ఖురాన్ లోని కొన్ని చాప్టర్లు తొలగించాలని ముస్లిం పేరు పెట్టుకున్న ఒక కుక్క ఎవరో సుప్రీం కోర్టు లో PIL వేశాడంట. ఆ కుక్కను తిడుతూ చాలా మంది రాస్తున్నారు. ఇంకొందరు, ఆ పిల్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కౌంటర్-పిల్ వేస్తామని చెప్తున్నారు. అదే గనక జరిగితే, ప్రస్తుత సుప్రీమ్ కోర్టు వైఖరిని బట్టి, అదెలాంటి తీర్పిస్తుందో ఊహించడం పెద్ద కష్టం కాదు.
కానీ.. ఇవేవీ చేయాల్సిన అవసరం లేదు. ఆ కుక్కను దానిమానాన దాన్ని వదిలేయడం బెటర్. ఆ కుక్క తానే సొంతంగా ఓ పుస్తకాన్ని రాసుకుని దానికి ఖురాన్ అని పేరు పెట్టుకున్నా.. అదే అసలైన ఖురాన్ అని సుప్రీం కోర్టూ డిక్లేర్ చేసినా – ఇస్లాం/ముస్లింలకొచ్చే నష్టం ఏమీ లేదు. “Indeed, it is We who sent down the Qur’an and indeed, We will be its guardian” – Quran 15: 9ఇదీ ఖురాన్ ని సమ్రక్షించడం గురించి సృష్టికర్త చెప్పిన మాట. దాని సమ్రక్షణా బాధ్యతల్ని సృష్టికర్త స్వయంగా తనపైనే వేసుకున్నారు. అన్నట్లుగానే గత 1400 సంవత్సరాలుగా అది చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అర్థం చేసుకునే వారికి ఇదొక తిరుగులేని మిరకిల్. అంచేత..ఇలాంటి పిల్ లు , గిల్ ల వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి, జస్ట్ చిల్. . నోట్ : ఆ కుక్కకు కావలసింది పబ్లిసిటీ. వాడి పేరు రాసి తిడితే వాడికి కావలసిన పబ్లిసిటీ వాడికి వచ్చేస్తుంది కాబట్టి, పేరు రాయలేదు.. అంతే తప్ప, కుక్కలపై నాకు ద్వేషం లేదని గమనించగలరు.