డీకోడింగ్ వర్మ!! Part-1

డీకోడింగ్ వర్మ!!
==============

“పాయిజన్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా, ఉండదా?
ఎక్స్పైరీ డేట్ తర్వాత, దాని విష స్వభావం పెరుగుతుందా, తగ్గుతుందా?”

పాజిటివ్, పాజిటివ్( మంచిది) ఎందుకైంది- నెగేటివ్ , నెగెటివ్ ( చెడ్డది) ఎందుకైంది.
ఈ రెండింట్లో, ఒకటి లేకుండా రెండోది లేదు. అలాంటప్పుడు ఒకటి అందరూ కోరుకునేది, మరొకటి అందరూ వద్దనుకునేది ఎలా అయింది?

ఎక్కడ చదివానో, ఎప్పుడు చదివానో కశ్చితంగా గుర్తులేదు గానీ..సుమారు పదేళ్ళ క్రితం ఎవరో ఫార్వర్డ్ చేసిన ఈ ప్రశ్నలు నన్ను RGVZOOMING. Com బ్లాగ్ వైపుకు తీసుకెల్లాయి. వర్మ తన మనో విష్లేశణా వ్యాసాల్ని మొదట్లో అక్కడే రాసేవాడు. తర్వాత అవి సాక్షి సండే వీక్లీలోనూ, తర్వాత నా ఇష్టం బుక్ లోనూ వచ్చాయి.

అయాన్ ర్యాండ్, నిషే.. వీరు గత శతాబ్ధంలో తమ ఫిలసాఫికల్ రచనలతో అమెరికా, యూరప్ లను కుదిపేశారు. వీరి ఆలోచనలతో ప్రభావితమైన వర్మ, ఆబ్జెక్టివజం, ఇండివిడ్యువలిజం, ఫ్రీ థింకింగ్ లాంటి వీరు ప్రతిపాదించిన కాన్సెప్ట్ లను సులువైన పదాలతో వివరిస్తూ, వీటిని తాను నిజజీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేశాడో సోదాహరణంగా వివరించాడు. ఈ సులువైన వర్ణన – మరియు ఎలాంటి షుగర్ కోటింగ్ లేని రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఈ రెండూ కలిసి – ‘నా ఇష్టం ‘ పుస్తకం చదువరులను కట్టిపడేస్తుంది.
దీనికి నిదర్శనం – ” వెలువడిన 3 సంవత్సరాల్లోనే – ఇది అత్యధికంగా అమ్ముడుపోయిన తెలుగు పుస్తకంగా చరిత్ర సృష్టించింది. ఈ రికార్డు అంతకు ముందు -విజయానికి ఐదు మెట్లు పుస్తకానికి ఉండేది. ఆ పుస్తకం పదేల్లలో అమ్ముడుపోయిన కాపీలను, నా ఇష్టం కేవలం 3 సంవత్సరాల్లోనే అదిగమించింది. ( సొంత డబ్బా కొట్టుకునే అలవాటు ఆర్జీవీ కి లేకపోవడం వల్ల, దీని గురించి చాలా మందికి తెలీదు)

