జైరా వసీమ్ – మొదటామె కాదు, చివరామె కూడా కాదు!!

జైరా వసీమ్ – మొదటామె కాదు, చివరామె కూడా కాదు!!

గత వారం జైరా వసీమ్ పేరు వార్తల్లో మారుమోగింది. ఈమె చేసింది మూడే సినిమాలు. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్,ద స్కై ఈజ్ పింక్(ఇంకా రిలీజ్ అవ్వలేదు). మొదటి రెండు సినిమాలు ఈమెకు బోలెడన్ని జాతీయ,అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి.

సినిమాల్లో కేవలం ఒక్క చాన్స్ కోసం కూడా కొన్ని లక్షల మంది పడిగాపులు కాస్తూ, స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. అలాంటి చాన్స్ ఈమెను వెతుక్కుంటూ వచ్చింది. అది కూడా అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ దిగ్గజం తో కలిసి పనిచేసే అవకాశం. డబ్బు, స్టార్ డం, గుర్తింపు.. సమాజం సక్సెస్ కి చిహ్నాలుగా భావించేవన్నీ ఈమె చిన్న వయసులోనే సాధించేసింది.

“అంతా బాగుంది – ఈమెకు ఇక ఆకాశమే హద్దు” – అనుకునే సమయంలో, ఈమె గత వారం బాలీవుడ్ కి స్వస్తి చెప్పింది. ఇక మీదట సినిమాలేవీ చేయనని ప్రకటించింది. దానికి ఈమె చెప్పిన కారణం – మతం.

-“గత ఐదేల్లుగా, నన్ను అందరూ రోల్ మాడల్ లా చూస్తున్నారు. సక్సెస్ కి చిహ్నంగా మారిపోయానంటున్నారు. కానీ, ఇవేవీ నాకు సంతోషాన్నివ్వట్లేదు. నా దృష్టిలో సక్సెస్ ఇది కాదు. గత ఐదేళ్ళుగా నేను నా నుండీ దూరంగా వెల్తున్నట్లనిపిస్తుంది. నేను వేరే ఎవరిలానో మారిపోతున్నట్లుంది. నేను చేసే పని, నా ఈమాన్(తెలుగులో సరైన పదం లేదు?)ను నా నుండీ దూరం చేస్తుంది. ఫలితంగా నా జీవితంలో బర్కత్ కూడా క్రమంగా దూరమైపోసాగింది. బర్కత్ అంటే – సుఖ సంతోషాలు, సంపదలూ కాదు. మన మనసులో మనం ఎంత స్థిరంగా, సంతృప్తిగా ఉన్నామన్నది. మన ఆలోచనలతో, మన జీవితంతో, మన చుట్టూ ఉన్న పరిసరాలతో మనం ఎంతగా సమాధానపడగలిగామన్నది. సినిమాల్లో పనిచేస్తూనే, నా ఇమాన్ నీ , సృష్టికర్తతో నా అణుబంధాన్నీ కొనసాగించాలని గత 5 ఏళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ, ప్రతిసారీ ఫెయిల్ అవుతున్నాను. ప్రయత్నించీ, ప్రయత్నించీ అలసిపోయాను. నిజానికి – ఈ సినిమా రంగమే ఇలాంటిదని తెలుసుకోవడానికి నాకు ఇన్నేళ్ళు పట్టింది. అందుకే దీని నుండీ పూర్తిగా దూరమవ్వాలని నిర్ణయించుకున్నాను.”

– ఇంకా, అనేక ఖురాన్ సూరాల్ని,ప్రవక్త బోధనల్నీ సంధర్భోచితంగా కోట్ చేస్తూ – తాను అనుభవించిన సంఘర్షనల్ని, ఆమె థాట్ ప్రాసెస్ నీ – చాలా చక్కగా వ్యాస రూపంలో పొందుపరిచింది.

జనరల్ గా ఇలాంటి వ్యాసం సూసైడ్ చేసుకునే ముందు రాస్తారు. “అలసి పోయాను, ఇక చాలు” – టైపు నిరాశతో,నిర్వేదంతో, నిద్రమాత్రలు మింగిన వారు, బిల్డింగుల పై నుండీ దూకి చనిపోయిన వారి దృష్టాంతాలు, సినిమా రంగంలోనే చాలా జరిగాయి. మరికొందరు, ఇవేటైపు ఆలోచనలతో ఆల్కహాల్ కి, డ్రగ్స్ కీ బానిసలుగా మారుతారు. ఇవికూడా అందరికీ తెలిసినవే. కానీ, జైరా వసీమ్ ఇవేవీ చేయకుండా – కేవలం సినిమాలు మానేస్తున్నానని మాత్రమే చెప్పింది. దానికి ఆమెను అభినందించాల్సింది పోయి, కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. కొన్ని టీవీ స్టూడియోలు దీనిపై రోజులకొద్దీ చర్చలు జరిపాయి. పనిలో పనిగా, “ఓ అమ్మాయి కెరీర్ ని నాశనం చేసేసింది, అది ఎలాంటి మతమో చూశారా”- అంటూ తమ విమర్శల్ని ఏకంగా ఇస్లాంపై మళ్ళించారు.

ఇస్లాం గురించీ ఏమీ తెలుసుకోకుండానే అన్నీ తెలుసనుకునేవారికీ, జీవితంలోని తలుకుబెలుకులూ,సక్సెస్-ఫెయిల్యూర్లే తప్ప, ఆ తలుకుబెలుకులకు అతీతంగా – ఆత్మ అనేది ఒకటుంటుందనీ తెలియని వారికి – జైరా వసీమ్ వ్యాసం అర్థమయ్యే అవకాశం లేదు.

కానీ, కళ్ళముందు కనిపించే తలుకు-బెలుకుల్ని వద్దనుకుని, ఇస్లాం పంచన చేరి శాంతిని పొందిన, పొందుతున్న వారి లిస్టు, చాలా చాలా పెద్దది. దీనిలో జైరా వసీమ్ మొదటిది కాదు, చివరిదీ కాబోదు.

-శుక్రవారం.ఇన్

2 Replies to “జైరా వసీమ్ – మొదటామె కాదు, చివరామె కూడా కాదు!!”

Leave a Reply

Your email address will not be published.