పరిచయం : అలెగ్జాండర్ రస్సెల్ వెబ్

పరిచయం : అలెగ్జాండర్ రస్సెల్ వెబ్
==========================
1893లో స్వామి వివేకానంద గారు చికాగోలో జరిగిన “ప్రపంచ మతాల సదస్సులో” పాల్గొని గొప్ప ఉపన్యాసం ఇచ్చారని మనందరికీ తెలుసు. మరి ఆ సదస్సులో ఇస్లాం తరుపున పాల్గొన్నది ఎవరు?


ఆయనే – అలెగ్జాండర్ రస్సెల్ వెబ్.
పేరేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా. అంతే మరి.
అలెగ్జాండర్ రస్సెల్ వెబ్ – ఓ ఉన్నత విద్యావేత్తల అమెరికన్ క్రిష్టియన్ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ప్రముఖ రచయిత, మరియు అమెరికాకి ఫిలిప్పీన్స్ రాయబారిగా పనిచేశారు. ఇతనికి మనిషి పుట్టుక, చావు, జీవితంల గురించిన ఆలోచనలు, అన్వేషణలు క్రిష్టియానిటీ -> హిందూఇజం-> బుద్ధిజం వైపు మళ్ళించి, చివరికి ముస్లిం గా స్థిరపడేలా చేశాయి. ఇతను రాసిన ‘ఇస్లాం ఇన్ అమెరికా ‘ అనే పుస్తకం ఓ మాగ్నం ఒపస్( గొప్పది) గా గుర్తింపబడి, అనేక పునర్ముద్రణలు పొందింది. ఇతను 1890 లో భారత పర్యటనకు వచ్చి, బాంబే,కల్కతా,మద్రాస్, మన హైదరాబాద్ లోనూ, ఇస్లాం గురించి అనేక ప్రసంగాలు ఇచ్చారు.
1893లో పైన పేర్కొన్న ప్రపంచ మతాల సదస్సులో ఆయన – The Influence of Social Condition and The Spirit of Islam అనే అంశంపై రెండు దీర్ఘ ప్రసంగాలు ఇచ్చారు . అనంతరం ఆ ప్రసంగాల్ని పుస్తకాలుగా ప్రచురించారు.

గొప్ప జీవన విధానంగా చెప్పబడుతున్న అమెరికన్ మెటీరియలిస్టిక్ లైఫ్ లోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతూ, అనేక దేశాల్లో అమెరికా చేస్తున్న దురాక్రమణలూ విమర్శిస్తూ అనేక రచనలు చేశారు.

టర్కీ తరుపున గౌరవ రాయబారిగా కొంతకాలం పని చేశారు.
1916లో న్యూ జెర్సీ లో పరమపదించారు.

www.shukravara.in

Leave a Reply

Your email address will not be published.