“వోట్లను చీల్చడానికే ఓవైసీ ఎవరితోనూ పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నాడంట. “
ఇంతకీ ఏ పొత్తులగురించన్నయ్యా నువ్ మాట్టాడేది? రాజకీయ పొత్తులా, మొక్కజొన్న పొత్తులా? మొక్కజొన్న పొత్తులైతే, అలా మార్కెట్ కెళ్ళి కొనుక్కుని సంకలో పెట్టుకుని రావొచ్చు. రాజకీయ పొత్తులకి రెండు పార్టీలూ అంగీకరించాలి కదా. బాబూరావ్ కుష్వాహ, ఓం ప్రకాష్ రాజ్భర్, చంద్రశేఖర్ రావన్ వంటి నాయకులతో కలిసి సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకోసం తాను ఎంతలా ప్రయత్నించాడో TheLallantop ఇంటర్వ్యూలో అసదుద్దీన్ ఓవైసీ డీటైల్డ్ గా వివరించాడు. అతను చెప్తున్నవి అబద్ధాలని ఈ ముగ్గురు లీడర్లలో ఒక్కరూ కూడా ప్రకటించలేదు. పొత్తుకోసం అఖిలేశ్ యాదవ్ ఒప్పుకోకపోతే ఓవైసీ ఏం చేస్తాడు? అఖిలేష్ ఇంటిముందు టెంట్ వేసుకొని భగ్న ప్రేమికురాలి లాగా నిరాహార దీక్ష చేయాలా? ఫేస్ బుక్ లో నాలుగు సోది రాతలు రాసుకునేవారికే ‘వాడు నాకు లైక్ కొట్టకుంటే నేనెందుకు కొడతా’ అని దిక్కుమాలిన ఇగో లుండే కాలంలో, ఓ పార్టీ ప్రెసిడెంట్ కి వారి,వారి కన్సర్న్ లు వారికి ఉండవా?
అసలివన్నీ కాదుగానీ.. ఓవైసీ డ్యామేజ్ చేసింది నిజమే అనుకుంటే, కనీసం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఐనా, “నీకొచ్చిన 0.4% ఓట్ల రేంజ్ కి నీకు రెండు సీట్లో, నాలుగు సీట్లో ఇస్తాం, ఇవి తీసుకుని లొల్లి చేయకుండా మాకు మద్దతివ్వు” అని చెప్పొచ్చు కదా. ఎలక్షన్స్ ముందేమో అతన్ని చీపురుపుల్ల తీసేసినట్లు తీసేస్తారు. తీరా రిజల్ట్స్ వచ్చాక, మొత్తం అతని వల్లే అని సోకాలు పెడ్తుంటారు. ప్రతి ఎన్నికల్లో ఇదో రొటీన్ తంతు.
ఇంకొందరు ముస్లింలైతే – ఎలక్షన్స్ లేనప్పుడు మాత్రం, మన ముస్లింలకు రాజకీయ చైతన్యం లేదు, మనకంటూ నాయకుడు లేదు, పార్టీల అధ్యక్షుల చేతిలో మనోల్లు కీలుబొమ్మలు -అంటూ ఆవేశపూరిత స్టేట్మెంట్లు ఇస్తుంటారు. తీరా ఎన్నికల సమయంలో మాత్రం, మనం 15-20%తో ఏమీ చేయలేం. మనల్ని చూసి అటు 80% ఏకమవుతారు.మనం బయట తిరక్కుండా మొఖాలకు ముసుగేసుకుంటే బెటర్ -అన్నట్లు మాట్లాడుతారు. ఇవన్నీ కాదుగానీ, మా ముస్లింలకు అస్సలు ఓటు హక్కే వొద్దని చెప్పి ఉద్యమం చేస్తే బెటర్ ఏమో ఆలోచించండి. ఆరెస్సెస్ వాల్లు అడిగేది కూడా ఇదే. ఆ రకంగా వాల్లు కూడా హ్యాపీ అవుతారు.
