కడుపు నింపే బక్రీద్!! 

కడుపు నింపే బక్రీద్!!  

=================== 

నేను: ఏ వూరు పెద్దాయనా మీది?
ఓ పెద్దాయన: సుంకేసుల కాడ.
నేను:పెద్ద మాంసమైనా తీసుకుంటరు కదా?(బీఫ్ గురించి)
పెద్దయన: మాకట్టా ఏం లేదయ్యా. ఏదైనా ఒకటే.
నేను: ఏ మాత్రం వస్తుంది ఒక్కొక్కరికి?
పెద్దాయన: 2,3 కిలోలు.
నేను:ప్రతి సంవత్సరం వస్తరా?
పెద్దాయన: అవ్నయ్యా ప్రతేడూ వస్తంటం.
నేను:ఏం చేస్తారు ఒక్కసారిగా ఇంత మాంసం?
పెద్దాయన:తీస్కపోయి ఎండేసుకుంటం.

ఇది ఈ రోజు నేను రికార్డ్ చేసిన వీడియోలోని భాగం. నిజానికి ఫేస్ బుక్ లో పోస్ట్ చేద్దామనే రికార్డ్ చేశానుగానీ, ఆ బీద మొఖాల్ని ఫేస్ బుక్కులో అందరికీ చూపించడం నచ్చక ఆ ఆలోచన విరమించుకున్నా. వారి ముఖాలు బ్లర్/జిగ్ జాగ్ చేసేంత ఓపిక,సాఫ్ట్ వేర్ ఇప్పుడు లేవు.

మా సొంతూరు పోరుమామిళ్ళలో ఉన్నన్నాల్లూ, నాకు బక్రీద్ పండగ ఎందుకు చేసుకుంటారు, అనే అంశం గురించి అంత కన్విన్సింగ్ ఆన్సర్ దొరకలేదు. అక్కడ పండగ చేసుకునే విధానం అలా ఉంటుంది. ఎవరికి వారు ఓ పొట్టేలు తీసుకువచ్చి, దాన్ని కోసి, మాంసం 150-200 గ్రాములు ఉండే చిన్నపాటి కవర్లలో ప్యాక్ చేసి బంధు,మిత్రులకు, వీధిలో చుట్టుపక్కల వారికీ పంచుతారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే – నేను ఓ బంధువుకు ఇస్తే, ఆ బంధువు కూడా వాళ్ళింట్లో కోసిన పొట్టేలు ప్యాకెట్ తెచ్చి నాకు ఇస్తాడు. మొత్తానికి ఆ మాంసం అక్కడక్కడే, అంటే, దాదాపు సమాన ఆర్థిక స్థోమత కలిగిన వారిమధ్యనే తిరుగుతుంటుంది. ఒకవేల ఈ సంవత్సరం ఏ బంధువైనా, ఏ కారణంతో నైనా పొట్టేలు తీసుకురాకుంటే, అతను ఠంచంగా తరువాత సంవత్సరం తెచ్చి, పొయినసారి ఎవరెవరు తనకు మాంసం ఇచ్చారో గుర్తుపెట్టుకుని మరీ తీసుకెల్లి ఇస్తాడు. ఈ రకంగా అదో స్టేటస్ సింబల్ లాగా, ఇచ్చిపుచుకునే వ్యవహారం లాగా ఉండింది.

కానీ, కడప పట్టణంలో అలా కాదు.

బక్రీద్ పండగ, ఆ తర్వాతి రెండు రోజులూ, కడప పట్టణంలో ని ముస్లిం మెజారిటీ వీధులూ,ఏరియాలన్నీ చుట్టుపక్కల ఊర్లనుండీ వచ్చే పేదప్రజలతో సందడిగా ఉంటాయి. ఊర్లనుండీ వచ్చిన పిల్లలు, ఆడోల్లూ,మొగోల్లూ, ముసలోల్లూ అందరూ తలా ఓ డబరానో(దేక్ష, పాత్రా అని కూడా అంటారు), లేక యూరియా సంచిలాంటివో పట్టుకుని ఇల్లిల్లూ తిరుగుతుంటారు. వీరిలో ముస్లింలూ, ముస్లిమేతరులూ అందరూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇల్లలో కోసిన, పొట్టేలూ, బీఫ్(ఎద్దు) లలో నుండీ మూడవ వంతు తీసి, ఈ పేద ప్రజలకు పంచిపెడతారు. చాలా సార్లు,జనం ఎక్కువ రావడం వల్ల మిగతా రెండు భాగాల్లోనుండీ కూడా తీసి, వీరికే ఇస్తుంటారు. ఒక్కో మనిషికి 2,3 కేజీలంటే, ఓ కుటుంబం మొత్తం ఎంత మాంసాన్ని పొందుతారో ఊహించుకోవచ్చు. ఆ రకంగా పొందిన మాంసాన్ని ఎండబెట్టి, కొన్ని వారాల పాటు తింటారు.

పోరుమామిళ్ళ ఓ చిన్న మండల కేంద్రమైనందువల్ల, పైగా అక్కడ పొట్టేలు/బీఫ్ కోసే స్థోమత ఉన్న ముస్లింలు అంత పెద్ద సంఖ్యలో లేకపోవడం వల్ల, ఇలా పేద ప్రజలు ఇల్లదగ్గరికి వచ్చే ఆచారం ఇంకా మొదలవలేదు. కాబట్టి, కోసిన కొందరికి కూడా, పేదోల్లకు పంచే సదుపాయం లేదు. కానీ, కడప పట్టణంలో మాత్రం అసలైన బక్రీద్ పండగ స్పూర్తిని చూడవచ్చు.

ఈ రకంగా, రంజాన్ పండగ ఎలా ఐతే జకాత్( మిలుగు సంపాదనలో/ఆస్తిలో 2.5% పేదలకు ఇచ్చివేయడం) ద్వారా ఆర్థిక పంపిణీకి ఎలా దారులు వేస్తుందో, అలాగే బక్రీద్ కూడా, ఖుర్బానీ(బలిదానం) ద్వారా పౌష్టికాహార పంపిణీకి సహకరిస్తుంది.

మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

============

One Reply to “కడుపు నింపే బక్రీద్!! ”

Leave a Reply

Your email address will not be published.