కృతజ్ఞత

కృతజ్ఞత, అంటే మనకు ఎవరైనా సహాయం చేస్తే, దానిని అక్నాలెడ్జ్ చేయడం, మనకు సహాయం చేసిన వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు తిరిగి సహాయం చేయడం – ఇవి మనిషికి ఉండాల్సిన కనీస మంచి లక్షణాలనీ, అవి లేకపోవడం అనేది పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అనే విషయం అందరూ ఒప్పుకుంటారు.

ఉదాహరణకి – తల్లి ఎన్నో కష్టాల్నీ, నొప్పుల్నీ భరించి జన్మనిస్తుంది.. పసిపిల్లాడిగా ఉన్నప్పుడు ముడ్డికడుగుతుంది, స్నానం చేయిస్తుంది, కడుపు నింపుతుంది. తండ్రి వీటన్నిటికీ కావలసిన పరిస్థితులు కల్పిస్తాడు. చివరికి వారిద్దరూ వృద్ధాప్యంలో ఉండి తమపనులు తాము చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేయడం కనీస బాధ్యత- అనే విషయాన్ని దాదాపు అందరూ ఒప్పుకుంటారు.

కొన్ని తిరకాసు భావజాలాలు ఉంటాయి.. వాటి ప్రకారం చూస్తే – ముడ్డి కడగమని,స్నానం చేయించమనీ, పాలు తాపమనీ నేను అడిగానా..? బడికి పంపమనీ, స్కూలు ఫీజులు చెల్లించమనీ ఎవరు అడిగారు? వారి ఆనందం కోసం, సొసైటిలో వారి స్టేటస్ కోసం.. నేను అడక్కుండా, నా అంగీకారం లేకుండా అప్పట్లో వాల్లేదో చేస్తే, దానికి ఇప్పుడు ఋణపడి ఉండాలని రూలేముంది? పైగా దానికోసం, నాకేమాత్రం ఆసక్తి లేని, నాకెలాంటి ఉపయోగం కల్గించని పనులు చేయాలనడం ఎలా కరెక్టు? ఇదెక్కడి న్యాయం..? మాడరన్, ఇండివిడ్యువలిస్టిక్, మెటీరియలిస్టిక్,నాస్తిక భావజాలం ప్రకారం- ఇది కరెక్ట్ వాదనే తప్ప, తిరకాసు వాదన కాదు.

ఇదే కాన్సెప్ట్ ని ఇంకొంత ఎక్స్టెండ్ చేద్దాం..
పొద్దున్నే నిద్రలోనుండీ లేచి, బెడ్ పై నుండి దిగి, బాత్రూం వరకూ నడుచుకుంటూ వెళ్ళి, కాలకృత్యాలు తీర్చుకుని, హాల్ లో సోఫా మీద కూర్చున్నందుకు.. సృష్టికర్త పట్ల కృతజ్ఞత చూపమని ఇస్లాం చెప్తుంది. ఇది చాలా మందికి వింతగా అనిపించొచ్చు..
కానీ.. ఈ నిమిషం..
కొన్ని లక్షల మంది బెడ్ మీద పడినా నిద్ర రాక సతమతమవుతున్నారు..
కొన్ని లక్షల మంది కిందికి దిగి నడవలేక బెడ్లపై పడి ఉంటున్నారు..
కొన్ని లక్షలమంది మూత్రవిసర్జన చేయలేక బ్యాగులు తగిలించుకుని ఉంటున్నారు..
కొన్ని లక్షలమంది తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు..
కొన్ని లక్షలమందికి ఇల్లు,బాత్రూం,హాల్ లాంటి సౌకర్యాలు లేవు.. ఇవన్నీ వారికి లేకపోవడానికి కారణం- వారేదో తెలివితక్కువపనులు, పాపాలు చేశారనో, నీకున్నాయంటే దానికి కారణం – నీవు మహామేధావివనో,పుణ్యాత్ముడవనో కాదు.. అదంతా సృష్టికర్త నీపట్ల చూపిన ప్రేమ,దయ కారణంగానే.. కాబట్టి, అభాగ్యుల ఉదాహరణలు చూపి, “వీరి పరిస్థితి ఇలా ఉందంటే సృష్తికర్త లేడనే” డిక్లరేషన్లు, “నా దగ్గరున్నదంతా నా వల్లనే నని” విర్రవీగడాలు, నీ కంటే గొప్ప స్థితిలో ఉన్నోల్లతో పోల్చుకుని కుంగిపోవడాలూ లాంటివి కాకుండా.. నీకున్న వాటికి “అల్-హందులిల్లాహ్..” అని సృష్తికర్తకు థ్యాంక్స్ చెప్పుకుని.. లేనివాటికోసం నీతిగా,న్యాయబద్ధంగా ప్రయత్నిస్తూ ఉండు.. సృష్టికర్త నీ పట్ల చూపిన ప్రేమ,దయ,కరుణలను ఇతరులతో పంచుకో.. – ఇదే క్లుప్తంగా ఇస్లామిక్ సందేశం.

శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.