భక్తులందు సైన్సు భక్తులు వేరయా!!

భక్తులందు సైన్సు భక్తులు వేరయా!!
============================

భక్తుల్లో చాలా రకాలు ఉన్నారు. వీల్లల్లో సైన్సు భక్తులు ఓ ప్రత్యేక కేటగిరీ. మతం గురించి ఎవరు నాలుగు మంచి మాటలు రాసినా వీరు వాలిపోతారు. సైన్సు అంటే అదీ, సైన్సు అంటే ఇదీ అని ప్రవచనాల వరద పారించేస్తుంటారు. బేసికల్గా, మతం అనేది సైన్సుకు వ్యతిరేకమని వీరు మైండ్ లో ఫిక్స్ అయిపోవడం వల్ల అలా రియాక్ట్ అవుతారు. అలాంటి అపర సైన్సు భక్తులందరినీ ఒకటడగాలనుంది.

ఓ యాభై ఏళ్ళ క్రితం తో పోల్చితే, ఇప్పుడు మనం సైంటిఫిక్ గా చాలా అడ్వాన్స్ అయ్యాం కదా. సెల్ ఫోన్లు, ఫేసు బుక్కులూ, బుల్లేట్ రైల్లూ, ఇలా ప్రతి రంగం లోనూ చాలా పురోగతి సాధించాం కదా.. సో, ఇప్పుడు ఈ పురోగతి ఆధారంగా ఒకటి చెప్పండి.
మీలో ఎవరు, మీ తండ్రి గారితో పోల్చుకుంటే(/తల్లి గారితో) ఎక్కువ ఆనందంగా ఉన్నారు.

ఒకసారి కళ్ళు మూసుకుని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఇమాజిన్ చేసుకోండి.ఈ ఆధునిక సౌకర్యాలని ఉపయోగించుకుని, మీ తండ్రి కంటే మీరు ఎక్కువ ఆనందకరమైన, ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నారా? వారు మనసారా నవ్వుకున్న క్షణాలు/సంధర్భాల కంటే మీరు మనసారా నవ్వుకున్న క్షణాలు/సంధర్భాలు ఎక్కువని మీరు భావిస్తున్నారా? వారు హాయిగా, ప్రశాంతంగా నిద్రపోయిన సమయంతో పోల్చితే, మీరు నిద్రపోయిన సమయం ఎక్కువని మీరు భావిస్తున్నారా?
వారు, వారి పిల్లలకు(అంటే మీకు) కల్పించిన జీవితం కంటే, మీరు మీ పిల్లలకు ఇస్తున్న జీవితం మంచిదని/ఉన్నతమైనదనీ మీరు భావిస్తున్నారా?

ఇవన్నీ SCIENCE, MODERN FACILITIESని మైండ్ లో పెట్టుకునే చెప్పండి. మిగతావి కాదు. మిగతావి అంటే ఉదాహరణకు – మీతండ్రి గారికి తాగుడు అలవాటుండి, రోజూ తాగి వచ్చి చిన్నప్పుడు మిమ్మల్ని కొడుతున్నట్లైతే, ఇప్పుడు మీరు మీ పిల్లలకి అలా చేయకుంటే, మీ పిల్లలు మీకంటే మంచి జీవితం అనుభవిస్తున్నట్లు.. ఇది వ్యక్తిగత అలవాట్లలో మార్పువల్ల కలిగిన మంచి, కానీ నేను అడుగుతున్నది సైన్స్ ద్వారా వచ్చిన ఫెసిలిటీస్ వల్ల కలిగిన మంచి.

సైన్స్ అనేది ఫెసిలిటీస్ ని ఏర్పరుస్తుంది తప్ప, ఆనందాల్ని ఇవ్వదు. ఓ వ్యక్తి ఆనందం అతను తన కామ,క్రోధ,లోభ,మోహ..etc వంటి ఆవేశాలని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు – అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఈ స్టెట్మెంట్ ఏ తరానికైనా వర్తిస్తుంది. సరిగ్గా ఇక్కడే మతం పిక్చర్ లోకి వస్తుంది. చాలామంది అత్యుత్సాహ వంతులు, నిరుత్సాహ వంతులు మతం టాపిక్ వచ్చినప్పుడల్లా, సైన్స్ ని ఎత్తుకొస్తారు. సైన్స్ మమ్మల్ని ఇంతగా ఉద్ధరిస్తుంది, మతం ఇలా చేసిందా అని ఆవేశంగా ప్రశ్నిస్తారు.

మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక్కోసారి సైన్స్ సహాయం చేస్తుంది. False ప్రాఫెట్స్ ని , False గాడ్స్ ని ఫిల్టర్ చేయడానికి పనికొస్తుంది. ఉదాహరణకి, ఓ వ్యక్తి తాను ప్రవక్తననీ, తనకు సృష్టికర్తనుండి అనేక సందేశాలు వచ్చాయనీ చెప్పి, ఆ కాలంలో సైన్స్ ద్వారా తెలిసిన అంశాల్నే, వాటికి మరికొన్ని ఊహాత్మక అంశాలు జోడించి, సృషికర్తనుండీ వచ్చిన సందేశంగా ప్రకటించాడనుకుందాం. అప్పుడు అతను చెప్పిన ఊహాత్మక అంశాల్లో ఏ ఒక్క అంశమో తప్పని మరో 100ఏళ్ళ తర్వాత సైన్స్ ద్వారా నిరూపించబడినా అతను ఫాల్స్ ప్రాఫెట్ అని ఇట్టే చెప్పేయొచ్చు.

కొందరికి పావలా చెప్తే, మిగతా ముప్పావలా వారే వూహించేసుకుని రెచ్చిపోవడం అలవాటు. కాబట్టి, నేను సైన్స్ ద్వారా కొత్తగా సమకూరే సంతోషాలు ఉండవనే చెప్తున్నాను తప్ప, అస్సలు సైన్స్ చెడ్డదనో, పనికి రానిదనో అనట్లేదు. బేసికల్గా సైన్స్ అంటే – మనిషి ప్రకృతిని శోధించడం. ఇది ఆదిమమానవుని నుండి అందరూ చేస్తూనే ఉన్నారు కాబట్టే – సైన్స్ గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అంతే తప్ప అది రాత్రికి రాత్రి ఆకాశం నుండి ఊడిపడలేదు. ఈ ప్రకృతి శోధన అనేది మనిషికి సృష్టికర్త కల్పించిన బేసిక్ ఇన్స్టింక్ట్. అంచేత.. సైన్స్ దారి సైన్స్ దే.. మతం దారి మతం దే.. వాటినలాగే ఉంచండి.

-మహమ్మద్ హనీఫ్.
shukravaram.in

Leave a Reply

Your email address will not be published.