పెట్రో డాలర్ మాయ : సొమ్మొకడిది- సోకొకడిది.!!!

పెట్రో డాలర్ మాయ : సొమ్మొకడిది- సోకొకడిది.!!!
=============== ==========
1973లో పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాల(ఒపాక్) తరపున సౌదీ అరేబియా, అమెరికాతో ఓ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా తన పెట్రోలు అమ్మకాలన్నీ అమెరికన్ డాలర్లలోనే చేస్తుంది. అంటే తన దగ్గర పెట్రోలు కొనే ఏ దేశమైనా, చెల్లింపుల్ని మాత్రం అమెరికన్ డాలర్లలోనే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి భారత్ ఒక బ్యారల్ చమురును సౌదీ నుండి కొంటే దాని విలువ ఫలానా X అమెరికన్ డాలర్లని సౌదీ చెప్తుంది. అప్పుడు భారత్ ఎలాగోలా ఆ X అమెరికన్ డాలర్లను సంపాదించుకుని, వాటిని సౌదీకి ఇచ్చి ఆ చమురును తెచ్చుకోవాలి. ఆ X డాలర్లను భారత్ అమెరికాకు గానీ, లేక ఆ డాలర్లను కలిగి ఉన్న మరో దేశానికి గానీ, వాటికి కావలసిన వస్తువుల్నో/ఉత్పాదకాలనో/సేవలనో ఇచ్చి వాటి నుండి ముందుగా ఆ X డాలర్లను పోగుచేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోని ఏ దేశానిదైనా ఇదే పరిస్థితి. ఇక్కడివరకూ బాగానే ఉంది. సరే ఇప్పుడు అమెరికాకు చమురు కావాలంటే ఏం చేయాలి? ఏముందీ, సింపుల్.. అమెరికన్ ప్రభుత్వం ఓ కాగితం ముక్కను తీసుకుని, దానిపై అమెరికన్ డాలర్లను ముద్రించి అది తీసుకెల్లి సౌదీకి ఇచ్చి, ప్రతిగా చమురును తెచ్చుకుంటుంది. లిటరల్గా చెప్పాలంటే, సౌదీ లో ఉన్న చమురు నిక్షేపాలన్నీ, ఈ ఒక్క ఒప్పందం ఫలితంగా అమెరికాకు గంపగుత్తగా రాసివేయబడ్డాయన్నమాట.
గల్ఫ్ దేశాలన్నిటిలోకెల్లా సౌదీ పెద్ద దేశం. మిగతా వన్నీ చిన్నా, చితకా దేశాలు. ఆ రకంగా ఒపాక్ లో సౌదీ పెత్తనమే నడుస్తుంది. సంవత్సరం తిరిగే కల్లా, గల్ఫ్లోని అన్ని అరబ్ దేశాలూ పెద్దన్న అడుగుజాడల్లో నడుస్తూ, తమ చమురు అమ్మకాల్ని అమెరికన్ డాలర్లలోనే చేసుకొనే విధంగా అమెరికాతో ఒప్పందం చేసుకున్నాయి.

తమకు ప్రకృతి కల్పించిన ఓ అమూల్యమైన వరాన్ని తీసుకెల్లి, ఎందుకు ఈ దేశాలు అమెరికా చేతిలో పెట్టాయనే అణుమానం బుర్ర పనిచేస్తున్నవారికెవరికైనా వచ్చి తీరాలి. దానికి సమాధానం కావాలంటే, చరిత్రలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి.

1944లో రెండవ ప్రపంచ యుద్దం ముగిసే సమయానికి , అమెరికా ప్రపంచానికి పెద్ద ముండావాడిగా ఎష్టాబ్లిష్ ఐంది. కాబట్టి, ప్రపంచంలోని దేశాలన్నీ ఓ చోట గుమికూడి, దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలకు ఓ ప్రామాణిక కరెన్సీ అని ఒకటుంటే బాగుంటుందనీ, అది అమెరికన్ డాలర్ ఐతేనె సమంజసంగా ఉంటుందనీ తీర్మాణించేశాయి. కాకపోతే, దీనికి రెండు కండిషన్లను పెట్టాయి.
1. అమెరికా అడ్డదిడ్డంగా కరెన్సీని ముద్రించుకుంటూ వెల్లకూడదు. తను ముద్రించే ప్రతి డాలరుకీ, సమానమైన బంగారు నిల్వను తన వద్ద ఉంచుకున్న తర్వాతే అది ముద్రించాలి.
2. ఎప్పుడు ఎవరైనా సరే(దేశాలైనా, సంస్థలైనా, ప్రైవేటు వ్యక్తులైనా), అమెరికా దగ్గరకి వెల్లీ, ఇదిగో నా దగ్గర 100 డాలర్లు ఉన్నాయి, ఇవి తీసుకుని దీనికి సమానమైన విలువగల బంగారాన్ని ఇవ్వమంటే, మరో మాటకు తావులేకుండా అమెరికా ఆ 100 డాలర్లు తీసుకుని, బంగారాన్ని ఇచ్చి పంపాలి.( 35డాలర్లు = 1 అవున్స్ బంగారు చొప్పున).

