దేశమా-మతమా?ఈ ప్రశ్న ముస్లిమేతరులందరిదీ…

ఈ వ్యాసానికి బ్యాక్-గ్రౌండ్:TheAsianAge అనే ఓ ప్రముఖ పత్రికలో ఓ వార్త వచ్చింది.”భారత ఇంటెలిజెన్స్ విభాగాల్లోని అధికారుల్లో ప్రస్తుతం ఏ ఒక్క ముస్లిం IPS కూడా లేడు, గడచిన కొన్ని దశాబ్ధాలలో ఇలా ఎప్పుడూ జరగలేదు”- అని.
దీనిని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేస్తూ – “ముస్లింల దేశభక్తిని శంకిస్తూ, ముస్లింలను అనుమానాస్పదంగా చూసే ప్రస్తుత ప్రభుత్వం కారణంగానే ఇలా జరిగిందనీ, కావాలనే ముస్లిం అధికారులెవరూ కీలకమైన నిఘా విభాగం లో లేకుండా చేశారనీ” ప్రభుత్వాన్ని విమర్శించారు.సహజంగా ప్రముఖ ముస్లింవ్యక్తులెవరైనా ప్రభుత్వాన్ని విమర్శించగానే వందలాది ట్రోల్-వానరసేన వారి మీద ప్రతిదాడి మొదలుపెడతారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ఎంతమంది హిందూ అధికారులున్నారు అంటూ మొదలుపెట్టి, ఇస్లామిక్ చరిత్ర, గల్ఫ్ దేశాలు,ఔరంగజేబ్, టిప్పుసుల్తాన్, రజాకార్.. ఇలా ప్రతి అంశం గురించి ఏకరువుపెడతారు.. వారి గురించి మాట్లాడుకుని వేస్ట్.

కుమార్ విశ్వాస్ అని ఒక ప్రముఖ హిందీ కవి ఉన్నాడు. తననుతాను సనాతన వాదిగా ప్రకటించుకుంటూనే, నికార్సైన సెక్యులరిస్టునని చెప్పుకుంటాడు. బీజేపీ ని తీవ్రంగా విమర్శిస్తుంటాడు. కేజ్రీవాల్ తో కలిసి ఆప్ పార్టీ పెట్టిన నాయకుల్లో ఒకడు, తర్వాత ప్రశాంత్ భూషన్ తో సహా పాటు పార్టీనుండీ వెల్లగొట్టబడ్డాడు. అతను, ఓవైసీ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చాడు. ఓవైసీ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ఇతనెందుకు కౌంటర్ ఇచ్చాడనేది ఒకటి. అసలు ఏం చెప్పాడనేది ఇంకొకటి.

“ఇస్లాం-భారత్ లలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సంధర్భం వస్తే, ఇస్లాం వదిలేసి భారత్ నే ఎంచుకుంటానని మీరు చెప్పగలరా? ఖురాన్-రాజ్యాంగం లలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే, ఖురాన్ ని పక్కనపెట్టి రాజ్యాంగాన్ని మాత్రమే ఎంచుకుంటారా? అలా ఎంచుకుంటానని మీరు చెప్తే వినాలని ఎన్నాల్లుగానో ఎదురుచూస్తున్నాను. ఇట్లు- ఓ భారతీయ సనాతనుడు.” ఇదీ ఆ ట్వీట్.
ఇక ఈ ట్వీట్ కి మనోడికి ఎవరెవరి నుండీ ఎలాంటి ప్రశంసలు వచ్చి ఉంటాయో, దానికింద ఎలాంటి కామెంట్లు ఉంటాయో ఊహించడం పెద్ద కష్టం కాదు.ఇక్కడ అసలు పాయింట్ ఏందంటే – నూటికి తొంబైమంది నికార్సైన సెక్యులరిస్టులమని భావించేవారికి, “కుమార్ విశ్వాస్ అడిగింది కరెక్టే కదా” అనిపిస్తుంది.

