మహిళలపై దాడులు

టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి నిలబడు“.
-“
అక్కడ నిలబడితే వచ్చే,పోయేవారందరూ అదో రకంగా చూస్తారునేను వెళ్ళను.”

 వచ్చే,పోయే వారు ఎవరు?ఎవరి గురించి  అమ్మాయి మాట్లాడిందిఎవరికి భయపడి వెళ్ళకుండాదూరంగా నిలబడి  ఘాతుకానికి బలైందిఆమె చెప్పింది నిరక్షరాస్యులోదొంగలోతీవ్రవాదుల గురించో కాదుసగటు జనం గురించిఇళ్ళలో తండ్రిగా,అన్నగా,భర్తగా అన్ని బాధ్యతలూ సక్రమంగా నిర్వర్తిస్తూసమాజంలో మంచి వారుగా గుర్తింపబడుతూనే–  స్త్రీ రోడ్డుపై కనిపిస్తేతినేసేలా వెగటు చూపులువెగటు కామెంట్లు చేసే మర్యాదస్తుల గురించే  అమ్మాయి చెప్పిందివారి చూపులకే ఆమె భయపడింది.

ఆల్లు ఎక్సైజ్లు చేసేది మనం చూడాలనే” – ఇది తెలుగులో సూపర్ హిట్ ఐనటీవీల్లో ఇప్పటికి వందల సార్లు వేసిన సినిమాలో హీరో చెప్పే డైలాగు.
మహిళలుపురుషులతో గుర్తింపబడటం కోసమే అందంగా తయారవుతారనీవాల్లతో ‘సెక్సీ’ ,’హాట్’  అనిపించుకోవడం కోసం తాపత్రయపడుతుంటారనీ అర్థం వచ్చే సీన్లుడైలాగులూదాదాపు ప్రతి సినిమాలోనూ కామన్ఐటెమ్ సాంగుల గురించీవాటిలోని ద్వందార్థాల గురించీ రాయాలంటే  పేజీ చాలదు.

కొందరు టీనేజీ అబ్బాయిలూ,పురుషులూ  బ్రిల్ క్రీం పూసుకుని జుట్టు పైకి లేపుకుని ఎందుకు తిరుగుతాడు? ‘టోర్న్ జీన్స్’  పేరుతో చినిగిన జీన్స్ ప్యాంట్ ని వేల రూపాయలు  పెట్టి ఎందుకు కొంటారుఎందుకంటే – అది ఫ్యాషన్ ని ఫాలో అవ్వడం అని అనుకుంటారు  కాబట్టిఅలా అనుకునే అమ్మాయి కూడా ఫ్యాషనబుల్ బట్టలు ధరించొచ్చుముఖానికి అందమైన మేకప్ లు వేసుకోవచ్చుఅది మీడియాలో చూపించే ఫ్యాషన్ అనుకరనే తప్పఎవరినో పనిగట్టుకుని ఆకర్షించాలనో,రెచ్చగొట్టాలనో కాదు చిన్న విషయం కూడా అర్థం చేసుకోకుండాధరించే బట్టల ఆధారంగా స్తీల క్యారెక్టర్ ని డిసైడ్ చేయడం అనేది సర్వసాధారణం ఐపోయింది.

ఆడవారి మాటలకూ – అర్థాలే వేరులేఔనంటే కాదనిలేకాదంటే ఔననిలే

ఇది  అగ్ర హీరో ఊగుతూస్టెప్పులేసిన పాటమరి నో/వద్దు అనే మాట ఆడవారు ఎలా చెప్పాలి?

“ముఖం అద్దంలో చూసుకోరా వెధవా”   అని చెప్పాలాఅలా చెప్తేమల్లీ ఎక్కడ యాసిడ్ బాటిల్ తో వస్తాడోనని భయం.

పోనీఎందుకొచ్చిన గొడవలెమ్మని ఫ్రండ్లీ గా ఉంటే, “నన్ను ఇన్నాల్లూ వాడుకుని,  చివరికి ఫ్రెండ్ అని చెప్పి , ఇంకొకర్ని పెళ్ళి చేసుకుందని”  వగలమారి ఏడుపు,

చనువుగా ఉన్నప్పటి ఫోటోలువీడియోల్ని చూపించి బ్లాక్ మైల్లుఎమోషనల్ డ్రామాలు – అన్ని రకాలుగా అమ్మాయిల జీవితం నాశనం.. మళ్ళీ చివరికి   “అమ్మాయన్నాక కొంచెమైనా జాగ్రత్తగా ఉండొద్దూ”.. అని వారినే విక్టిమ్ బ్లేమింగ్.  ఇదీ ప్రస్తుతం మనం చూస్తున్న  సాంస్కృతిక దివాలాకోరుతనం.

