కోడి ముందా – గుడ్డు ముందా వాదనలు: డార్విన్ గారి ప్రవచనాలు!!!

కోడి ముందా – గుడ్డు ముందా అనే ప్రశ్నకు, ‘కోడి ముందు’ అని గానీ సమాధానం ఇస్తే- ‘గుడ్డు లేకుండా కోడి ఎలా వస్తుంది, ఇది కూడా తెలీదా నీకు’ , అని అపహాస్యం చేయొచ్చు.’గుడ్డు ముందు’ – అని గానీ సమాధానం ఇస్తే- ‘కోడి లేకుండా ఆ గుడ్డు ఎలా వస్తుంది, నువ్వు పెడ్తావా’, అని వెక్కిరించొచ్చు. చుట్టు నలుగురు చేరి ఎంజాయ్ చేస్తారు, చప్పట్లు కూడా కొడ్తారు. ఏ సమాధానం ఇచ్చినా – దాని నుండీ మరో ప్రశ్నను తీయొచ్చు, సమాధానం ఇచ్చిన వారిని అపహాస్యం చేయొచ్చు. ఇలా ప్రశ్నించేవారికి సమాధానం అవసరం లేదు, కేవలం ఎదుటివారిని కార్నర్ చేయడమే కావాలి. ఇలాంటి వారిని హ్యాండిల్ చేయాలంటే ఫాలో కావాల్సిన ఓ తరీఖా ఏంటంటే – వారు అడగగానే సమాధానం ఇవ్వకుండా – ఇంతకూ, మీ దృష్టిలో కోడి ముందో, గుడ్డు ముందో చెప్పండి అని ఎదురు ప్రశ్నించాలి. అప్పుడు గానీ వారి Hypocrisy బయటపడదు.**************ముస్లిం మహిళల అంశం చర్చకు వచ్చినప్పుడల్లా కొందరి వైఖరి సరిగ్గా ఇలాగే ఉంటుంది. ‘ఇస్లాం లో మహిళ గురించి ఇలా ఉంది’, అని చెప్పిన ప్రతి సమాధానం నుండీ ఓ పెడర్థాన్ని బయటికి తీస్తుంటారు. ఇలాంటి వారిని ఎంటర్టైన్ చేయకుండా – ఇంతకూ మీ దృష్టిలో స్త్రీ-పురుషుల సమానత్వం అంటే ఏంటి, దానికి బెంచ్ మార్క్ ఏంటి, ఏ సమాజం దానికి ఎగ్జాంపుల్, ఏ సిద్ధాంతం దానికి ప్రాతిపదిక అని ఎదురు ప్రశ్నించాలి. అప్పుడుగానీ, వారి అసలు రంగులు బయటపడవు.


వీరిలో చాలా మందికి డార్విన్ కులదైవం.( జోక్ గా అన్నా, మరీ ఇదవ్వకండి. వ్యంగం కూడా అర్థమై చావదు). వీరు-ప్రవచించే స్త్రీ-పురుష సమానత్వం గురించి, వీరి డార్విన్ ఏమన్నాడో చూడండి -“In his 1871 book The Descent of Man Charles Darwin wrote: “The chief distinction in the intellectual powers of the two sexes is [shown] by man attaining to a higher eminence, in whatever he takes up, than woman can attain–whether requiring deep thought, reason or imagination, or merely the use of the senses and hands.” He added, “Thus man has ultimately become superior to woman.”
In a telling indication of his attitude about women (just before he married his cousin, Emma Wedgewood), Darwin listed the advantages of marrying, which included: “. . . constant companion, (friend in old age) who will feel interested in one, object to be beloved and played with—better than a dog anyhow—Home, and someone to take care of house . . .” (Darwin, 1958:232,233).
Darwin concluded that adult females of most species resembled the young of both sexes and from this and the other evidence, “reasoned that males are more evolutionarily advanced than females” (Kevles, 1986:8). Many anthropologists contemporary to Darwin concluded that “women’s brains were analogous to those of animals,” which had “overdeveloped” sense organs “to the detriment of the brain” (Fee, 1979:418).”
