కొత్తపుంతలు తొక్కుతున్న ఆధునికత

ప్రసవం తర్వాత, పుట్టిన బిడ్డ కాళ్ళమధ్యలో చూసి పుట్టింది అమ్మాయో,అబ్బాయో చెప్పేయడం పాత,అనాగరిక పద్దతి.
ఇప్పుడు ట్రెండ్ మారింది.
లింగాల్లో స్త్రీ,పు మాత్రమే కాకుండా, “స్త్రీ బాడీలో ఉన్న పు”, “పు బాడీలో ఉన్న స్త్రీ”, “మార్పు చెందిన స్త్రీ”, “మార్పు చెందిన పు”, ఇలా రకరకాల లింగాలుంటాయంట. ఆ చిన్న బిడ్డల్ని “నువ్వు ఫలానా” అని మనం చెప్పడం, ఆ రకంగా వారిని పెంచడం వారి హక్కుల్ని కాలరాసి వారికి ద్రోహం చేయడమేనంట.

వారిని జెండర్ న్యూట్రల్ గా పెంచితే, వారు పెద్దయ్యాక ఏ లింగానికి చెందుతారో వారే డిసైడ్ చేసుకుంటారంట. వారు హైస్కూల్ స్థాయి కొచ్చాక, తాము ‘పు బాడీలో ఉన్న స్త్రీ’ అని గానీ ఫీల్ అయితే, అప్పుడు వారి బెల్లకాయని కోసేసి వారికి ఈస్ట్రోజన్ హార్మోన్లు ఎక్కిస్తారు. అదేగనక తాము ‘స్త్రీ బాడీలో ఉన్న పు’ అని ఫీల్ అయితే, వారి వక్షోజాల్ని కోసేసి, వారికి టెస్టోస్టిరాన్ ఎక్కిస్తారు. దీనికి తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు. అలాగ్గానీ చేస్తే వారిని అరెస్టు చేసి జైల్లో పడేస్తారు. సో కాల్డ్ ఆధునిక దేశాల్లో ఈ ట్రెండ్ క్రమక్రమంగా పెరిగిపోతుంది. క్లాస్ రూం కల్చర్, స్కూల్ కరికులంలు దీనికి అణుగునంగా మార్చబడుతున్నాయి. ఈ సిస్టమ్ మొత్తం మరో 10,15 ఏళ్ళకు పూర్తిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా ముందుగానే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇదంతా ఏదో కాకతాలీయంగా కాకుండా, పక్కా స్కెచ్ ప్రకారమే జరుగుతుందని మాట్ వాల్ష్ యొక్క వాట్ ఈజ్ ఎ ఉమన్ అనే డాక్యుమెంటరీ , వెస్ట్ దేశాల్లో జరుగుతున్న అనేక సంఘటనలు,పోకడల్ని బట్టి , అర్థమవుతుంది. ముస్లింస్కెప్టిక్.కామ్ వెబ్సైట్ లో కూడా దీనికి సంబంధించిన అనేక ఆర్టికల్స్ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published.