ఓ యూదు మహిళ యొక్క ప్రవక్త పరిచయం

ఓ యూదు మహిళ యొక్క ప్రవక్త పరిచయం
==================================

మంచికో,చెడుకో తెలీదు కానీ, నాకు మొదటి నుండీ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవడం మాత్రమే అలవాటు తప్ప, గుడ్డిగానో, తెగింపుతోనో ఏదీ చేయను.
2002లో జరిగిన గుజరాత్ పరిణామాలు, ముస్లింలను చంపడమే ప్రధాన యోగ్యతగా మోడీ ఎదిగిన తీరుతెన్నులూ, ప్రపంచవ్యాప్తంగా అప్రతిహతంగా సాగుతున్న ఇస్లామోఫోబియా, ఇవన్నీ చూసి ఒకానొక దశలో నాకేమనిపించిందంటే – ” ఈ రోజుల్లో ముస్లింలాగా ఉండటం చాలా రిస్కీ వ్యవహారం. శరీర రంగు, పొడవు, ఫేస్ కట్.. లాంటివెలాగూ మనం మార్చలేం. కానీ, మతం మార్చుకోవచ్చు కదా. అప్పటికి, నాకు ఇస్లాం గురించి పెద్దగా తెలిసింది లేదు, నమ్మకం అసలే లేదు, అలాంటప్పుడు ఈ ఇస్లాం అనే రిస్కీ గుదిబండని నేనెందుకు మోయాలి? ఓ ప్రభుత్వ ఫారం నింపి పేరు మార్చుకుంటే సింపుల్ గా అయిపోతుంది కదా. మహా అంటే, సర్టిఫికేట్స్లో పేరు మార్చుకోవడానికి యూనివర్సిటీ చుట్టూ కొన్ని రౌండ్లు కొట్టాల్సిరావచ్చు.. కానీ, జీవితాంతం ఆ పేరును, దాని స్టిగ్మాను మోసే కంటే ఇది చాలా సేఫ్ కదా” – ఇదీ అప్పటి నా థాట్ ప్రాసెస్.

ఈ పేరు మార్చుకునే ప్రాసెస్ లో – మా ఇంట్లోవారు ఎలా రియాక్ట్ అవుతారు, వారు మరీ ఎక్కువగా హర్ట్ అవ్వకుండా వారిని ఎలా మ్యానేజ్ చేయాలి అనేది మాత్రమే నాకు కాస్త రిస్కీ గా అనిపించింది. ‘మహమ్మద్ హనీఫ్’ పేరుకు ఏమైంది అని వారు అడిగే ప్రశ్నకు ఏం కన్విన్సింగ్ ఆన్సర్ ఇవ్వొచ్చు, అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ ప్రయత్నల్లో భాగంగానే ఈ పేరులో ఉన్న -ముహమ్మద్ అనే ఆయన ఎవరు, ఆయనేం చేశాడొ తెలుసుకోవాలనిపించింది.

మసీదులో చెప్పే ప్రసంగాల్లో ఆయన గురించి అప్పటికే కొంత విని ఉన్నాను గానీ, ఆయన అభిమానులు తన్మయత్వంతో ఆయన గురించి చెప్పేవన్నీ 100 శాతం నిజమని నమ్మడమెలా? ఎందుకంటే, వీరు కూడా ఇలాంటీ వేరే ఎవరో ముస్లిం చెప్పిన విషయాల్నే నమ్మేసి అభిమానిగా మారిపోయి ఉంటారు. ఓ వ్యక్తి గురించి కానీ, ఓ అంశం గురించి కానీ అంచనాకు రావడానికి, Neutral Sources of Information ని తీసుకోవాలి తప్ప, Biased Sources ఆధారంగా కాదనేది లాజిక్. సో, అలాంటి న్యూట్రల్ సోర్సెస్ కోసం అన్వేషన్లో పడ్డాను. అలాంటి సెర్చింగ్లో దొరికిందే – Lesley Zazleton అనే ఓ యూదు మహిళ (agnostic jew) రాసిన – The First Muslim అనే పుస్తకం. లండన్లో ప్రచురితమైన ఈ పుస్తకాన్ని నెట్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. ఈ పుస్తకం మహమ్మద్ ప్రవక్తను, కేవలం ‘ఓ వ్యక్తి ‘ లాగా అనలైజ్ చేస్తుంది. ఆయన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు, దానికి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, దాని ఫలితంగా ఏం జరిగింది.. ఇలాంటి అంశాల గురించి ఈ పుస్తకంలో చక్కగా విశ్లేషించింది.
*************

