ద మైండ్-సెట్ ఆఫ్ ఐడెంటిటీ


పార్ట్-1: నువ్వు సున్నీ ముస్లిమా – షియా ముస్లిమా..?

************
కొన్నేల్ల క్రితం.. అమెరికా నుండీ ఓ క్లైంట్ మ్యానేజర్ హైదరాబాద్ విజిట్ కి వచ్చాడు.
మా మ్యానేజర్ నన్ను పిలిచి – “ఈయన నాలుగురోజులు ఉంటాడు. సాయంత్రం వరకూ మీటింగ్స్ లో ఉంటాడు. తరువాత సిటీ చూడటానికి వెల్తాడు. నువ్వే ఈ నాలుగు రోజులూ దగ్గరుండి అన్నీ చూపించాలి. అతనిచ్చే ఫీడ్బ్యాక్ మనకు చాలా ఇంపార్టెంట్, సో, టేక్ కేర్ ఆఫ్ హిమ్” – అని చెప్పాడు. హెచ్చార్ లకీ, సీనియర్ మ్యానేజర్స్ కి చెప్పాల్సిన పని, నాకెందుకు చెప్తున్నాడు, అని ఆలోచిస్తుండగానే, – ” హిజ్ నేం ఈజ్ – మెహ్మూద్ ****, బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ అమెరికా, టు టర్కిష్ పేరెంట్స్ ” -అని చెప్పాడు. ఈ చివరి ఇన్ఫర్మేషన్ తో, మా మ్యానేజర్ ఈ పని నాకెందుకు అప్పజెప్తున్నాడో అర్థమైంది.

*********

కుతుబ్షాహీ టాంబ్స్ దగ్గర, నేను గ్రూప్స్ ఎగ్జాం కి చదువుకున్న అసఫ్ జాహీ హిస్టరీ సంగతులేవో అతనికి చెప్తున్నప్పుడు – సడన్ గా అడిగాడు, -” ఆర్ యు ఎ సున్ని ముస్లిం ఆర్ షియా ముస్లిం?” అని.

నా TC సర్టిఫికేట్ లో రెలిజియన్ అనే దగ్గర – ఇస్లాం -సున్ని -ముస్లిం అని ఉంటుంది. మా పదో క్లాస్ హెడ్ మాస్టార్, ముస్లిం స్టూడెంట్స్ అందరికీ కామన్ గా అదేపెట్టేశాడు. షియా లెవరూ నాకు డైరెక్ట్గా ఎక్కడా తగలకపోవడం వల్ల, సున్నీ అనే పదానికి పెద్దగా సిగ్నిఫికెన్స్ ఉందని నాకెప్పుడూ అనిపించలేదు. సున్నీవా, షియావా అని అతనడిగినప్పుడు, ‘సున్నీ’ అని చెప్పాలనిపించలేదు, ఎందుకంటే – అతని పేరు చూస్తే,అతను షియా నేమో ననే అణుమానం వచ్చింది కాబట్టి.

I Don’t Know – అని చెప్పాను.

“Come on Dude.. how come you don’t know – అన్నాడు.

Seriously, I don’t know. Actually, I don’t know the difference among the two, so I can’t say, to which group I belongs – అన్నాను.

తర్వాత మా ఇద్దరి సంభాషణా ఇలా జరిగింది.

నేను: సున్నీ, షియాలకు డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ ఖురాన్ ఉందా?
అతను: కాదు, బోత్ ఫాలో ఎగ్జాక్ట్లీ సేం ఖురాన్.

నేను: మహమ్మద్ ప్రవక్త అంతిమ దైవ ప్రవక్త అనే దాన్లో ఇద్దరికీ ఏమైనా విబేధం ఉందా..?
అతను : ఏమీ లేదు. ఇద్దరూ అదే నమ్ముతారు.

నేను: నమాజ్, జకాత్, ఉపవాసాలూ, హజ్ వంటి వాటిలో ఏమైనా విబేధం ఉందా?
అతను : ఏమీ లేదు.

నేను: అలా ఐతే – నేను షియానే. ఇంతకీ సున్నీ – షియాలకు డిఫరెన్స్ ఏంటి..?
అతను: నాట్ మచ్.. షియాస్ లవ్ అలీ అన్నాడు.