మొహమాటం కొద్దో, ముస్లిం మిత్రులు/పరిచయస్తుల ముందు నెగెటివ్ గా ప్రొజెక్ట్ అవ్వడం ఎందుకులే అనో- చాలా మంది పైకి చెప్పరుగానీ, కుమార్ విశ్వాస్ అనుమానమే 95% ముస్లిమేతరులందరికీ ఉంటుంది. వీరిలో సగం మందికి కేవలం అనుమానమే కాకుండా, ‘వీల్లంతే’ ననే నిశ్చితాభిప్రాయం కూడా ఉంటుంది. . ముస్లిం లెవ్వరూ లేని గ్రూపుల్లోనూ, క్లోజ్ ఫ్రెండ్స్,బంధువుల సర్కిల్స్ లోనూ, “ముస్లింలందరూ తేడాయేననీ, ముస్లింలకున్నంత మతపిచ్చి వేరే ఎవరికీ ఉండదనీ”…. ఇలాంటి కామెంట్లు అలవోకగా బయటికి వచ్చేస్తుంటాయి. ఆ కాన్‌ఫిడెన్స్ తోనే కుమార్ విశ్వాస్, ఓవైసీ-బీజేపీ పై చేసిన విమర్శలకు కౌంటర్ కూతలు కూశాడు..

దీనికి ఎలా సమాధానం ఇవ్వాలో తెలియక కొందరు.. ఇస్తే ముస్లిమేతరులు ఏమనుకుంటారోననే భయంతో చాలామంది ముస్లింలు ఇలాంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరగడం కూడా, ముస్లింలగురించి ఇలాంటి ఫీలింగ్స్ సమాజంలో పెచ్చరిల్లడానికి ప్రధాన కారణం.

