ప్రాపగాండా బాధితుల symptoms

కొన్ని నెలల ముందు ఓ ఫేస్ బుక్ ఫ్రెండు, ఓ పోస్టు రాశాడు. దాని సారాంశం -“ఈ ఉరుకులు-పరుగుల ఒత్తిడి భరిత జీవితంలో, అమ్మాయిల/స్త్రీల అందాన్ని అస్వాదించడం ఓ చక్కని రిలీఫ్” – ఇదీ ఆ బ్యానర్ పోస్ట్ సారాంశం.ఇది సీరియస్ గానే రాశాడు. కామెడీగానో, సెటైర్ గానో రాసింది కాదు.ఆ పోస్టును సమర్థిస్తూ చాలా కామెంట్లు, రియాక్షన్లు వచ్చాయి. చాలా మంది, “అవును మాక్కూడా అంతే” అనే అర్థం వచ్చే కామెంట్లు రాశారు.
“ఇది స్త్రీ శరీరాన్ని ఆబ్జెక్టిఫై చేయడం కాదా”, అని ఎవరైనా ఫెమినిస్టులు ప్రశ్నిస్తారేమోనని కామెంట్లన్నీ పరిశీలించా.. ఒక్కరూ, ఆ దరిదాపుల్లోకి రాలేదు. సరే దాన్నలా ఉంచండి.

ఇప్పుడు, హిజాబ్/బురఖా కు సంబంధించిన చర్చలో, పై పోస్టును సమర్థించిన వారు, “బురఖా అమ్మాయిల అందాన్ని ఆస్వాదించకుండా అడ్డుపడుతుంది కాబట్టి మేము దానికి వ్యతిరేకం, బురఖాని నిషేధించి పడేయాలి”- అని చెప్తే, అది ఇండిపెండెంట్,లాజికల్,ఆబ్జెక్టివ్ థింకింగ్ అవుతుంది. అలా క్లారిటీగా ఉండేవారిని, మాట్లాడేవారిని నేను శభాష్ అని మెచ్చుకుంటా.

లేదూ..
ఓ వందమంది, కనీసం ఓ యాభై మంది- ముస్లిం మహిళల్తో మాట్లాడి,సర్వే చేసి- వారిలో కనీసం 15-20% మంది అయినా, తమకు ఇష్టం లేకపోయినా, ఇంట్లో మొగోల్ల బలవంతం మీదే బురఖా ధరిస్తున్నామని చెప్తే, ఆ బేసిస్ మీద, “బురఖా అనేది బహిరంగ ప్రదేశాల్లో తమకు నచ్చిన బట్టలు ధరించే స్త్రీల హక్కుల్ని కాలరాస్తుంది కాబట్టి, దానిని నిషేధించాలని” చెప్తే – అది ఇంకో రకమైన లాజికల్ థింకింగ్ అవుతుంది. దానిని కూడా సమర్థిస్తా.

ఈ రెండూ కాకుండా- ఎలాంటి లాజికల్ బేసిస్సూ, స్టాటిస్టికల్ ఎవిడెన్సూ లేకుండా- ఓ పక్క మహిళల అందాల్ని ఆస్వాదించడం అనే పోస్టులకు లైకులు కొడుతూ,కామెంట్లతో ఎంకరేజ్ చేస్తూ – మరో పక్క, బురఖా పిత్తురు స్వామ్య భావజాలం అంటూ చిలకపలుకు వల్లించే కన్‌ఫ్యూజ్డ్ మేధావులందరూ – ముమ్మాటికీ Edward Bernays లాంటోల్ల ప్రాపగాండా బాధితులే, సోషల్ మీడియాలో వారికి ఎంత పెద్ద నోరున్నా సరే.

Leave a Reply

Your email address will not be published.