే మారుమూల కుగ్రామంలో జన్మించారు. మరణానంతరం అక్కడే ఖననం చేయబడ్డారు.-ఓ పూరి గుడిసె తప్ప ఆయనకు ఇతర ఆస్తులు గానీ,పొలాలు గానీ లేవు. జీవితాంతం ఆ గ్రామంలోని రెడ్ల పొలాల్లో కూలీగానే పనిచేశారు.-ఆయనకు బాగా తెలిసిన భాష తెలుగు మాత్రమే. హింది,ఉర్దు భాషల్లో కొన్ని,కొన్ని పదాలు మాత్రమే పరిచయం. – ఆయనకు అరబిక్ సూరాలు గానీ,నమాజు చేసే విధానం గానీ తెలియదు. కేవలం, రంజాన్, బక్రీద్ లాంటి పండగలప్పుడు మాత్రమే మసీదుకు వెళ్ళేవాడు.- ఆయన స్థోమతకు గొడ్డు మాంసం మాత్రమే అందుబాటులో ఉండింది. పొట్టేలు మాంసం పండగలప్పుడో, చుట్టాలు వచ్చినప్పుడో మాత్రమే తినగలిగేవాడు. ఈ అంశాల ఆధారంగా మనం కొన్ని నిర్ధారణలకు రావచ్చు.1. చాతుర్వర్ణ వ్యవస్థ మూలంగా సమాజం నుండి దూరంగా వెలివేయబడ్డ నిమ్న కులాలు, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రధానంగా బోధించే ఇస్లాం,క్రైస్తవ మతాల పట్ల ఆకర్షితులు అయ్యారనేది ఇప్పటికే రుజువైన అంశం. మా జేజబ్బ కూడా అలా ఇస్లాం లోకి మారిన మొదటి లేక రెండవ తరం వ్యక్తి.==>తర్వాత ఆ వ్యాసం హిందూ-ముస్లిం రాజకీయాల్ని చర్చించింది. *************ఇప్పుడు నా ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్#1:మా జేజబ్బ మాల/మాదిగ/యానాది/దూదేకుల/హరిజన/దలిత – వంటి.. ఏదో ఓ ఐడెంటిటీకి చెందిన వ్యక్తి. అదేదనే విషయం పరిశోధించి తెలుసుకుని, నేను కూడా అదే ఐడెంటిటీని క్యారీ చేయడం. ఇలాంటి ఐడెంటిటీ క్యారీచేసే ముస్లింలను ప్రభుత్వం ప్రత్యేక వర్గంగా గుర్తించాలనీ, వారి మంచి కోసం ఏవైనా పధకాలు ప్రవేశపెట్టాలనీ వ్యాసాలు రాసి, ఉద్యమాలు చేయడం.. ఇదంతా చేస్తూ కూడా, ఈ కేటగిరీ కిందికి రాని ఇతర ముస్లింలతో -“మేమూ మీలాంటి ముస్లింలమే, మా పట్ల వివక్ష చూపకుండా మీతో సమానంగా చూడండి బ్రో అని అబ్యర్థించడం/వాదించడం/చర్చించడం.” ఆప్షన్#2:మా జేజబ్బ తనకు జీవితం పై ఉన్న అవగాహన, తన ముందున్న ఆప్షన్స్ ఆధారంగా జీవించారు. మా నాన్న కూడా ఆయనకు ఉన్న అవగాహన, ఆయన ముందున్న ఆప్షన్స్ ఆధారంగా జీవించారు. ఇప్పుడు నేను, నాకున్న అవగాహన ఆధారంగా జీవిస్తున్నా. నా అవగాహన ప్రకారం – మా జేజబ్బ, ఆయన జేజబ్బ, ఆయన జేజబ్బ జేజబ్బ… – వీరందరూ సృష్టికర్త సృష్టించిన తొలిజంట “ఆదం-హవ్వా” ల సంతానం. సృష్టికర్త ఆదేశానుసారం జీవించడమే ఏ తరం వారైనా చేయాల్సింది, దాని ద్వారానే జీవితానికి సార్థకత లభిస్తుంది. ప్రస్తుతం చిట్టచివరి ప్రవక్త అయిన మహమ్మద్(స) అడుగుజాడల్లో నడవడమే నేను చేయాల్సింది.. అందుకే నన్ను నేను ‘ముస్లిం ‘ గా ఐడెంటిఫై చేసుకున్నా. నాకు ఈ ఒక్క ఐడెంటిటీ చాలు, ఇతర ఐడెంటిటీలు అవసరం లేదు. ******అదీ విషయం. ఆ రకంగా నేను ఆప్షన్#2 ను ఎంచుకున్నా.నా మటుకు నేను ఆదం-హవ్వాల సంతతిగానే భావిస్తా.. ఎదుటి వ్యక్తి కూడా నాలాగే ఆదం-హవ్వాల సంతతే కాబట్టి నా తోబుట్టువుగానే భావిస్తా.. ఆ ఎదుటి వ్యక్తి తనను తాను ఎలాంటి(నాస్తిక్,దలిత్,బ్రామిన్, etc.. ..) ఐడెంటిటిలతో పిలుచుకున్నప్పటికీ.. ఇతరులు ఎవరేం ఆప్షన్స్ ఎంచుకోవాలి, ఎలాంటి ఐడెంటిటీల్ని క్యారీ చేయాలనేది ఎవరికివారు తేల్చుకోవచ్చు. నా వరకూ నాకు మహమ్మద్ ప్రవక్త మెసేజ్ ని ఆచరించడం, సాధ్యమైనంతవరకూ ఇతరులకు ఆ మెసేజ్ చేరవేయడం.. ఇదే నేను చేయాల్సింది..చేస్తున్నదీ.. ఇన్షాల్లాహ్.. ఇక ముందు కూడా చేయబోయేది. ఇన్షాల్లా..