ఈ రెండు అంశాల ఆధారంగా అమెరికన్ డాలర్ ప్రపంచ కరెన్సీగా మారిపోయింది. తరువాత వియత్నాం లాంటి అనేక యుద్ధాల్లో తలదూర్చిన అమెరికా ఇబ్బడి ముబ్బడిగా ఖర్చుపెట్టడం చూసి, – ఫ్రాన్స్ లాంటి దేశాలకు -వీడు నిజంగానే బంగారం నిల్వ ఉంచుతున్నాడా? లేక, కళ్ళు మూసుకుని కరెన్సీ ప్రింటు చేసుకుంటూ , ప్రపంచాన్ని ఎదవల్ని చేస్తున్నాడా అని అణుమానం వచ్చింది. దానితో, తమ వద్ద ఉన్న అమెరికన్ డాలర్లను తీసుకెల్లి అమెరికాకు ఇచ్చి, మా బంగారం మాకు ఇవ్వమని పోడుపెట్ట సాగాయి. ఇలా అనేక దేశాలు ఒక్కసారిగా వచ్చి కూర్చోటంతో దిక్కుతోచని అమెరికా.. తూచ్.. అలాంటి నియమాన్ని పాటించడం మేము ఎప్పుడో మానేశాం. ఇప్పుడు మీకు మార్చి ఇచ్చేంత బంగారం మాదగ్గర లేదు, అని చావు కబురు చల్లగా చెప్పింది. ఈ దేశాలు కక్కలేక, మింగలేక మనసులోనే తిట్టుకుంటూ వెనక్కి వచ్చేశాయి. ఇది జరిగింది 1971లో. కాకపోతే, ఇక అప్పటి నుండీ గ్లోబల్ మార్కెట్ లో అమెరికన్ డాలర్ను అడిగే దిక్కేలేకుండా పోయింది. డాలర్ విలువ రోజు రోజుకీ పడిపోయి, 2 సం, తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేపరిస్థితి వచ్చింది. ఈ స్థితినుండీ బయటపడటానికి అమెరికా పన్నిన తెలివైన పన్నాగమే పెట్రో-డాలర్ వ్యవస్థ.

1946 వరకూ ప్రపంచ పటంలో లేని ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనలో ఓ చిన్న కాందిశీకుల స్థావరంగా ఏర్పడి, చుట్టూ ఉన్న పాలస్తీనా ప్రాంతాలని ఆక్రమించుకుంటూ, వైశాల్యంలో ఎలా విస్తరించిందీ, దానికి అమెరికా అడుగడుగునా ఎలా అండదండలిస్తూ వచ్చింది.. ఇవన్నీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్. కాకపోతే, చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నిటికీ ఇజ్రాయెల్ పక్కలో బల్లెంలా తయారయ్యిందనేది, అక్కడ జరిగిన అనేక అరబ్-ఇజ్రాయెల్ యుద్ధాలతో తేటతెల్లం అయింది. ఇలాంటి పరిస్తుతుల్లో అమెరికా పెట్రో-డాలర్ ప్రతిపాదనతో వచ్చినప్పుడు సహజంగానే సౌదీలకు అణుమానం వచ్చింది. తమకు ఆలోచించుకోవడానికి టైం కావాలని అడిగారు. కానీ, నానాటికీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోతుండటంతో, అమెరికా ఇక తన చివరి అస్త్రమైన దండోపాయాన్ని బయటికి తీసింది. ఓ ప్రముఖ అమెరికన్ పత్రికలో, తాము సౌదీ అరేబియా మీదికి త్వరలోనే దండెత్తబోతున్నామని అది ఓ వార్తను లీకేజీ రూపంలో అందిచ్చింది. ఆ వెంటనే, సౌదీ గనక, తమ పెట్రో-డాలర్ డీల్ కి ఒప్పుకుంటే, సౌదీకి కావలసిన రక్షణ వ్యవహారాలన్నీ తామే చూసుకుంటామనీ, మరో దేశం ( ఇజాయెల్?) సౌదీ వైపు కన్నెత్తకుండా చూసుకుంటామనీ మరో ప్రతిపాదనని చేశారు. ఇక ఒప్పుకోవడం మినహా తమకు మరో మార్గం లేదని తెలుసుకున్న సౌదీయులు ఆ డీల్ పై సంతకం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్త ఆ రకంగా పతనం అంచునుండీ బయటపడింది. పెట్రోలు అమ్మకంతో తమ వద్ద పోగుపడిన అమెరికన్ డాలర్లను గల్ఫ్ దేశాలు, గత్యతరం లేక మళ్ళీ అమెరికాలోనే ప్రభుత్వ బాండ్లు, అమెరికన్ బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ల తరహాలో ఖర్చు చేస్తూ వచ్చాయి. ఈ రకంగా కూడా గల్ఫ్ లోని పెట్రోలు అమెరికా అభివృద్దికి ప్రత్యక్ష బాటలు వేసింది.
ఈ అమెరికన్ కుట్రల్ని అవగతం చేసుకుని, అమెరికాకు చెక్ పెట్టేంత తెలివితేటలు ఏ గల్ఫ్ దేశ రాజుకూ లేవు. అలా అనేకంటే, అలాంటి తెలివిలేని వారినే రాజులుగా అమెరికా అక్కడ ప్రతిస్టిస్తుంది. అలా కాదని, తన ప్రయోజనాలకు వ్యతిరేకంగా పావులు కదిపిన మరుక్షణం వారిని నిర్దాక్షిణ్యంగా అడ్డుతొలగిస్తుంది. దీనికి ఎంతటికైనా తెగిస్తుంది. సద్దాం హుస్సైన్, గడాఫీలు అలా బలైపోయిన వారే.

– మహమ్మద్ హనీఫ్
shukravaram.in

Leave a Reply

Your email address will not be published.