పఠాన్ పై ఫత్వా ఎందుకు రాలేదు..?

“ముస్లిం పురుషుడు, అర్థనగ్నంగా బట్టలు ధరించి ఎంటర్టైన్మెంట్ పేరుతో, తన భార్య కాని మహిళలతో కలిసి డ్యాన్సులు చేయొచ్చా”- అని ఏ ముఫ్తీని గానీ, ఉలేమాని గానీ అడిగి చూడండి.
అది తప్పని నూటికి నూరు మందీ చెప్తారు.
షారూఖ్ ఖాన్ అలా డ్యాన్స్ చేస్తున్న పఠాన్ పోస్టర్ చూపించి – ఇది కరెక్టా అని అడగండి.
“అది షారూఖ్ ఖాన్ ఐతే ఏటి, వాడి బాబైతే ఏంటి, ఆ సినిమా లక్షకోట్లు కలెక్ట్ చేస్తే ఏంటి.. అలా చేయడం మాత్రం ఇస్లాం ప్రకారం తప్పు” – అనే 100% ఇస్లామిక్ స్కాలర్లు చెప్తారు. అలా చెప్పనోడు ఇస్లామిక్ స్కాలరే కాదు.

సుమారు 20ఏళ్ళ ముందు, “అమ్మాయిలు తొడలు కనపడేలా పొట్టి డ్రస్సులు వేసుకుని, పురుషుల ముందు ఆటలు ఆడొచ్చా”, అని ఓ ముఫ్తీని ఒక జర్నలిస్ట్ అడిగాడు.
ఇస్లాం ప్రకారం అది తప్పని ఆయన సమాధానం చెప్పాడు.
ఇక మరుసటి రోజే అన్ని పత్రికల్లో హెడ్లైన్స్, “సానియా మీర్జా కి వ్యతిరేకంగా, ముస్లిం మత పెద్దల ఫత్వా” అని. ఓ అమ్మాయి కష్టపడి ఆడి మ్యాచులు గెలుస్తుంటే, మధ్యలో వీల్లకేం నొప్పని- ముస్లిం మత పెద్దల్ని తిట్టనోల్లు లేరు.
**********

ఫత్వా అంటే – “ఓ అంశం గురించి ఓ సర్టిఫైడ్ ఇస్లామిక్ స్కాలర్ యొక్క ఒపీనియన్”. ఆ ఒపీనియన్ కి ముస్లింలందరూ కట్టుబడి ఉండాల్సిందేనని రూలేం లేదు. నమ్మినోల్లు, ఫాలో అవ్వాలనుకున్నోల్లు ఫాలో అవుతారు, నమ్మనోల్లు లైట్ తీసుకుంటారు.
సానియా మీర్జా లైట్ తీసుకుంది.. చక్కగా ఆడి అనేక కప్పులు గెలిచింది. ఫత్వాని ఆచరించనోళ్ళని ముస్లింలు కాదని తీర్మానించే హక్కుగానీ, మత బహిష్కారం టైపు ఫీట్లు గానీ చేసే సో కాల్డ్ ప్రీస్ట్ క్లాస్(పురోహిత వర్గం) ఏదీ ఇస్లాం లో లేదు.

అప్పట్లో సానియా మీర్జా కి మల్లే, ఇప్పుడు “షారుఖ్ ఖాన్/సల్మాన్ ఖాన్/అమీర్ ఖాన్ లకి వ్యతిరేకంగా ఫత్వా” అనే హెడ్లైన్ జనరేట్ చేయడం చాలా ఈజీ. కాకపోతే, సానియా మీర్జా విషయంలో ఉన్నంత ఎమోషనల్ కిక్ ఉండదు కాబట్టి, మనోల్లు ఆ ప్రయత్నం చేయరు.

బేసికల్ గా, ఇక్కడ పాయింట్ ఏందంటే – కొన్ని మతాలు ఏ పండగ ఎప్పుడు చేసుకోవాలో తేదీలు చెప్పడం వరకే పరిమితం. అంతకు మించి సోసైటీ గానీ, మనుషుల జీవితాలు గానీ నడవడానికి కావలసిన డీటైల్డ్ గైడ్లైన్స్ ఆ మత గ్రంధాల్లో ఉండదు.
ఇంకొన్ని మతాల్లో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి గానీ, వాటినెప్పుడో తుంగలో తొక్కేసి, డార్విన్ సిద్ధాంతాన్ని,క్యాపిటలిస్ట్ మార్కెట్ వ్యాల్యూస్ నే తమ అప్రకటిత మతగ్రంధాలుగా అవి మార్చేసుకున్నాయి. ఇవి ట్రెండ్ ప్రకారం తమ కోర్ వ్యాల్యూస్ ని మార్చుకుంటూ ఉంటాయన్నమాట. ఉదాహరణకు, ఇప్పుడు హోమో-గే-లెస్బియన్.. ల ఉద్యమం జరుగుతుంది కాబట్టి, “మా దేవుడు కూడా గే నే” అనీ, “గే గా ఉండటం తప్పు కాదనే” స్థాయికి అవి వచ్చేశాయి.

కానీ, ఇస్లాం లో ఇలాంటి ఫెసిలిటీలు,ఫ్లెక్సిబిలిటీలు లేవు. ట్రెండ్ ని బట్టో, వీఐపీల కోసమో/సెలబ్రిటీల కోసమో దాని సిద్ధాంతాలు మారవు. మారే స్కోప్ కూడా లేదు.
మారలేదు కాబట్టి ఇతర మతాలతో పోలిస్తే ఇది గొప్పదనో, విమర్శలకు అతీతమైందనో చెప్పడం నా ఉద్ద్యేశ్యం ఎంతమాత్రమూ కాదు.
మారలేదు కాబట్టి, దానిని తెలుసుకోవడం, సహేతుకంగా విమర్శించడం చాలా ఈజీ. కాకపోతే,ఇక్కడ ఒక్కటే చిక్కు- ఆల్రెడీ తమకు తెలిసింది చాలా తక్కువని ఒప్పుకునే నిజాయితీ,తెలియని విషయం తెలుసుకోవాలనుకునే ఓపెన్ మైండ్, తెలియని దాని గురించి స్టేట్మెంట్లివ్వకుండా నోటిని(చేతిని) ఆపుకునే సెల్ఫ్ కంట్రోల్.. ఇవి కాస్తైనా ఉండాలి.
అన్నిటికంటే ముందు, అసలు తన సొంత ఐడెంటిటీ, సొంత ఐడియాలజీలపై క్లారిటీ ఉండాలి. మన దగ్గర సరైన తక్కెడ(Weighing machine) ఉంటేనే కదా, దాంతో తూచి, ఎదుటోడి తూకంలో లోపం ఉందో లేదో చెప్పగలిగేది. నూటికి తొంబై మంది దగ్గర అదేలేదు. అన్నీ గాలివాటు ఒపీనియన్లు, గాలివాటు వాదనలు.

“And they have no knowledge. They doesn’t follow anything, except assumption, and indeed, assumption is not alternative to Truth” -Quran 53:28


“If you follow the majority of people on the earth, they will lead you astray from the path of God, for they follow only assumptions and speculations” – Quran 6:116

Leave a Reply

Your email address will not be published.