ఇంతకీ మతమా-దేశమా? ఖురానా-రాజ్యాంగమా అనే ప్రశ్నలకు నా సమాధానం ఏంటి..?ముస్లింలను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఈ ప్రశ్న అడిగే తుంటరి ట్రోల్స్ కి ఇవ్వాల్సిన సమాధానం – “అడగడానికి నువ్వెవడివి బే?” అని, లేదా.. “సమాధానం తెలుసుకుని నువ్వు ఏం పీకుతావ్” అని కూడా ఎదురుప్రశ్నించొచ్చు.
నిజంగానే ముస్లింల ఆలోచనలగురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కొద్దీ అడిగేవారికి చెప్పాల్సిన సమాధానం – “
1. అకీబ్ ఫరీద్ – అనే ఓ పాకిస్తాన్ టీనేజ్ కుర్రోడు.. మ్యూజిక్ అన్నా, పాటలు పాడటం అన్నా పిచ్చి. గిటార్, ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం నేర్చుకున్నాడు.. మెల్ల,మెల్లగా స్టేజ్ ల మీద ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టాడు.. “పాకిస్తాన్ ఐడల్” కి అతి చిన్న వయసులో సెలెక్ట్ అయ్యాడు. దాంతో ఇతని పేరు పాకిస్తాన్ సంగీత ప్రియులందరికీ సుపరిచితమైంది.. మ్యూజిక్ ఆల్బంస్ చేయడం, స్టేజ్ ల మీద ప్రదర్శనలివ్వడం.. డబ్బు సంపాదన కూడా బాగానే జరుగుతుండింది.. దాంతో పాటు – ఇతని గొంతులోని ఆర్థతకి “ఫ్యూచర్ ఆతిఫ్ అస్లం” అనే క్రేజ్ కూడా వచ్చింది. తర్వాత సడెన్ గా ఓరోజు ఇతని మనసులో ఓ ఆలోచన వచ్చింది. అదేంటో అతని మాటల్లో – “అప్పట్లో నాకు పెద్ద సింగర్ కావాలని బలంగా ఉండేది. ఎంత పెద్ద సింగర్ అంటే, మైకేల్ జాక్సన్ అంత. ఓ రోజు సాయంకాలం డాబాపై కూర్చొని ఉన్నా.. నాకు ఎందుకో అనిపించింది.. సఫోజ్ మైకేల్ జాక్సన్ అయ్యానే అనుకో.. తర్వాతేంది..? మైకేల్ జాక్సన్ చనిపోయాడు. అతనో గొప్ప సింగర్,డ్యాన్సర్ అని కోట్లమంది ఇప్పుడు అతనిపేరు తలుస్తున్నారు.దీనివల్ల అతనికేంటి లాభం? అతను ఈ లోకంలోనే లేడు కదా? మరి నేను కూడా అంతే కదా. ఎంత గొప్పస్థాయికి వెళ్ళి ఏం లాభం.. నేనూ చనిపోతా.. తర్వాత ఏమవుతుంది.. ఎమీ లేదా.. లేకుండా ఎలా ఉంటుంది?.. ఇవే ఆలోచనలతో ఆ రాత్రంతా కంటి మీద కునుకులేదు. ఆ తర్వాత కొన్ని రోజులవరకూ ఇవే ఆలోచనలు.. మొత్తానికి దీనికి సమాధానం తెలుసుకోనంతవరకూ నాకు మనశ్శాంతి లేదని అర్థమైంది. అప్పుడే జకీర్ నాయక్ ప్రసంగాలు, యూటూబ్ లో వివిధ ప్రశ్నలకు అతనిచ్చిన సమాధానాలు వినడం మొదలుపెట్టాను. అప్పుడే జీవితంలో మొదటిసారి సీరియస్ గా ఖురాన్ తెరిచి అతను చెప్పే నంబర్స్ లో ఆ విషయం ఉందో,లేదో క్రాస్-చెక్ చేసుకునేవాన్ని..అతను చెప్పే విషయాలు నిజంగానే ఖురాన్ లో ఉన్నాయా.. లేక నోటికొచ్చిన నంబర్లు చెప్తున్నాడా అని.. ఏమో ఎవరికి తెలుసు..ఎవర్నీ గుడ్డిగా నమ్మకూడదు కదా.. అలా కొన్ని నెలలపాటు వివిధ అంశాల్ని స్టడీ చేశాక, ఖురాన్ దైవగ్రంధం అని నాకు నమ్మకం కలిగింది. అల్లా అనుగ్రహ సారం జీవితం గడపడం తప్ప, వేరే లక్ష్యాలేవీ అంత ముఖ్యమైనవి కావని అర్థమైంది. ఇస్లాం లో మ్యూజిక్ హరామ్ (నిషిద్దం) అని తెలిసిన మరుక్షణం- మ్యూజిక్ ని వదిలేయాలని డిసైడ్ చేసుకున్నాను. లక్షలాది వ్యూస్ ఉన్న నా మ్యూజిక్ వీడీయోలన్నిటీనీ వెతికి మరీ డిలీట్ చేశాను. ఇంటర్నెట్ లో ఎక్కడా నా పాటలు అందుబాటులో లేకుండా చేశాను. ప్రస్తుతం, ఎలాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా.. ప్రవక్త బోధనల్ని, ఖురాన్ సందేశాన్ని మాత్రమే వినిపించే “నాత్” లు మాత్రమే పాడుతున్నాను ” – ఇదీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అకీబ్ ఫరీద్ చెప్పిన విషయం. ఇతను పాడే నాత్ లకు కూడా, లక్షలాది అభిమానులున్నారు.

ఇలాంటిదే ఇంకో కథ – Cat Stevens ది. ఇతను ఇంగ్లండ్ లో, 1948 లో పుట్టిన మరో ‘మ్యూజిక్ ప్రపంచ’ దిగ్గజం. తనపాటల్తో పాప్ మ్యూజిక్ ని కొన్నాల్లపాటు ఏలాడు. కేరీర్ లో పీక్ లో ఉన్నప్పుడు -“జీవితానికి అర్థమేంది” – అనే ఆలోచనలతో వివిధ మతాల్ని స్టడీ చేసి చివరికి ముస్లిం గా మారాడు. ఇస్లాం లో మ్యూజిక్ నిషిద్ధం అని ఎవరో చెప్పడంతో, మ్యూజిక్ కెరీర్ ని అర్థాంతరంగా వదిలేశాడు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానుల్ని షాక్ కి గురిచేశాడు. సుమారు ఓ ఇరవై ఏళ్ళతర్వాత, ఇస్లాం లో మ్యూజిక్ మొత్తం హరామ్ కాదని, మ్యూజిక్ మాటున జనాల్ని విశృంఖలత్వం వైపుకూ, విచ్చలవిడితనానికీ గురిచేసే భావజలమే ఇస్లాం లో నిషిద్ధం అనే అంచనాకు వచ్చి, ఇటీవల పాటలుపాడటం మళ్ళీ మొదలుపెట్టాదు.. వివిధ దేశాలు తిరిగి ప్రదర్శన లిస్తున్నాడు.

