కట్టుకథల్ని బట్టబయలు చేసిన ఆక్స్ ఫర్డ్ పరిశోధన

1.9 మిలియన్ బ్రిటీష్ పౌండ్లు,
57 మంది రీసెర్చర్స్,
20 దేశాల్లో,
40 ప్రత్యేక పరిశోధనలు,
వీటన్నిటి వల్లా.. చివరికి తేలిందేమంటే – మనిషి పుట్టుకతోనే సృష్టికర్తపైన, మరణానంతర జీవితంపైన నమ్మకంతో పుడతాడని.

దీనికి క్వైట్ ఆపోజిట్ కథల్ని, నాస్తికులు రోజూ సోషల్ మీడియాలో వండి వారుస్తుంటారు. పుట్టుకతోనే మనిషి నాస్తికుడనీ, తరువాత, కొందరు పెద్దోల్లు తమపిల్లలకు మతాన్ని పరిచయం చేసి వారిని ఆస్తికులుగా మార్చేస్తారనీ చెప్తుంటారు. వీల్లే, సైన్సూ-మతం లను ఒకదానికొకటి ఆపోజిట్ బైనరీలుగా ప్రొజెక్ట్ చేసి, మతం అబద్ధమనీ, సైన్సు నిజమనీ సూత్రీకరణలు చేస్తుంటారు. ఇప్పుడు, వీరు చెప్పే సైంటిఫిక్ స్టడీ ప్రకారమే, దేవుడిపై నమ్మకం అనేది మనిషి యొక్క బేసిక్ ఇన్స్టింక్ట్ అనీ, మనిషి అర్థం-పర్థం లేకుండా గాలివాటంగా పుట్టాడనే నాస్తిక కథల్నిపిల్లలకు చెప్పకుంటే, వారు ఆస్థికులుగానే పెరిగిపెద్దవుతారనీ నిర్ధారణ అయింది.
ఈ ప్రాజెక్ట్ పేరు – ‘The Cognition, Religion and Theology Project’ led by Dr Justin Barrett, from the Centre for Anthropology and Mind at Oxford University
దీనికి సంబంధించిన లింక్ – https://www.sciencedaily.com/releases/2011/07/110714103828.htm ఈ పరిశోధన ఆధారంగా రెండు పుస్తకాలు కూడా ముద్రించబడ్డాయి.
అవి –
1. Cognitive Science, Religion, and Theology: From Human Minds to Divine Minds
2. Born Believers: The Science of Children’s Religious Belief

ఇవి రెండూ pdfdrive . in అనే వెబ్సైట్ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు.
ఆల్రెడీ తెలుసనుకుంటున్న విషయాలకీ, ఈ కొత్త విషయానికీ సింక్ అవ్వదేమో, రియాక్షన్ అవుద్దేమోననే భయమున్నోల్లు, ఎప్పట్లానే ఇగ్నోర్ చేసుకోవచ్చు.
-మహమ్మద్ హనీఫ్,
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.