ఇలాంటి గొప్ప,గొప్ప సంగతులు ఇంకా ఈ లింక్ లో చాలా ఉన్నాయి, ఇంటెరెస్ట్ ఉన్నోల్లు చదూకోవచ్చు. –https://www.icr.org/article/darwins-teaching-womens-inferiority/డార్విన్ ఒక్కడే కాడు, అతని శిష్యులు, ఎవొల్యూషనరీ సైంటిస్టులూ, ఎవొల్యూషనరీ సైకాలజిస్టులూ- స్త్రీ-పురుషులు ఎలా సమానం కాదో, స్త్రీలు-పురుషులకంటే ఎలా తక్కువో, రకరకాలుగా వర్ణించినవారే. నాస్తికవాదం సంగతి అదీ.
ఇప్పుడు కల్చర్ సంగతి చూద్దాం. ఏ కల్చర్లో స్త్రీ-పురుష సమానత్వం ఉందో చెప్పమనండి. హాలీవుడ్-బాలీవుడ్,టాలీవుడ్- ఆ వుడ్డూ, ఈ వుడ్డూ అని తేడాలేకుండా, అన్ని వుడ్డుల్లోనూ హీరోలేమో నిండుగా బట్టలేసుకుని ఉంటారు. హీరోయిన్లేమో అవసరమున్నా లేకున్నా స్కిన్ షో కామన్. సినిమాల్లోనే కాదు, టీవీల్లో, కమర్షియల్ అడ్వర్టైస్మెంట్లలో, హోర్డింగ్స్ మీదా, ఎక్కడ చూసినా మహిళల అందచందాల ప్రదర్శనే. ఎందుకలా అంటే, -అలా ఉంటేనే ప్రేక్షకులు చూస్తారు కాబట్టి, అలా ఉంటేనే అది సేల్ అవుతుంది కాబట్టి. సాహిత్యం, కవితలు, పాటలు వీటిలో చాలావరకూ స్త్రీ శరీరాన్ని వర్ణించేవే తప్ప, పురుషుడి శరీరాన్ని వర్ణించేవి కావు. ఏముందని అక్కడ వర్ణించడానికి. స్త్రీ శరీరం యొక్క ప్రత్యేకత అది. దీనిని చెప్పడం స్త్రీని కించపరచడం కాదు. అది సృష్టియొక్క డిజైన్ ని అక్నాలెడ్జ్ చేయడం. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ, వాదనలకోసం తెలీనట్లు,మర్చిపోయినట్లు నటిస్తుంటారు. అదెందుకు,ఇదెందుకు అని ఏమీ తెలియని అమాయకచక్రవరిలా ప్రశ్నలడుగుతుంటారు. **************ఇస్లాం ప్రాక్టికల్ రెలిజియన్. పడికట్టు పదాల, శుష్క నినాదాల సిద్ధాంతం కాదది. స్త్రీ-పురుషుల్ని అది సరూపాలనే చెప్తుంది తప్ప, సర్వసమానాలని ఎక్కడా చెప్పదు. ఒకరు ఎక్కువని గానీ, ఒకరు తక్కువని గానీ సూత్రీకరణలు చేయదు. ఉదాహరణకు , ఖురాన్ లోని కింది వాక్యాలు చూడండి –
“”ఈమాన్ కలిగిన పురుషులు – ఈమాన్ కలిగిన స్త్రీలు,(సృష్టికర్తపై) నమ్మకం ఉంచిన పురుషులు – (సృష్టికర్తపై) నమ్మకం ఉంచిన స్త్రీలు,(సృష్టికర్త పట్ల) విధేయత చూపిన పురుషులు – (సృష్టికర్త పట్ల) విధేయత చూపిన స్త్రీలు,నిజాయితీ కలిగిన పురుషులు – నిజాయితీ కలిగిన స్త్రీలు,సహనం చూపిన పురుషులు – సహనం చూపిన స్త్రీలు,అణుకువగా ఉన్న పురుషులు – అనుకువగా ఉన్న స్త్రీలు,దానం (చారిటి) ఇఛ్చిన పురుషులు – దానం ఇఛ్చిన స్త్రీలు,ఉపవాసం ఉన్న పురుషులు – ఉపవాసం