రెచ్చగొట్టే ప్రసంగాలిస్తాడని ఇంకో ఏడుపు. ఏమిచ్చాడు..? ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటోల్లే ఈ విషయంలో ఎలా అబద్ధాల్ని ప్రచారం చేస్తరో ఆధారాలతో సహా గతంలో వివరించాను. “దేశంలోని ముస్లింల పూర్వీకులందరూ హిందువులే” అనే అమిత్ షా మాటకు కౌంటర్ గా, “పుట్టే ప్రతివ్యక్తినీ అల్లా నే పుట్టిస్తాడని” ఓవైసీ చెప్పాడు. దీనిని రెచ్చగొట్టే ప్రసంగం గా మీడియా ఊదరగొట్టింది. ఓవైసీ చెప్పింది బేసిక్ ఇస్లామిక్ బిలీఫ్ అనే విషయం ముస్లిమేతరులకు తెలియకుంటే పర్లేదు, కానీ ఆ హెడ్లైన్ లు చదివి ముస్లింలు కూడా అది రెచ్చగొట్టే ప్రసంగం అంటే,ఇక ఆ ముస్లింలను ఏమనాలి?
ఓవైసీ పై సీబీఐ,ఈడీ దాడులు ఎందుకు జరగట్లేదు..?కొందరైతే దీనిని “యురేకా” అని అరవాల్సినంత పెద్ద భీబత్సమైన లాజికల్ పాయింట్లా ఫీలైపోతుంతారు. కానీ, ఇదెంత చెత్త ప్రశ్నో తెలియడానికి పదోక్లాసు స్థాయి తెలివితేటలు చాలు. ముందసలు, బీజేపీ సీబీఐ దాడులు చేయనోల్లదరూ బీజేపీ దోస్తులే అని – ఈ రూల్ ని అందరికీ అప్లయ్ చేస్తారో,లేదో అది చూడండి.
“ఓవైసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి లాభం” – దీన్లో ఎవరికీ ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఓవైసీ మాత్రమే కాదు, ముస్లిం ఓట్లను ఆకర్షించగల పార్టీలు ఎన్ని ఎక్కువగా బరిలోకి దిగితే బీజేపీకి అంత లాభం. అందుకే అలాంటి ప్రయత్నాల్ని బీజేపీ భగ్నం చేయదు. దాన్లో భాగంగానే ఓవైసీని పనిష్/ఫినిష్ చేసే అవసరం ఇప్పట్లో తమకు లేదని బీజేపీ భావిస్తుండొచ్చు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా, ఓవైసీ ఓ పెద్ద పొలిటికల్ పార్టీతో పొత్తుపెట్టుకుని, అది తమ విజయావకాశాలకు గండి పెట్టబోతుందని తెలిస్తే, అప్పుడు బీజేపీ చేసే మొదటిపని ఓవైసీని ఏదో ఓ తీవ్రవాద చట్టాలకింద అరెస్టు చేయడమేనని నా అంచనా. ఈ ప్రమాదం ఉందని తెలిసి కూడా రాజకీయం చేయడం అంటే, ఓవైసీ పెద్ద రిస్క్ తీసుకుంటున్నట్లే.
“ఓ పక్క ఆజం ఖాన్ లాంటి నాయకున్ని అకారణంగా అరెస్టు చేసినా, అఖిలేశ్ యాదవ్ ఏమీ మాట్లాడట్లేదు” చూశారా అని శొకాలు పోతూనే, “ఓవైసీని ఇంకా అరెస్టు చేయట్లేదంటే వీళ్ళదిరికీ లింకున్నట్లే” -అని లాజిక్కులు తీసే తెలివి.. అది మామూలు తెలివి కాదు, మ్యూజియంలో పెట్టాల్సిన తెలివి.