ఇవన్నీ చూస్తూ,పెరిగిన కుర్రోల్లూ,యువకులూ,పురుషులూ స్త్రీ శరీరాన్ని  ఆటవస్తువులా భావించడంలో వింతేముందివీటన్నిటి కొనసాగింపే నేడు సమాజంలోనిత్యం మహిళలపై జరుగుతున్న దాడులుమర్యాదస్తులమని అనుకునేవారూ రకంగా గుర్తింపబడాలనుకునే వారూఎవరూ చూడకుండారోడ్డుపై పరిచయం లేని స్త్రీలు కనబడినప్పుడోమూడో కంటికి తెలియకుండాసోషల్ మీడియాల్లోనో తమ పైత్యాన్ని ప్రదర్శించుకుంటారుఅలాంటి పరువుమర్యాదలను లెక్కచేయని వారుతాగిన మత్తులోనోపోలీసులకు దొరకమనే ఏమరుపాటులోనే మహిళలపై అత్యాచారాలకు తెగబడుతుంటారురేప్ చేయడానికీచేయకపోవడానికీ మధ్య తేడాపరిస్థితుల ప్రాబల్యమే తప్ప,  చాలా మంది పురుషుల ఆలోచనల్లోనూభావజాలంలోనూ పెద్ద తేడా ఏమీ లేదు.

గ్లోబలైజేషన్ – క్యాపిటలిజం బాధితులు:

ఇప్పటి నా సంపాదనతో పోల్చితేఆప్పట్లో మా నాన్న సంపాదన చాలా తక్కువకానీఎంత తక్కువ సంపాదించినప్పటికీమా నాన్న సాయంత్రం 5,6 కల్లా ఇంటికి వచ్చేవాడుఇంటి అరుగుపైనోచెట్టుకిందో మంచం వేసుకుని ప్రశాంతంగా నిద్రపోయేవాడు.ఉన్నంతలో  మమ్మల్ని చక్కగా పెంచి పెద్దచేశారుఇప్పుడుఇంత సంపాదిస్తున్నానా జీవితంలో ప్రశాంతత లేదుఅస్తమానం ఉరుకులుపరుగులు ”  వాక్యాలు – ప్రస్తుత కాలంలో ప్రతి మగాడికీ వర్తిస్తాయి.

పురుషుడు బయటకెల్లి సంపాదించాలిస్త్రీ ఇంటిపట్టున ఉండి ఇంటి వ్యవహారాలు చూసుకోవాలి “- అనే సామాజిక వ్యవస్థ ఇప్పుడు సమూలంగా మారిపోయిందిఅబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా డిగ్రీలు,పీజీలు,ఇంజినీరింగ్లు,మెడిసిన్ లు చేస్తున్నారుపురుషులు చేసే అన్ని రకాల ఉద్యోగాలుస్త్రీలు కూడా చేస్తున్నారుఇది ప్రైవేటైజేషన్గ్లోబలైజేషన్  ప్రభావందీనివల్ల స్త్రీకి ఆర్థిక స్వేచ్చ లభించింది కానీపురుషుల ఉరుకులుపరుగుల ఒత్తిడిని ఆమె కూడా ఎదుర్కోవాల్సి వస్తుందిప్రైవేట్ రంగంలో – నీకు జీతమిచ్చే కంపెనీనీనుండీ మెరుగైన ఔట్పుట్ ని ఆశిస్తుందినువ్వు అది ఇవ్వలేనప్పుడునిన్ను ఉద్యోగం నుండీ తొలగించిమరొకరిని తీసుకుంటుందిదీని వల్ల నైట్ షిఫ్ట్ లుఅదనపు గంటలు పని చేయాల్సి ఉంటుంది. ‘సాయంత్రం ఆరైందిఇక నేను వెళ్ళిపోతానంటే’  కుదరదుమానవతా వాదంతో ఒకటి,రెండు రోజులు వదిలేస్తారేమో గానీరోజూ అలా వెళ్ళిపోతామంటేఉద్యోగం పై ఆశలు వదులుకోవాల్సిందేఉద్యోగం ఊడిపోతేమరో ఉద్యోగం వస్తుందో,లేదో తెలీదు.. అప్పుడు ఇల్లు,వాహనాలకు కట్టే .యం. లు ఎలా? –  బాధలు పురుషులకే కాదుస్త్రీలకు కూడా ఇప్పుడు కామన్.

ఒక స్త్రీ  రాత్రి 10,11 గంటల సమయంలో రోడ్డుపై బస్సుకోసమో,ఆటో కోసమో నిరీక్షిస్తుందంటే  – దానికి ఆమెపై జాలి చూపాలి తప్పఆమెను తినేసేలా చూడటమోఇంతరాత్రి బరితెగించి రోడ్డుపైకి వచ్చిందనో అడ్డమైన వాగుడు వాగకూడదు

మగతనం..?

 మగతనం.. ఇదో దిక్కుమాలిన పదంకానీ బాగా పాపులర్ పదంఏంటా మగతనంఅంగప్రవేశం చేసి నాలుగు కుదుపులు కుదపటమేనామగ కుక్కమగ నక్క,పందిగాడిద కూడా అది చేయగలవు.  దాన్లో ఏముందని అంత ఇదవ్వడానికిగర్వపడటానికీ?

చూపించాల్సింది మగతనాన్ని కాదుమనిషితనాన్నిమంచితనాన్నిగర్వపడటానికి ఏమన్నా ఉందనుకుంటే అది మనం చేసే మంచిపనుల్ని చూసే.

మొత్తానికి మహిళలపై దాడులు – శాంతి భద్రతల సమస్య అనే కన్నా– అదో సామాజికసాంస్కృతిక  సమస్య అనడమే కరెక్ట్మారుతున్న సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకుని , పురుషులు తమ ఆలోచనా విధానాన్ని సమూలంగా మర్చుకోవాల్సిన అవసరం ఉందిఅప్పుడే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.