ఆబ్జెక్టివిజం అంటే..?
——————
ఆబ్జెక్టివిజం అంటే, అన్ని అంశాల్ని కలగాపులగం చేసి చూడకుండా, ప్రతి అంశాన్నీ, సాధ్యమైనన్ని చిన్న,చిన్న అంశాలుగా విడగొట్టి, ప్రతిదాన్నీ, దానికదే సపరేటు ఆబ్జెక్ట్ గా తీసుకుని అనలైజ్ చేయడం. ఉదాహరణకి – “మన సంస్కృతి చాలా గొప్పది – దీనిని మన తర్వాతి తరానికి అందివ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది”. ఈ స్టేట్మెంట్ ని మనం కొన్ని వందల సార్లు విని ఉంటాం. పైగా ఇది చాలా గొప్ప స్టేట్మెంట్ గా, దీనిలో అసలు ప్రశ్నించాల్సిందేమీలేని ి క్లీన్, పాజిటివ్ స్టేట్మెంట్ లా మనం భావిస్తాం. దీనిని వర్మ ఎలా అనలైజ్ చేస్తాడో చూద్దాం.
– మన – మన అంటే నీదీ, నాదీ ఒకటే సంస్కృతా? అంటే మన ఇద్దరిదేనా, లేకా ఆ రహీం దీ, ఆ ఏసురత్నందీ, ఆ మందక్రిష్నదీ అందరిదీ అనా,?
మనం అంటే కేవలం అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ఓనర్స్ అనా, లేక, మన వాచ్మెన్, మన కార్ డ్రైవర్లు కూడానా?
మనం అంటే ఎవరు -?
సంస్కృతి – సంస్కృతీ అంటే ఏమిటి? ఇది ఎప్పుడూ ఒకేలా ఉందా? అస్సలు మారలేదా? మారితే ఎంత ఫ్రీక్వెంట్ గా మారొచ్చు?
గొప్పది – గొప్పది అంటే ఏంటి? అంటే గొప్పవి కాని సంస్కృతులు కూడా ఉన్నాయా? అవి ఏంటి? ఎలా కొలుస్తారు ఏవి గొప్పవి, ఏవి కావు అని?
తర్వాతి తరానికి ఇవ్వాలా? ఇవ్వకుంటే ఏమవుద్ది? వారు బతక లేరా? బతక డానికి తిండి,నీరు కావాలి గానీ, సంస్కృతి ఎందుకు? అయినా నా చావుతో ‘నా ‘ అనేది అంతా అంతమవుతుంది? నేనే లేనప్పుడు నా తర్వాతి తరం ఏరకమైన సంస్కృతిని ఫాలో అయితే నాకేంటి?

ఈ రకంగా ఉంటుంది – ఆబ్జెక్టివ్ అనలైసిస్. ఈ కాన్సెప్ట్ ప్రకారం మనం ఓ టైంలో మన ప్రమేయం లేకుండా పుట్టాం, ఏదో ఓ టైంలో మన ప్రమేయం లేకుండా పోతాం. ఈ మధ్య కాలంలో మనకు నచ్చింది చేయాలి. అందరూ అలా చేస్తే, దానివల్ల పక్కోల్లకి నష్టం కలగకుండా ఉండటం కోసం, పోలీసులు, చట్టం అని ఓ సిస్టం ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ పోలీసులకు దొరక్కుండా ఎవరికి చేతనైంది వారు చేసుకోవచ్చు. దీనినే ఇంకాస్త పద్దతిగా చెప్పాలంటే, చట్టానికి లోబడి, చట్టాన్ని అతిక్రమించకుండా ఎవరికి నచ్చినట్లు వారు ఉండొచ్చు, ఎవరికి నచ్చింది వారు చేసుకోవచ్చు. అంతే తప్ప మంచి, చెడు, నైతికత అనేది వట్టి ట్రాష్. ఎందుకంటే – ఆ నైతికత అనేది ఓ ఊహాత్మక వస్తువే తప్ప, ఎక్కడా భౌతికంగా కనపడేది కాదు కాబట్టి. – ఇదీ స్థూలంగా ఆబ్జెక్టివిజం.

వర్మ స్పెషాలిటీ ఏమిటంటే – చాలా మంది చెప్పే వాటికీ, చేసే పనులకూ పొంతన ఉండదు. కానీ, వర్మ అలా కాదు. అతను చెప్పిన ఈ ఆబ్జెక్టివిజం అతని పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ లో, మరియు టీవీ స్టూడియోల్లో అతను మాట్లాడే ప్రతి మాటలోనూ కనిపిస్తుంది.