ఇక మూడో ఉదాహరణ- ఏ.ఆర్.రెహ్మాన్- గురించి అందరికీ తెలిసిందే. ఇతను ఐదుపూటలా నమాజ్ చదివే, ఇస్లాం ని సీరియస్ గా ఆచరించే ముస్లిం అనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. మరి మ్యూజిక్ నిషిద్ధం అని ఇతనికి తెలియదా..? ఇంతకీ మ్యూజిక్ హరామా, కాదా? మ్యూజిక్ వివిధ కాలాల్లో వివిధ రూపాలు మార్చుకుంటూ వచ్చింది. ఖురాన్,ప్రవక్త బోధనల్లో దీని గురించి స్పష్టమైన ఆదేశాలు లేవు కాబట్టి ఇస్లామిక్ స్కాలర్స్ ఒపీనియన్స్ పై ఆధారపడాల్సి ఉంటూంది. దీనికి మెజారిటీ ఇస్లామిక్ స్కాలర్స్ ఇచ్చే సమాధానం – ఇన్స్ట్రుమెంట్స్ తో కూడిన మ్యూజిక్ హరామ్ అని. కానీ, పాటల్లోని మెసేజింగ్ -సృష్టికర్త కి, ప్రవక్తలకి వ్యతిరేకంగా లేనంతవరకూ అదేమంతపెద్ద విషయం కాదని చెప్పే స్కాలర్స్ కూడా ఉన్నారు. బహుశా, రెహ్మాన్ ఈ రెండో రకం స్కాలర్ల అభిప్రాయమే సరైందని భావిస్తుండొచ్చు.. ఇస్లాం లో ఉన్న అయిదు బేసిక్ ప్రిన్సిపల్స్.. కలిమా(సృష్టికర్త,ప్రవక్తలపై నమ్మకం), నమాజ్, ఉపవాసం, జకాత్, హజ్.. వీటిని నిష్ఠగా ఫాలో అవుతున్నాను కాబట్టి, మిగతా విషయాల్లో మరీ అంతపట్టింపు అవసరం లేదని భావిస్తుండవచ్చు. Cat Stevens కూడా ఇలాంటి రియలైజేషన్ కారణంగానే మళ్ళీ పాడటం మొదలుపెట్టి ఉండొచ్చు.

మ్యూజిక్ విషయంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ, అకీబ్ ఫరీద్, Cat Stevens, ఏ.ఆర్ రెహ్మాన్ – వీరు ముగ్గురూ ఓ విషయాన్ని మాత్రం కరాఖండీగా ఒప్పుకుంటారు, అదేమంటే ఖురాన్,ప్రవక్త బోధనల ఆధారంగా జీవించడమే తమకు అతిముఖ్యమైన విషయం,దాని తర్వాతే వేరే ఏదైనా అని, తాము ఎంతగానో ప్రేమించే మ్యూజిక్ కూడా ఖురాన్,హదీస్ ల తర్వాతే అని.

