“దిక్కుమాలిన ఆర్గ్యుమెంటు కు సపోర్టర్స్ ఎక్కువ”

“మతం వల్లే అత్యంత రక్తపాతం జరిగింది. మతమే అన్నిటికంటే కౄరమైంది. మతమే మానవ జాతి వినాశనానికి కారణం”…. – ఈ టైపు వాదనలు నాస్తిక మేధావుల నుండీ నేను కొన్ని వందల సార్లు విని ఉన్నా. దాదాపు అందరూ వినే ఉంటారు.చాలామంది ఎగబడి అలాంటి వాటికి లైకులు కొట్టడం, షేర్లు చేయడం కూడా చేసే ఉంటారు. ఇంతమంది బలపరుస్తున్నారంటే, అదేదో తిరుగులేని నిజమేననే భావన కూడా, రిప్పుల్ ఎఫెక్ట్ లా, చాలామందిలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇంతకీ దీనిలో నిజమెంత.

డిటైల్డ్ గా తర్వాత రాస్తా. ప్రస్తుతానికి క్లుప్తంగా రెండు విషయాలు -1. “Encyclopedia of Wars” అని ఓ మహా గ్రంధం ఉంది. దీనిని రాసింది – Charles Phillips and Alan A Xelrodఈ పుస్తకంలో, క్రీస్తు పూర్వం 8000 నుండీ, క్రీ.శ.2000 వరకూ జరిగిన అన్ని యుద్ధాల గురించీ, ఆ యుద్ధాలకు దారితీసిన కారణాల గురించీ క్షుణ్ణంగా వివరించారు. అంతిమంగా వారు తేల్చింది ఏమంటే – క్రీస్తు పూర్వం 8000 నుండీ, క్రీ.శ.2000 మధ్య కాలంలో జరిగిన మొత్తం 1763 యుద్ధాల్లో, మతం కారణంగా జరిగిన యుద్ధాలు కేవలం 122 మాత్రమే. అంటే, మొత్తం యుద్ధాల్లో 6.9% మాత్రమే అని. మితగా 93% యుద్ధాలకు మతంతో ఎలాంటి సంబంధం లేదు అని. 2. “The Great Big Book of Horrible Things” అని ఇంకో పుస్తకం ఉంది. ఈ పుస్తకంలో, మానవ చరిత్రలో జరిగిన 100 అత్యంత హేయమైన, భయానక నరమేధాల గురించి, వివరించారు. ఎంతమంది చనిపోయారు అనే అంశం ఆధారంగా , నరమేధాలకు ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు. ఈ పుస్తకం రాసింది – Matthew White. దీనిలో మొదటి ర్యాంకు – రెండో ప్రపంచ యుద్ధం – ఆరుకోట్లా, అరవై లక్షలమంది చంపబడ్డారు. రెండో ర్యాంకు – చంఘీజ్ ఖాన్(ఇతను ముస్లిం కాదు. ‘ఖాన్’ చూసి ముస్లిం అనుకునే అరమెదల్ల కోసం) చేసిన దండయాత్రలు – 4 కోట్లమంది మృతి.మూడో ర్యాంకు – చైనాలో మావో జెడాంగ్ అణచివేత – 4 కోట్లమంది మృతి.నాలుగో ర్యాంక్ – బ్రిటీష్ ఇండియాలో, బ్రిటీష్ వారు అనుసరించిన మోసపూరిత విధానాలవల్ల వచ్చిన కరువులు – 2 కోట్లా అరవై లక్షల మంది మృతి.ఐదో ర్యాంక్ – ఫాల్ ఆఫ్ మింగ్ డినాస్టీ – రెండున్నర కోట్లమంది. ఈ రకంగా మొత్తం 100 మారణహోమాల గురించి వివరించారు. పైన చెప్పిన టాప్-5 మారణహోమాలకు కారణం మతం కాదు. ఆరవ ఘటన – చైనాలో , 1850-64 మధ్య జరిగిన టాయ్పింగ్ రెబెలియన్. దీనిలో రెండు కోట్లమంది చంపబడ్డారు. దీనికి మాత్రం, చైనీయుల ఓ మత విశ్వాసం కారణం. ఈ రకంగా టాప్-100 నరమేధాల్లో, 13 మాత్రమే మతం తో సంబంధం కలిగినవి ఉన్నాయి. వీటిలో భారత్-పాక్ 1947 విభజనలో చనిపోయిన 5లక్షల మంది గురించిన అంశం 70 వ ర్యాంక్ లో ఉంది. ఇప్పుడు చప్పండి… “మతం వల్లే అన్ని అనర్థాలు జరుగుతున్నాయనడం Or , అత్యధిక అనర్ధాలు జరుగుతున్నాయనడం,… తెలివితక్కువ, మతిలేని ఆర్గ్యుమెంటా, కాదా…?

Leave a Reply

Your email address will not be published.