-అగ్రవర్ణాల రిజర్వేషన్ లు రాజ్యాంగ వ్యతిరేకమని పార్లమెంట్ లో వాటిని బలంగా వ్యతిరేకించింది ఒక్క ఓవైసీ మాత్రమే.నిత్యం అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేసే పార్టీలు కూడా, ఈ విషయంలో సైలెంటైపోయాయి. -పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్లో చించి పడేసినిరసన తెలిపాడు. -ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లు అధికారంలోకి రాబోతున్నారని 2021లో మాత్రమే ప్రభుత్వానికి తెలిసింది. కానీ, అంతకు కొన్నేళ్ళముందే తన పార్లమెంట్ ప్రసంగంలో ఈ విషయం ప్రభుత్వానికి తెలిపి, దానికి అనుగుణంగా పావులు కదపకపోతే, దౌత్యపరంగా దేశం చాలా నష్టపోతుందని హెచ్చరించాడు. ఇది విని బత్తాయిగాల్లు,సూడో మేధావులు ఎప్పట్లానే అతన్ని వెక్కిరించారు. ..ఇలా చెప్పుకుంటూ పోతే, పార్లమెంటేరియన్ గా అసదుద్దీన్ ప్రతిభను,పనితీరును సూచించే విషయాలు చాలానే ఉన్నాయి.
ఫైనల్ గా, నేను ఓవైసీ ఉత్తముడనో, ముస్లిం లందరూ ఆయనకు సపోర్ట్ చేయాలనో చెప్పను. అతని స్ట్రాటెజీ పై, ప్రచారం ఫండింగ్ పై, పొత్తుల విషయంలో జరుపుతున్న సంప్రదింపులపై నా అనుమానాలు నాకూ ఉన్నాయి. అనుమానమున్నంత మాత్రాన ఎలాంటి ఆధారాలు లేకుండా “అతను అమ్ముడుపోయాడనే” కంక్లూజన్ లకు నేను రాను.
కాకపోతే, అతనికి వ్యతిరేకంగా, అతని పార్టికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు – అంటూ చాలా మంది రాసే రాతలు అర్థం,పర్థం లేనివి. ఎలాంటి లాజిక్ గానీ, ఫ్యాక్స్ట్ మీదగానీ ఆధారపడి చెప్పేవి కావు. ముస్లిం ఫోబియా నుండీ, “15%-20% ఉన్న మనకు రాజకీయాలెందుకు”- అనే మైండ్ సెట్ నుండీ వచ్చే రాతలవి. ప్రస్తుత కాలంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సైంటిస్ట్ అబ్దుల్ కలాం లాంటోల్లు సొంతంగా పార్టీపెట్టినా – ఇప్పుడు ఓవైసీ పై వచ్చే విమర్శలన్నీ యాజ్-ఇట్-ఈజ్ గా వారిపై కూడా వస్తాయి.
“ఏదో ఒక పార్టిలో తలదాచుకోకుండా మనకు సొంత నాయకత్వం ఎందుకు” అనుకున్నంతవరకూ ఓకేగానీ, సొంత నాయకత్వం కావాలనుకుంటే మాత్రం వేరే మార్గం లేదు. ఏది కావాలో డిసైడ్ చేస్కోండి. ఓ సారి డివైడ్ చేసుకున్నాక అదే మాట మీద నిలబడండి. ఎన్నికలున్నప్పుడు ఒకలా, ఎన్నికలు లేనప్పుడు మరోలా మాట్లాడితే వేస్టు.
-మహమ్మద్ హనీఫ్.
నోట్ : నేను పైన రాసిన విషయాలను సపోర్ట్/అపోజ్ చేసే Facts ఏమైనా, అది కూడా క్రెడిబుల్ సోర్సెస్ నుండీ ఉంటే వాటిని కామెంట్స్ లో రాయండి. ఫ్యాక్ట్స్ ఆధారంగా అభిప్రాయాల్ని మార్చుకోవడానికి నేనెప్పటికీ రెడీనే. “మాకు ఫ్యాక్ట్సూ తెలీవు, లాజిక్కులూ తెలీవు, కానీ నీ అభిప్రాయం తప్పని నా అభిప్రాయం” – టైపు కామెంట్లు రాయకండి. అలాంటి ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ మీ మీ వాల్స్ మీద రాసుకోండి. ఈ అంశం గురించి ఇంకో వ్యాసం రాసే ఓపిక ఇప్పట్లో లేదు. మరో ఎలక్షన్ రిజల్ట్ ఏడుపులప్పుడు మళ్ళీ కలుద్దాం. సెలవు.