ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టింది.. చివరికి..

Rosie Gabrielle – 1986 లో కెనడాలోని, వాంకోవర్ లో పుట్టింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, సింగర్ కూడా. 19 సంవత్సరాల వయసప్పుడు, ఓ టూరిస్ట్ బృందంతో కలిసి -థాయిల్యాండ్, బర్మా, వియత్నాం, కాంబోడియా, లాఓస్ దేశాల టూర్ కి వెళ్ళింది. థాయిల్యాండ్ లో, ఓ సారి, ఆమె బృందం వారు వెల్తున్న టూరిస్ట్ బస్ మిస్ అయ్యింది. తరువాత, వేరే వ్యక్తి సహాయంతో బైక్ పై ఆ బస్ వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళింది. బైక్ లో వెళ్ళడానికీ, బస్సులో వెళ్ళడానికీ ఉన్న తేడా అప్పుడే ఆమెకి అర్థమైంది. ఓ ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నా, అక్కడి ప్రజల్ని, సంస్కృతులనీ అర్థం చేసుకోవాలన్నా బైక్ పై వెళ్ళడమే కరెక్ట్ అని అప్పుడే అర్థమైంది. వెంటనే థాయిల్యాండ్ లో, ఓ యమహా బండి కొని ఈ మూడు దేశాల్లో 2000 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణం చేసింది.

అనంతరం, కెనడాకి తిరుగు ప్రయాణమైంది. ఓ సింగింగ్ బ్యాండ్ లో, సింగర్ ఆడిషన్స్ కి అటెండ్ అయింది, సెలెక్ట్ కూడా అయింది. కాకపోతే, ఒక కండీషన్. రెండు వారాల్లో ఒమన్ కి వెళ్ళాల్సి ఉంటుందనీ,అక్కడే 6 నెలలు ఉండాల్సి ఉంటుందనీ, దానికి ఓకే అంటేనే కాంట్రాక్ట్ సైన్ చేయొచ్చనేది – ఆ కండీషన్.

అక్కడ గ్రాండ్ హయత్ లో కొన్ని ప్రోగ్రాంస్ చేయడం, ఆమెకు ఇచ్చిన టాస్క్.

అది ముస్లిం కంట్రీ అని, అక్కడికి వెళ్ళడం శ్రేయస్కరం కాదనీ కెనడాలో కొందరు సలహా ఇచ్చారు. కానీ, ఏది భయమనిపిస్తే ముందది చేసేయాలనే డేర్ డెవిల్ యాటిట్యూడ్ ఉన్న Rosie Gabrielle, ఆ జాబ్ కి ఓకే చెప్పింది.

ఆరు నెలల కాంట్రాక్ట్ తర్వాత, ఒమన్ లోనే ఓ, ఫోటోగ్రఫీ కంపెనీ పెట్టింది. అది మంచి లాభాలు గడించింది కానీ, రొటీన్ వర్క్ చేయడం ఈమెకే బోర్ అనిపించేసి, ఆ కంపెనీని అమ్మేసింది. ఆమెకు క్లోజ్ గా ఉన్న ఓ ఫ్రెండ్ చనిపోవడంతో, ఆమె డిప్రెషన్ కి గురైంది. అప్పుడే ఆమెకు క్రానిక్ లైమ్ అనే ఓ రకమైన నొప్పికలిగించే జబ్బుకూడా మొదలైంది. ఇదంతా ఆమె జీవితంలో అనేక డిస్టర్బెన్సెస్ కలిగించాయి. ఈ అనుభవాలన్నిటివల్లా ఆమెకు జీవితం పై విరక్తి కలిగి, ఇలా భాధలతో చచ్చేకంటే, బతికిన కొన్నిరోజులూ తాను అత్యంత ఇష్టపడే ప్రపంచ యాత్ర చేస్తూ చావడమే మేలనుకుని ఆమె బైక్ పై ప్రపంచయాత్రకు బయలు దేరింది. మొదటి సారిగా, ఆఫ్రికా టూర్ కి బయలు దేరింది.