హీరా పర్వతంలో ఆయనతో మొదటిసారి దైవదూత మాట్లాడిన అంశం గురించి ఏం రాసిందంటే – “ఈ అంశం నేను అంతకుముందే చాలా సార్లు విని ఉన్నాను. అందరు ముస్లిమేతరుల్లాగే నేనుకూడా ఇదొక ఫిక్షన్/కల్పిత కధే అనుకున్నాను. కానీ, రీసెర్చ్ తర్వాత నాకు దానిలో ప్రత్యేకంగా కనిపించిన అంశం ఏమిటంటే – దైవదూత సంభాషించిన తర్వాత ముహమ్మద్ ఏం చేశారు, ఎలా రియాక్ట్ అయ్యారు అనేది. నేను ఊహించినట్లు – ఆయన యురేకా!! నాకు దైవ సందేశం వచ్చింది, అంటూ అరుచుకుంటూ మక్కా వీధులగుండా పరిగెత్తలేదు. లేకా, వావ్!!.. ఈ రోజునుండీ నాకు దైవ ప్రవక్తలాగా అప్పాయింట్మెంట్ వచ్చింది, అని వెలిగిపోతున్న ముఖంతో, గాలిలో తేలిపోతూ వెళ్ళలేదు. వీటిలో ఏదైనా జరిగి ఉంటే – అప్పుడు అదంతా ఓ కట్టుకథ అని మనం తేలీగ్గా కొట్టేసే అవకాశం ఉండేది. కానీ, ఆయన రియాక్షన్ వీటన్నిటికీ విరుద్ధంగా ఉంది. అందుబాటులో ఉన్న, Earliest Sources ప్రకారం, ఆయనకు ముందుగా భయం, అణుమానం కలిగింది. తనకేదో ఆపద ముంచుకొస్తున్నట్లు ఆయన భయంతో కపించిపోయారు. ఇది జరిగాక కొన్ని రోజుల పాటు తీవ్ర జ్వరంతో మంచానికే పరిమితమయ్యారు. తనకేం జరిగిందో, తానేం చూశాడో ఆయనకే ఓ పట్టాన అర్థం కాలేదు. 1400 సం. క్రితం, ఓ చీకటి గుహలో, ఓ సాధారణ వ్యక్తికి, ఓ అసాధారణ అణుభవం ఎదురైతే, ఆయన స్పందన ఇంత కంటే భిన్నంగా ఉండే అవకాశం లేదు”

********

మహమ్మద్ గారి జీవితంలోని ఇతర కీలక ఘట్టాలైన -మదీనాకు వలస వెల్లడం, అక్కడ యూదులతో వైరం, మక్కా ఖురైష్ లతో జరిగిన తగువులు,యుద్ధాలు , తిరిగి ఆయన మక్కాలోకి అడుగుపెట్టడం వీటన్నిటినీ ఆమె అనలైజ్ చేసిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. ఈ పుస్తకం చదివిన తర్వాత, దీనిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నానని ఆమెకు మెయిల్ రాశాను. ఆమె కూడా ఓ.కే చెప్పింది కానీ, కొన్ని టెక్నికల్ ఇస్ష్యూస్ వల్ల అది ముందుకు సాగలేదు. అది పబ్లిష్ చేసింది -లండన్లోని అట్లాంటిక్ బుక్స్ అనే పెద్ద పబ్లిషింగ్ కంపెనీ. మేము ఇతర భాషల్లోని పబ్లిషింగ్ కంపెనీల్తోనే ఒప్పందాలు కుదుర్చుకుంటాం తప్ప, వ్యక్తులతో కాదనీ, తెలుగులోని ప్రముఖ పభ్లిషర్ ముందుకువస్తే తాము దానికి అనుమతిస్తామనీ చెప్పారు. నాకు ఆ వ్యవహారాలపట్ల అవగాహన లేదుకాబట్టి అది ముందుకు కదల్లేదు.

**************
Lesley Hazleton స్పీచ్ లు, TeD Talkలు అనేకం యూటూబ్ లో ఉన్నాయి. ఆసక్తి ఉన్నోల్లు చూసి తెలుసుకోవచ్చు.

-మహమ్మద్ హనీఫ్.యస్.
shukravaram.in

Leave a Reply

Your email address will not be published.