ఒక మగాడుండేవాడు.. చివరికి అతన్ని కూడా..

ఆండ్ర్యూ టేట్- అతనో కిక్ బాక్సింగ్ ఛాంపియన్. 19 మ్యాచుల్లో 17 గెలిచాడు. పుట్టింది ఇంగ్లండ్ లో. పెరిగింది యూరప్-అమెరికాల్లో. బాక్సింగ్ రిటైర్మెంట్ తర్వాత అనేక బిజినెస్లు స్టార్ట్ చేశాడు. ఆన్లైన్ ఇన్‌ఫ్లూయెన్సర్ గా అనేక బ్రాండ్ లకు మార్కెటింగ్ చేసేవాడు. నెలసరి సంపాదన 40కోట్లపైనే. క్రిప్టో కరెన్సీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. మొత్తం సంపద రెండున్నరవేల కోట్ల రూపాయలు.

అసలు చెప్పుకోవాల్సింది వీటన్నిటి గురించి కాదు.. వివిధ అంశాలపై అతని అభిప్రాయాల గురించి.

స్త్రీ-పురుష సంబంధాల గురించి -“ఆడోల్లు ఆడోల్లలా ఉండాలి, మగాల్లు మగాల్లలా ఉండాలి” అని చెప్పేవాడు.
“ఆడోల్లేంది-మగాల్లేంది..? అంతా సమానమేననే, ఏమీ తేడాలేదు”- అనే ఇంటర్ప్రెటేషన్ కి సమాజం ఇప్పటికే చాలావరకూ సింక్ అయిపోయి ఉంది కాబట్టి- చాలా మందికి ఇతను చెప్పే విషయాలు మింగుడుపడలేదు.

“ఆడా-మగా సమానం” – అనే ఆధునికతకు తర్వాతి స్టేజ్.. ఇవి రెండూ కాకుండా మధ్యలో ఇంకో రెండో,మూడో,నాలుగో..ఇంకా ఎన్నో(LGBTQXYZ+) రకాలు ఉన్నాయనీ, వీరందరూ కూడా సమానమేననీ, హార్మోన్లు ఎక్కించుకుని, ఆపరేషన్లు చేసుకుని ఎవరు ఎలాగైనా మారిపోవచ్చనీ – వీరందరినీ చూసి పులకించిపోవడం తప్ప, తల్లిదండ్రులు కూడా ఏమీ అనడానికి లేదనీ, అదే గొప్ప ఆదర్శమనీ కూడా ఇప్పుడు చెప్తున్నారు.
ఆండ్ర్యూ టేట్ మాత్రం దీని గురించి మాట్లాడేవాడు. ఇదంతా పైత్యం, వినాశకరం, మెడికల్ మాఫియా మాయాజాలం అనీ బల్లగుద్ది వాదించేవాడు.

అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం – “ఇస్లాం మీద రాళ్ళేస్తేనే మేధావి”- అనే ప్రస్తుత ఇస్లామోఫోబిక్ యుగంలో, అతను ఇస్లాం గురించి పాజిటివ్ గా మాట్లాడేవాడు. తాను ప్రపంచంలో అనేకదేశాలు చూశాననీ, ముస్లిం దేశాల్లో ఉన్నంత సామాజిక భద్రత, అక్కడ ఉన్నంత ప్రశాంత కుటుంబ జీవితం ప్రపంచంలో వేరే ఏ దేశాల్లోనూ చూడలేదనీ, చాలా ఏళ్ళనుండీ ఇస్లాం ని లోతుగా స్టడీ చేస్తున్నాననీ, పూర్తిగా కన్విన్స్ అయిననాడు ముస్లిం గా మారడానికి వెనుకాడననీ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు.

గడచిన రెండు,మూడేళ్ళలో – అమెరికా,యూరోప్ లలో ఇతని ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా టీనేజ్ యువతీ-యువకులు ఇతని మాటలకు సమ్మోహితులయ్యారు. సోషల్ మీడియాల్లో ఇతని ప్రతి స్పీచ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సాధించింది. అక్కడి యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆండ్యూ టేట్ ని అనుకరించడం, అతని వ్యూస్ గురించి సీరియస్ గా డిస్కస్ చేయడం మొదలుపెట్టారు.

ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది.

గతవారం, కేవలం రెండు రోజుల వ్యవధిలో – ఫేస్బుక్,యూటూబ్,స్నాప్చాట్,టిక్-టాక్ అన్నీ, మూకుమ్మడిగా ఇతన్ని బ్యాన్ చేశాయి. ఇతని వీడియోలు ఎక్కడా అందుబాటులో లేకుండా చేశాయి. ఫేస్బుక్,యూటూబ్ లు అమెరికావి- టిక్-టాక్ చైనా ది. అమెరికా-చైనాలు శత్రువులు అదీ-ఇదీ అంటుంటారు కదా, అలాంటప్పుడు అమెరికన్ యాప్ లు బ్యాన్ చేస్తే , టిక్-టాక్ దానికి విరుద్ధంగా చేయాలి కదా, కానీ, ఈ విషయంలో మాత్రం మరుసటిరోజే టిక్-టాక్ కూడా అన్ని వీడియోల్నీ తొలగించింది.

సల్మాన్ రష్దీ, తస్లీమా నస్రీన్, ఫ్రెంచ్ కార్టూన్లు, వీటన్నిటి ప్రస్తావన రాగానే- ఫ్రీడమ్మాఫ్ స్పీచూ, గీచూ అంటూ ఉన్నత విలువలు బోధించే సోకాల్డ్ ఆదర్శ వీరులకు, ఆండ్ర్యూ టేట్ ని బ్యాన్ చేస్తున్నప్పుడు అవన్నీ గుర్తుకు రాలేదా..? అతని అభిప్రాయాలు అతను చెప్తాడు, నచ్చినోల్లు చూస్తారు, నచ్చనోల్లు చూడరు అంతే కదా, ఆ మాత్రం దానికి బ్యాన్ చేయడమెందుకు..? ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు లేరు, అడిగినా చెప్పేవారు లేరు. నిజాలు మాట్లాడిన ఎడ్వర్డ్ స్వీడన్, జూలియన్ అసాంజేలకు ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. ఇదీ ప్రస్తుతం మనం ఉంటున్న సమాజం. ఇక్కడ ఏ ఇజాల్ని ఎవరి ప్రయోజనాలకోసం ఎవరు, ఎలా ప్రాపగేట్ చేస్తున్నారో తెలుసుకోకపోతే, మందలో గొర్రెలా, ల్యాబ్లో గినియా పిగ్ లా మిగిలిపోవడం ఖాయం.

కింద లింక్ లో – బ్యాన్ తర్వాత ఆండ్ర్యూ టేట్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది, ఇది కూడా తొలగించకముందే చూడగలరు.

నోట్ : ఆండ్ర్యూ టేట్ ఉత్తమపురుషుడనో, ఇతను చేసినవన్నీ పుణ్యకార్యాలనో చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. కాకపోతే, ఫ్రీడమాఫ్ స్పేచ్ ని సెలెక్టివ్ గా వాడి, జనాలకు ఒకే టైప్ మెసేజ్ అందేలా ఎలా ప్రాపగాండా చేయొచ్చో జనాలు రియలైజ్ అవ్వాలనేదే పాయింటు.

Leave a Reply

Your email address will not be published.