ఉన్న స్త్రీలు,శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకున్న పురుషులు -శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకున్న స్త్రీలు,(సృష్టికర్తను) నిత్యం తలచుకునే పురుషులు – (సృష్టికర్తను) నిత్యం తలచుకునే స్త్రీలు…సృష్టికర్త మీ అందరికీ క్షమాపణను, మరియు గొప్ప బహుమానాన్ని సిద్ధం చేసి ఉంచాడు”-ఖురాన్ ౩౩:35సృష్టికర్త దృష్టిలో, స్త్రీ-పురుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదని దీనిని బట్టి తేలిపోతుంది. ఇలాంటి వాక్యాలు ఖురాన్ లో అనేకం ఉన్నాయి. అలాగే, కొన్ని ప్రాక్టికల్ విషయల్లో, స్త్రీ-పురుషుల వ్యత్యాసాలకు తగ్గట్లు, కొన్ని చోట్ల వివిధ నియమాలున్నాయి. వీటిని హైలేట్ చేసి – స్త్రీ-పురుషులు సర్వ సమానాలనీ, ఇస్లాం మహిళల్ని తక్కువచేస్తుందనీ కొందరు తీర్మానాలు చేస్తుంటారు. *******స్త్రీ-పురుషులు సర్వసమానం అనే ఫెమినిస్ట్ Concept- 18,19 శతాబ్ధాల్లో యూరప్లో మొదలైంది. దీని ద్వారా అక్కడి మహిళలకు అప్పటివరకూ లేని, ఆస్తి హక్కు, వోటు హక్కూ, ఉద్యోగాలు చేసుకునే హక్కూ లాంటివి సమకూరాయి. కానీ, ఇవన్నీ ఇస్లామిక్ సమాజాల్లో 7 వ శతాబ్ధం నుండే ఉన్నాయి.
ఇప్పుడు ఈ యూరోపియన్ కాన్సెప్ట్స్ ఆధారంగా ఇస్లాం ని విమర్శించడమంటే అది – పిల్లొచ్చి గుడ్డును వెక్కిరించడం లాంటిది.
యూరప్లో మొదలైన ఫెమినిస్ట్ ఉద్యమం కొన్ని విపరీతపోకడలు పోతుంది. ఇది ముందు,ముందు ఎలాంటి పరిణామాలకైనా దారితీయొచ్చు. ఉదాహరణకు – ఇటీవల మొదలైన – మీటూ ఉద్యమం కారణంగా, అస్సలు స్త్రీలను ఉద్యోగాల్లోకే తీసుకుండా ఉంటే మంచిదని అమెరికాలోని బహుళజాతి కంపెనీలు భావిస్తున్నాయని, బ్లూంబర్గ్ మ్యాగ్జైన్ లో 2018 లో ఓ ఆర్టికల్ వచ్చింది.Link -(https://www.bloombergquint.com/markets/a-wall-street-rule-for-the-metoo-era-avoid-women-at-all-cost) ప్రాఫిటే(లాభం) పరమావధిగా నడిచే, క్యాపిటలిస్ట్, కన్స్యూమరిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఏ సిద్ధాంతాన్ని, ఎలాగైనా మార్చేయగలవు.
ఇవన్నీ అర్థం చేసుకోకుండా, పైపైన నాలుగు ముక్కలు బట్టీ పట్టి, నాస్తికున్నీ/హేతువాదినీ అని డిక్లేర్ చేసుకోగానే, ప్రపంచంలోని ఏ విషయం గురించైనా జడ్జిమెంట్లిచ్చే “””కొందరిని””” చూస్తుంటే, ఒక్కోసారి చిరాగ్గా ఉన్నా, చాలా సార్లు జాలి కలుగుతుంటుంది.

Leave a Reply

Your email address will not be published.