ఆఫ్రికాలో పది దేశాలు తిరిగింది. అప్పుడే ఆమె ట్రావెల్ బ్లాగ్ రాయడం మొదలు పెట్టింది. ఆమె పోస్టులు, వీడియోలూ విపరీతంగా పాపులర్ అయ్యాయి. అనంతరం ఆమె కెనడా-అమెరికాల మధ్య కూడా బైక్ ప్రయాణం చేసి మొత్తం అణుభవాలను వీడియో రికార్డ్ చేసింది.

ఆరోగ్యం కాస్తా కుదుటపడటంతో, తన మకాం మళ్ళీ ఒమన్ కి మార్చింది. అక్కడి నుండీ యూఏఈ,ఈజిప్ట్ లాంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో సోలోగా బైక్ పై తిరిగింది. చివరికి గతేడాది పాకిస్తాన్ లోకి అడుగుపెట్టింది. సూమారు మూడు నెలలు, బలూచిస్తాన్ లాంటి పాకిస్తాన్ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగింది.

ఆమె తిరిగిన ముస్లిం మెజారిటీ దేశాల్లో, ఆమెకు ఎదురైన అనుభవాలు, అక్కడి ప్రజలు ఆమె పట్ల చూపించిన ప్రేమాభిమానాలు, ఒంటరిమహిళ అని తెలిసి కూడా అక్కడి పురుషులు ఆమెతో గౌరవంగా మెలిగిన విధానం, ఎంత పేదవారైనా, తమ దగ్గర ఉన్నది ఆమెతో షేర్ చేసుకోవాలనే ప్రయత్నం, ఇవన్నీ ఆమెకు ఇస్లాం పై ఆసక్తి కలిగేలా చేశాయి. మొత్తానికి, జనవరి 5, 2020 న ఆమె తనను తాను ముస్లిం గా ప్రకటించుకుంది.

“I feel its so important to share the truth that is Islam, which is peace, love and oneness. It is one of the most critized, osterzied, and misunderstood religions worldwide from both non Muslims AND Muslims !!! As in any religion, there are many interpretations and personal views/sects, which is not the true teachings of God, this is Human flaw. And its taking away from the true essence of God and Humanity, which is oneness and equality for all, instead its creating division. I’ve been on a deep spiritual path now for many years, and after spending so many years in a Muslim country, especially after traveling Pakistan, I learnt so much. So much about my own self, God and what Islam really is- FROM THE FIRST HAND PERSPECTIVE.” -ఇలా తాను ఎందుకు ఇస్లాం లోకి మారిందో వివరిస్తూ ఓ సుదీర్ఘ వ్యాసం రాసింది. ఆమె పేరుమీదున్న యూటూబ్ చానెల్ లో, ఆ వ్యాసాన్ని, ఆమె రికార్డ్ చేసిన జర్నీ యొక్క వీడియోలనూ చూడొచ్చు.

************

ఇదేదో ఒక్క రోజీ గాబ్రెయిల్ అనుభవమే కాదు. ఇస్లాం గురించి తెలుసుకుని, దానికి అట్రాక్ట్ ఐన, ఇంకా అవుతున్న వెస్ట్రన్ మహిళల సంఖ్య లక్షల్లోనే ఉంది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు, ఇస్లాం గురించిన నెగెటివ్ వార్తలు వైరల్ అయినంతగా, పాజిటివ్ వార్తలు ఎప్పటికీ వైరల్ అవ్వవు. అందుకే వీటి గురించి ఎవరికీ తెలీదు. ఎవరో కొందరికి తెలీనంత మాత్రాన నిజం నిజం కాకపోదు.

ఇస్లాం గురించి కొందరు చెప్పే కాకమ్మ కథల ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటారో, ఇలాంటి ముస్లిమేతరులు, తమ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ల ద్వారా చెప్పే విషయాల ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటారో, ఎవరి ఛాయిస్ వారిదే.

Leave a Reply

Your email address will not be published.