నేను : ప్రవక్త జీవితానికి సంబంధించిన ప్రతి అంశమూ ముస్లింలకు అమూల్యమైనదే. ఆయనతో మాట్లాడిన, కలిసి జీవించిన ప్రవక్త యొక్క అనుచరుల్ని ప్రేమించని, గౌరవించని ముస్లింలెవ్వరూ ఉండరు కదా. పైగా, ప్రవక్తతో దగ్గర బంధుత్వం కలిగిన అలీ(ర) గారంటే ముస్లింలందరికీ ఇంకాస్త ఎక్కువ ప్రేమే కదా.
అతను : దట్స్ కరెక్ట్. బట్.. ప్రవక్త తర్వాత అలీ ని ఖలీఫా గా ఎన్నుకొని ఉండాల్సిందని వీరు భావిస్తారు.

నేను: కరెక్టే కావచ్చు. కానీ, ఇస్లామిక్ థియరీ ప్రకారం – అలీగారి తగ్దీర్(తలరాత) ని డిసైడ్ చేసింది అల్లాయే తప్ప, ఇతరులు కాదు కదా. అలీ గారి శ్రమ,ప్రతిభకు ఇక్కడ తగిన ప్రతిఫలం దొరకలేదనుకుంటే, రేపు ఖయామత్ అప్పుడు అల్లా దానికి తగిన న్యాయం చేస్తాడు. ఇస్లామిక్ కోర్ కాన్స్పెట్ ఇదే కదా. మరి అలాంటప్పుడు, ప్రవక్త యొక్క ఇతర అనుచరుల్ని నిందించి ఏం లాభం?
అతను : యస్. దట్ మేక్ సెన్స్ అని, చెప్పి కాసేపు సైలెట్ ఐపోయాడు.

అతను నా ఆర్గుమెంట్ కి ఒప్పుకున్నాడనే కాన్‌ఫిడెంట్ తో – ఇంతకీ – నువ్వు షియా ముస్లిమా, సున్నీ ముస్లిమా అని అడిగాను.
అతను నవ్వి – రెండూ కాదు, జస్ట్ ముస్లిం. అన్నాడు.

అతను అడిగిన వెంటనే ఠపీమని ‘నేను సున్నీ ముస్లిం’ ని అని చెప్పి, ఆ తర్వాత ‘నువ్వే ముస్లిం..?’ అని అతన్ని అడిగి ఉంటే, అతను కూడా వెంటనే ‘షియా ముస్లిం’ అని చెప్పి ఉండేవాడేమో.
************

ఐడెంటిటీ అనేది రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. ఇద్దరు వ్యక్తుల్లో, ఓ వ్యక్తి తనకున్న ఓ పర్టీక్యులర్ ఐడెంటిటీని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడమో, డిస్-ప్లే చేయడమో చేస్తే, ఆ రెండో వ్యక్తి కూడా – దానికి వ్యతిరేకమైన ఐడెంటిటీని అప్రయత్నంగానే ఓన్ చేసేసుకుంటాడు.
అందుకే నేను ఫలానా అనే ఐడెంటిటీ ఓన్ చేసుకునేటప్పుడు, అది ఎదుటోల్లపై ఎలాంటి ప్రభావం కలిగిస్తుందో ఆలోచించాలి. ఆ ఫలానా అనే ఐడెంటిటీని మనం ఎందుకు ఓన్ చేస్తుకుంటున్నాం, ఎదుటి వ్యక్తి ఆ ఫలానా ఐడెంటిటీలోకి ఎందుకు రాడు, ఆ ఫలానా ఐడెంటిటీని తగిలించుకోవడం వల్ల, మనకు లాభమా నష్టమా, ఎదుటివారికేమైనా లాభమా,నష్టమా.. ఆ ఐడెంటిటీ ని క్యారీ చేయడం వల్ల మనం ఎదుటివ్యక్తిని దూరం చేసుకుంటున్నామా, దగ్గర చేసుకుంటున్నామా.. అనే విషయాలపై క్లారిటీ ఉండాలి.

One Reply to “ద మైండ్-సెట్ ఆఫ్ ఐడెంటిటీ”

Leave a Reply

Your email address will not be published.