ఇలాంటి ఉదాహరణలు మనకళ్ళముందే వేలాదిగా ఉన్నాయి. ఎక్స్పోజింగ్,అర్థనగ్నంగా బట్టలేసుకుని సృష్టికర్త ఆదేశాలకు విరుద్ధంగా వెల్తున్నామని రియలైజ్ అయిన ముస్లిం అమ్మాయిలు, సడెన్‌గా మాడలింగ్, ఫ్యాషన్,ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీల్ని,కోట్లాది సంపాదన,ఫేం లను తృణప్రాయంగా వదిలేసిన ఉదాహరణలు కూడా బోలెడున్నాయి. వీఐపీల విషయాలు మాత్రమే వార్తాంశాలవుతాయి కాబట్టి వారి గురించే మనకు తెలుసు. కానీ, ఇస్లాం ని ఆచరించే కోట్లాది ముస్లింలకు ఖురాన్,ప్రవక్త బోధనలే బెంచ్ మార్క్. ఆ బోధనల్ని అర్థం చేసుకోవడంలో కొన్ని బేధాభిప్రాయాలు ఉండొచ్చు గానీ, “నేను ముస్లిం నే, కాకపోతే.. ఖురాన్,హదీస్ లు నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు” అని చెప్పే ముస్లింలెవ్వరూ ఉండరు, ఎవరో కొందరు సోకాల్డ్ నాస్తిక ముస్లింలుతప్ప.

ఖురాన్ – రాజ్యాంగం పరస్పర విరుద్ధాలా?
ఖురాన్, ప్రవక్త బోధనల్లో ముస్లింలకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కొన్ని సర్వకాల,సర్వావస్తల్లో కశ్చితంగా చేయాల్సినవే అని ఉన్నాయి. కొన్ని ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు అని ఉన్నాయి. కొన్ని చేస్తే మంచిది అని ఉన్నాయి. కొన్ని చేయకపోతే మంచిది అని ఉన్నాయి. ఖురాన్(హదీస్) కంపల్సరీగా చేయాల్సిందే అని చెప్పినవాటిని(ఉదా-నమాజ్,రోజా(ఉపవాసాలు),జకాత్(దానధర్మాలు),హజ్…, వీటిని క్రిమినల్ యాక్టివిటీస్ గా రాజ్యాంగం డిక్లేర్ చేసినా, లేదా.. ఖురాన్ ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు అని చెప్పిన వాటిని(ఉదా- ఆల్కహాల్,డ్రగ్స్ తీసుకోవడం, దొంగతనాలు,రేప్ లు ,మర్డర్లు.. ) వీటిని కంపల్సరీ గా చేయాల్సిందే అని చెప్పినా- అప్పుడు ఖురాన్-రాజ్యాంగం లలో ఏదో ఒకటి మాత్రమే తేల్చుకోవాల్సిన పరిస్థితి ముస్లింలకు వస్తుంది. బుద్ధీ,గ్ఞానం ఉన్నోల్లెవరూ-వారు వేరేమతస్తులైనా,నాస్తికులైనా- ఖురాన్ కంపల్సరీగా చేయమని చెప్పిన విషయాల్ని క్రిమినలైజ్ చేయడమో, ఖురాన్ వద్దని చెప్పిన విషయాల్ని బలవంతంగా చేయమనో చెప్పరు. ఇప్పటిదాకా చెప్పలేదు. ఫ్యూచర్ లో అలాంటి పరిస్థితేగనక వస్తే దేశంలోని పాతిక కోట్లమంది ముస్లింలు ఏంచేస్తారు, దాని పర్యవసనాలు ఎలా ఉంటాయనేది ఊహించడం మరీ అంత కష్టమేమీ కాదు. బ్రిటీషోడు దేశాన్ని దోచుకుంటుంటే, కొందరు పిరికిపందలు వారికి అపాలజీ లెటర్లు రాశారు గానీ, ముస్లింలు మాత్రం బ్రిటీష్ ప్రభుత్వంపై జీహాద్ ప్రకటించి ప్రాణాలొడ్డిపోరాడారనే చరిత్ర తెలిసిన వారికి, ముస్లింలు ఎప్పుడు దేనికి ప్రాధాన్యతనిస్తారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

మొత్తానికి, తమనుతాము సెక్యులరిస్టులు, హేతువాదులు, మానవతావాదులుగా భావించుకునేవారు- ఇస్లాం గురించి, ముస్లింల గురించి అడ్డమైన, అర్థం లేని వ్యాఖ్యానాలు చేసి, చెడ్డీ గ్యాంగ్ కి సైడ్-చిక్స్(ఉంపుడుగత్తెలు) లా మారకుండా, కాస్తంత మెదడు వాడాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published.