పిచ్చి కుక్క – మంచి కుక్క!!

పిచ్చి కుక్క – మంచి కుక్క!!
===========================
మక్కా పేలుల్ల నిందితులందరినీ కోర్టు వదిలేసింది. ఇది ఎవరికైనా ఆశ్చర్యం కలిగించి ఉంటే, వారికి దేశ రాజకీయాలగురించి ఓనమాలు కూడా తెలీదని అర్థం. అలాంటోల్లు, మెయిన్ స్ట్రీం మీడియాను చదవడం,చూడడం మానేసి, THE HINDU,NDTV లాంటి తటస్థ మీడియానూ, TheQuint,TheWire,Scroll, communalism combat లాంటి వెబ్ మీడియానూ ఫాలో అవ్వండి.

ఇక కాశ్మీర్ బాలిక రేప్ కేసులో కూడా ముమ్మాటికీ ఇదే జరగబోతుంది. బిజేపీ ని నడిపించే ఆర్ ఎస్ ఎస్ భావజాలం, దాని ఎత్తుగడలూ,వ్యూహాలూ ఎలా ఉంటాయో తెలుసుకోకుండా, ‘అయ్యో పాపం 8 ఏళ్ళ అమ్మాయి రేప్ ‘ అని ఇప్పుడు ఆ ఘటనపై చూపిస్తున్న సానుభూతి,ఆవేశం ఇవన్నీ ఎక్కువరోజులు ఉండవు. ఈ ఆవేశం చల్లబడి, TV డిబేట్లు, సోషల్ మీడియా చర్చలు మరో అంశంపైకి మారిపోయినప్పుడు, అప్పుడు మొదలవుతుంది అసలు గేం ప్లాన్. రాజకీయనాయకులు,ప్రభుత్వాధికారులు,పోలీసులు, జడ్జులు ఇలా అన్ని విభాగాల్లోని RSS బుర్రలన్నీ ఒక చోట చేరి, అప్పుడు పధకం రచిస్తాయి. దశల వారిగా, అది అమలు చేయబడుతుంది. ఇక్కడ రాజకీయ నాయకులు మాత్రమే, ఐదేళ్ళకోసారి మారుతూ ఉంటారు, మిగతావన్నీ పర్మనెంట్. BJP అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇక్కడ అత్యంత కీలకాంశం ఏంటంటే – ఇతర సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రక్రియ నడుస్తూనే వుంటుంది, కాస్తంత నెమ్మదిగా, తెరచాటుగా. ఈ విషయం ఆ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలకు కూడా తెలుసు, అయినా అవి ఆపే ప్రయత్నం చేయవు. ఎందుకంటే వాటికి అదంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అంశం కాదు కాబట్టి.

మక్కా మసీద్ బ్లాస్ట్ 2007 లో జరిగింది. ఆ తర్వాత 2014 వరకూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. 7 ఏళ్ళ పాటు వారేమీ చేయలేదు, వందలాది ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టడం తప్ప, కానీ 4 ఏళ్ళలో BJP/RSS తనకు కావలసింది చేసేసింది. అదీ తేడా.

దేశ రాజకీయాల్ని జాగ్రత్తగా గమనిస్తే అర్థమయ్యేదొక్కటే – అది BJP కి ముస్లింలు పిచ్చి కుక్క తో సమానం. ఆ పిచ్చి కుక్కను బూచిగా చూపి అది మెజారిటీ హిందూ ఓట్లను చేజిక్కించుకుంటుంది.
కాంగ్రెస్, మరియు ఇతర సోకాల్డ్ సెక్యులర్ పార్టీలకు ముస్లింలు పెంపుడు కుక్కతో సమానం. దానిని ప్రేమగా నిమిరి ముద్దు చేస్తారు. కాసిన్ని బిస్కట్లు, అప్పుడప్పుడూ కండ చీకిన ఓ ఎముకముక్కను పడేస్తుంటారు. దానికి ప్రతిఫలంగా, మీ ఓటు ను వారికి సమర్పించుకుని, వారి ఇంటికి కాపలాగా పడుండాలి.

అదీ సంగతి. ఒకటి,రెండూ శాతం ఓట్లు కూడా జయాపజయాల్ని నిర్దేశిస్తున్న ప్రస్తుత తరుణంలో, 10-15% ఉండి కూడా కుక్కల్లా, సెకండరీ సిటిజెన్స్ లా పడి ఉండటమా, లేక, అంబేద్కర్ గారు ప్రసాదించిన ఓటు హక్కును సమర్థంగా వినియోగించుకుని, కలిసొచ్చే వర్గాలతో జట్టుకట్టి, మనుషులుగా నిలబడటమా.. ఏది కావాలో తేల్చుకోండి.

మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.