ఒక ట్వీట్ – కొన్ని స్పందనలు

స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనే చట్టం ప్రకారం – ఓ స్త్రీ-పురుషుడు పెళ్ళి చేసుకుంటుంటే, అది ఇస్లాం ప్రకారం ఎలా సరైందికాదో వివరించే ఆ ముఫ్తీ గారి ట్వీట్ అర్థరహితమైంది, అసంధర్భమైంది, కొంచెం పరుష పదజాలం ప్రకారం చెప్పాలంటే -“నోటి దూల” లాంటిది. సోషల్ మీడియాలో ఆ ట్వీట్ కొచ్చిన ఇంత భారీ రెస్పాన్సూ, అటు లిబరల్స్+ ఇటు సంఘీస్ ఇద్దరూ కలిసి ఆ ట్వీట్ ని, ఇస్లాం ని అట్యాక్ చేస్తున్న తీరూ – ఇవన్నీ గమనించాక, ఆ ట్వీట్ ని మరింత లోతుగా అనలైజ్ చేయడం అవసరం అనిపించింది.

ముందుగా ఆ ట్వీట్ లో ఆయన చెప్పింది – “స్వరా భాస్కర్ ముస్లిం కాదు కాబట్టి, ఆమె పెళ్ళాడబోయే వ్యక్తి పేరు ముస్లిం అయినప్పటికీ, ఖురాన్ ప్రకారం ఆ పెళ్ళి అల్లాకు సమ్మతం కాదు”- అని. ముందే చెప్పినట్లు, వారు పెళ్ళి చేసుకున్నది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనే చట్టం ప్రకారమే తప్ప, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కాదు. అలాంటప్పుడు అది అల్లాకు సమ్మతమా,కాదా అనే ప్రశ్నే అర్థ రహితం. తగుదునమ్మా అని ఈయన ఒపీనియన్/జడ్జిమెంట్ చెప్పాల్సిన అవసరమే లేదు.

సరే చెప్పాడు, ఇప్పుడు ఆ జడ్జిమెంట్ మీద చాలా మంది రివర్స్ జడ్జిమెంట్లు ఇస్తున్నారు. అది కూడా వారి హక్కే. కానీ, కనీసం ఆ ట్వీట్ పూర్తిగా చదవాలనే కనీస కామన్సెన్స్ ఉండక్కర్లేదా? ఆ ట్వీట్ లో అతి ముఖ్యమైన, చివరి లైన్ ని వదిలేసి, ఆ లైన్ కి పూర్తి వ్యతిరేకమైన అర్థాన్ని ఆ ట్వీట్ కి ఆపాదించి , ఆయన్ను+ఇస్లాం ను తిట్టేపనికి చాలా మంది పూనుకున్నారు.

ఆ ట్వీట్ లో, అందరూ విస్మరిస్తున్న – దాన్లోని చివరి లైన్ – If she accepts Islam only for the sake of marriage, It is not accepted by Allah. ఈ లైన్ అర్థమేంది..? ఇంగ్లీష్ రానోల్ల కోసం, వచ్చినా అర్థం చేసుకోలేని అర మెదళ్ళకోసం, -“ఓ ముస్లిమేతర మహిళ కేవలం పెళ్ళి కోసమే ఇస్లాం లోకి మారినా, ఆ వివాహం అల్లాకు సమ్మతం కాదు” అని. అంటే దానర్థం ఏంటి..?

ఓ ముస్లిం అబ్బాయి, ఓ ముస్లిమేతర అమ్మాయి వెంట – “నీ కళ్ళు బాగున్నాయి, నీ ముఖం బాగుంది, నీ మనసు బాగుంది ..అని ఆమె వెంటపడి, ఐ లవ్యూ చెప్పి, ఆమె తో కూడా “ఐలవ్యూ టూ” అని చెప్పించుకుని, తీరా పెళ్ళి టయానికి, ఆమెతో కలిమా చదివించేసి, షబానా అనో, జరీనా అనో పేరు మార్పించేసి, ఆమెను ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం నిఖా చేసుకున్నా కూడా, ఆ పెళ్ళి అల్లాకు సమ్మతం కాదు అని.

మరి ఏం చేయాలంట..?
ముందుగా ఆమెకు ఐలవ్యూ అని చెప్పకుండా, ఆమెతో చాటింగులు,డేటింగులూ చేయకుండా.. “ఇస్లాం ఎంత గొప్పదో తెలుసా”, అని ఆమెకు ఇస్లాం బోధించి, ఆమె మనసా,వాచా,కర్మేనా సృష్టికర్త,ప్రవక్తలు,మరణానంతర జీవితం.. వంటి అంశాలన్నిటినీ నమ్మి, స్వతహాగా తనను తాను ముస్లిం గా ప్రకటించుకుంటే, అప్పుడు మాత్రమే ముస్లిం పురుషులు ఆమెను వివాహం చేసుకోవచ్చు, ఆ వివాహం మాత్రమే అల్లాకు సమ్మతమైనది”.

ఇది అయ్యే పనేనా..? ముస్లిం యూత్ కి తెలిసిన ఇస్లామే అంతంత మాత్రం. అలాంటప్పుడు, ఓ ముస్లిమేతర అమ్మాయికి ఇస్లాం ని బోధించి ఆమెను స్వర్గ-నరకాల గురించి కన్విన్స్ చేసి, ముస్లిం గా మార్చి, ఆ తర్వాత ప్రొపోజ్ చేసి పెళ్ళి చేసుకోవడం అయ్యేపనేనా..?
మొత్తానికి ఆయన ట్వీట్ యొక్క ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఏంటంటే – – ముస్లిం పురుషులు అన్నీ మూసుకుని కేవలం ముస్లిం మహిళల్నే పెళ్ళి చేసుకోండి-అని. దీన్లో ఎవరైనా బాధపడాల్సిందేముంది..?

ముస్లిమేతర మహిళల జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడు కాబట్టి, లవ్ జీహాద్ గురించి ఏడ్చే సంఘీ బ్యాచ్, + కొందరు క్రైస్తవులు(కేరళలో ముందుగా లవ్ జీహాద్ రూమర్ లేపింది క్రైస్తవులే.) … చప్పట్లతో స్వాగతించాల్సిన ట్వీట్ ఇది. కానీ, ఆమెను ఇస్లాం లోకి మార్చాలని బలవంత పెట్టడానికే ఆయన ఈ ట్వీట్ చేశాడని అరమెదడు గాల్లు తీర్మాణాలు చేస్తుంటే, ముసుగు చెడ్డీగాల్లు చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నారు. “అవును ఇస్లాం అలాంటిదే”, “అన్ని మతాలూ అలాంటివే” అని సోది జడ్జిమెంట్లు ఒకటి. పుస్తకాలెలాగూ చదివిన ముఖాలు కావు. కనీసం ట్వీట్లన్నా పూర్తిగా చదవండి.

Leave a Reply

Your email address will not be published.