డ్రగ్ నియంత్రణలో తాలిబాన్ బెస్ట్!!!

ఈ మాట అన్నది ఏ ముల్లానో, ముస్లిమో అనుకుని భ్రమపడేరు.

Department of Social Sciences, Loughborough University, Loughborough, Leicestershire, UKకి చెందిన Professor Graham Farrell,
Department of Criminal Justice, University of Cincinnati, Cincinnati, OH, USAకి చెందిన Professor John Thorne లు కలిసి పరిశోధన చేసి, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ విభాగం వారి వివిధ రిపోర్టులూ, తాలిబాన్లతో ఈ డ్రగ్ కంట్రోల్ విభాగం వారు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి – ఆఫ్ఘనిస్తాన్లో తమ ఆధీనంలోని ప్రాంతాల నుండీ హెరాయిన్ తయారీకి ఉపయోగించే ‘ఒపియం పాపీ’ అనే గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడంలో తాలిబాన్లు 99% సఫలీకృతమైనట్లు ప్రకటించారు.

2000 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల ఆధీనంలోని ప్రాంతాల్లో పండిన గంజాయి ఉత్పత్తి – 77271 టన్నులు.
2001 లో తాలిబాన్లు గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపడం వల్ల అక్కడ జరిగిన ఉత్పత్తి – 874 టన్నులు.
2002 మొదట్లో అమెరికన్ దలాలు తాలిబాన్లను తరిమేసి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. ఫలితంగా, 2002 లో అక్కడ జరిగిన గంజాయి ఉత్పత్తి – 62727 టన్నులు. ఈ లెక్కలన్నీ యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ విభాగం వారు ప్రచురించినవే. వారి వెబ్సైట్ లో కూడా ఈ గణాంకాల్ని చూడొచ్చు.

తాలిబాన్ నాయకుడు ముల్లా ఒమర్ – 2000 లో డ్రగ్,నల్లమందు,గంజాయి వంటివి ఇస్లాం కి వ్యతిరేకమైనవనీ, వాటి సేవనం, ఉత్పత్తి వంటివన్నీ ఇస్లాం వ్యతిరేక పనులనీ ఫత్వా జారీ చేశాడు. ఈ ఫత్వా కి వ్యతిరేకంగా ఎవరైనా గంజాయి సాగుచేస్తే , వారికి బహిరంగంగా కొరడా దెబ్బలు,మరణశిక్ష, లాంటి తీవ్ర శిక్షలు ఉంటాయని ప్రకటించాడు.దాని ఫలితమే ఇది.

ఈ మొత్తం రిపోర్టు లింక్ – https://web.archive.org/web/20160408055710/http://reformdrugpolicy.com/wp-content/uploads/2011/09/AfghanTalibanOpium.pdf

మహమ్మద్ హనీఫ్
https://shukravaram.in/

Leave a Reply

Your email address will not be published.