దీనికి బ్రీఫ్ గా కొన్ని ఉదాహరణలు :
1. తెలుగు, హిందీ సినిమా ఇండస్ట్రీలకు, వర్మ పరిచయం చేసినంత మంది కొత్త వాళ్ళను మరే ఇతర దర్శకుడూ పరిచయం చేసిఉండడు. వాల్లందరూ వర్మను తమ గురువుగా భావిస్తుంటారు. కానీ, వర్మ పొరపాటున కూడా తాను ఇంతమందికి చాన్సులిచ్చి ఉద్దరించాననే మాట అనడు. వాల్ల నుండీ ఎలాంటి మర్యాదలను గానీ, కృతగ్ఞతలను గానీ ఆశించడు. పైగా, తన స్వార్థం కోసం, ఆ కొత్తోల్ల ట్యాలెంట్ను వాడుకున్నాను తప్ప, వారిని ఉద్దరించాలనేది అసలు తన ఇంటెన్షనే కాదని అమాయకంగా చెప్తాడు.
2. సినిమా ఇండస్ట్రీ డబ్బుతో నడుస్తుందనేది నిజం. కానీ, తన దృష్టిలో డబ్బుకు రిలేటివ్ వ్యాల్యూ మాత్రమే ఉంటుంది తప్ప, అబ్సొల్యూట్ వ్యాల్యూ ఉండదనేది వర్మ సిద్ధాంతం. దీనికి ఉదాహరణలు వర్మతో కలిసి పనిచేసిన వారు కోకొల్లలుగా చెప్తుంటారు. గులాబీ సినిమా షూటింగ్ సమయంలో, పాట మొత్తం బైక్ పై వద్దని, కొంచెం ఖర్చు పెరిగిపోయినా పర్లేదు, గోవాకో, ఊటీ కో వెల్లి షూట్ చేయాలని దానికి నిర్మాత అయిన వర్మ, దర్శకుడైన కృష్ణ వంశీని బలవంతపెట్టిన అంశం – అట్లే, ప్రముఖ డైరెక్టర్ వంశీ, తన ద్వారా లాభాలు ఆర్జించిన ఇతర నిర్మాతలందరూ మొఖం చాటేస్తే,మరో గత్యంతరం లేక అతను ఆర్జీవీని అడగడం, మరో మాట లేకుండా, ఆర్జీవీ నిర్మాతగా ఆయనతో సినిమా తీయడానికి ఒప్పుకోవడం, (వైఫ్ ఆఫ్ వరప్రసాద్) , ఆ సినిమా ఫ్లాప్ అయి వర్మ కు నష్టాలు తెచ్చిపెట్టినా, దాని గురించి ఏనాడు మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడం.. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు..

ఇలాంటివన్నీ తెలిసిన వారికి, వర్మ విలక్షణ వ్యక్తిత్వం గురించి తెలిసి, అతనిపై అపారమైన అభిమానం కలిగేలా చేస్తాయి. (అతను అలాంటి అభిమానాలను, తొక్కలో ఫీలింగ్స్ కింద లెక్కకట్టే రకం అని తెలిసినప్పటికీ)

కానీ, ఇవేవీ తెలీకుండా, కేవలం అతని కొన్ని టీవీ ఇంటర్యూలనూ, అతని సినిమా టైటిల్లూ,పోస్టర్లనూ మాత్రమే చూసి, ఊరందరిదీ ఓ దారైతే ఉలిపికట్టెదోదారన్నట్లుండే అతని వైఖరికి చిర్రెత్తుకొచ్చే వారి సంఖ్యకూడా తక్కువేం కాదు. సమాజ నియమాల్ని బద్దలుకొట్టడమే తన లక్ష్యమన్నట్లు మాట్లాడే వర్మపై వీరి ఆక్రోశాన్ని కూడా సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

వర్మ Vs వర్మ :
—————–

శ్రీదేవి, సెక్స్, తొడలు, బ్లూ ఫిల్మ్ లు.. ఈ పదాలు లేకుండా వర్మ ఇంటర్యూ ఉండదు.
ప్రతిదానినీ, ఆబ్జెక్టివ్ గా అనలైజ్ చేసే వర్మ , ఈ పై అంశాల్ని మాత్రం ఆబ్జెక్టివ్ గా అనలైజ్ చేయలేదా? చేస్తే దాని రిజల్ట్/ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? వర్మ మీడియాను వాడాడా? మీడియా వర్మను వాడిందా? ఇవి.. నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.