వర్క్ – వర్షిప్ – మసీద్ !!

వర్క్ – వర్షిప్ – మసీద్
===============

వర్షిప్ అనగానే సహజంగా దేవున్ని ఏవో వరాలిమ్మని వేడుకోవడమో, కోర్కెలు తీర్చమని అడగడమో అనుకుంటారు. కానీ, ఇస్లామిక్ పర్స్పెక్టివ్ లో వర్షిప్ అంటే, ప్రతి ముస్లిం, రాజూ-పేదా, ఉన్నోడూ-పేదోడూ, సుఖాల్లో ఉన్నోడూ-కష్టాల్లో ఉన్నోడూ,స్త్రీ-పురుషుడూ, అనే తేడా లేకుండా, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రోజుకు ఐదు సార్లు చేసి తీరవలసిన ఓ పని.( నమాజ్)

మరి మసీద్ అంటే ఏమిటి? మసీద్ అంటే, పైన ఓ గుండ్రటి గుమ్మటం, ఓ ఎత్తైన మీనార్, దానికో లౌడ్స్పీ కర్ ఉండే కట్టడం కాదు. మసీద్ అంటే, కొంతమంది ముస్లింలు నమాజ్ చేయడానికి గుమికూడే ఓ భవనం/నిర్మాణం/ప్రాంతం. ఈ నిర్వచనం ప్రకారం చూస్తే, మన దేశంలోనిపెద్ద కంపెనీలైన – TCS, విప్రో, ఇంఫోసిస్, లాంటి అనేక ప్రైవేటు కంపెనీల ఆఫీసులన్నిట్లోనూ మసీదులున్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదా? ఇది ముమ్మాటికీ నిజం.

ఈ కంపెనీలన్నిటికీ దేశంలోని అనేక నగరాల్లో,అనేక బ్రాంచీలున్నాయి. వాటిలో వివిధ రాష్ట్రాలకుచెందిన చాలా మంది ముస్లిం ఇంజినీర్లుపనిచేస్తున్నారు. వీరు 1.30PM, 5.00PM, 6.30PM సమయాలలో వారి వారి ఆఫీసుల్లోని ఓ చోటకి చేరి నమాజు చేసుకుని మళ్ళీ ఎవరిడెస్క్ దగ్గరికి వారు వెళ్ళీపోతారు. ఈ మొత్తంప్రక్రియ సుమారు 10-15 నిమిషాల. కంటే ఎక్కువపట్టదు. అంటే, బయటికెల్లీ ఓ చాయ్, లేదా ఓ సిగరెట్ దమ్ముకొట్టి రావడానికి పట్టేంత టైం. అలా వారు గుమికూడే స్థలం సహజంగా, పార్కింగ్ ఏరీయా, బిల్డింగ్ టెర్రస్.. ఇలా ఇతర ఉద్యోగులు ఎవరికీ ఎలాంటి డిస్టర్బెన్స్ కలగని ప్రదేశం అయి ఉంటుంది. సహజంగానే నమాజులో, పెద్దగా శబ్దాలు చేయడం గానీ, నినాదాలివ్వడం గానీ ఉండదు. కాబట్టి, వీరు నమాజు చేస్తున్నట్లు, ఆఫీస్‌లోని ఇతర ఉద్యోగులకు చాలా మందికి తెలిసే అవకాశం కూడా లేదు. ఈ MNC కంపెనీల్లో, వివిధ రాష్ట్రాల వారుపనిచేస్తుంటారు. కానీ, నమాజ్ , ప్రపంచ వ్యాప్తంగా ఒకేవింధంగా, ఒకే ఖురాన్ ఆధారంగా ఉంటుంది కాబట్టి, ఓ తమిలముస్లిం, కాశ్మీర్ ముస్లిం, బెంగాలీ ముస్లిం,తెలుగు ముస్లింలు కలిసి ఎలాంటి ఇబ్బందీ లేకుండా పక్కపక్కనే నిలబడి నమాజ్ చదువుకుంటారు. నమాజ్ లో ముందునిలబడే వ్యక్తిని ఇమాం అంటారు. మిగతా అందరూ ఆయన వెనకనిలబడి ఆయన్నిఅనుకరిస్తారు. ఈ ఇమాం గా ఉండే వ్యక్తికి ప్రత్యేక అర్హతలంటూ ఏమీ ఉండవు. అరబిక్ సూరాలు వచ్చిన వారు ఎవరైనా ఇమాం గా ఆపూటకి నిలబడొచ్చు. కాబట్టి, ఆసమయానికి అక్కడున్నోల్లలో ఎవరో ఒకరుముందు నిలబడతారు, మిగతావారందరూ ఆయన వెనుక వరుసలో భుజం,భుజం కలిపినిలబడతారు. ఇక్కడ భాషతోగానీ, వయసుతోగానీ,ఆఫీసులో వారి స్థాయితో గానీ ఎలాంటితేడా ఉండదు. సపోర్ట్,మెయింటెనెన్స్ టీంవారు కూడా ఇతర ఇంజినీర్లతో కలిసే నిలబడతారు. ఇది ఓ పది మంది ముస్లిం లు పనిచేసే ప్రతి ఆఫీసులోనూ రొటీన్ గా జరిగేతంతే. ఆఫీసులే కాదు, చార్మినార్,మెహ్దీపట్నం, టొలిచౌకి లాంటి అనేక ముస్లీంమెజారిటి ఏరియాల్లో ఉండే హాస్పిటల్ లలోకూడా ఈ పద్ధతిని చూడొచ్చు. అక్కడసపరేటుగా ప్రేయర్ రూం ఉంటుంది. నమాజ్ టైం కి, డాక్టర్లు, పేషేంట్ల తరపు వచ్చినబంధువులు, ఇతర స్టాఫ్ అందరూ కలిసి నమాజు చేసుకుని వెల్తుంటారు. ఎంత పెద్దడాక్టర్ అయినా, ఆ హాస్పిటల్ ఓనర్ అయినా,మిగతా అందరిలాగే, కాంపౌండర్ పక్కనైనా,పేషంట్ బంధువు పక్కనైనా నిలబడి నమాజ్ చేసుకోవాల్సిందే తప్ప,నమాజ్‌లో ఎవరికీ ప్రత్యేక ట్రీట్మెంటు ఉండదు.

ఈ పద్దతి వల్ల, ఆఫీస్ లోని ముస్లిమేతరులకి కానీ, ఆఫీస్ బిల్డింగ్ కి కానీ ఎలాంటి కష్టం,నష్టం కలగదు. కాబట్టి, సహజంగా ఏమేనేజ్మెంటు కూడా వీరికి అడ్డుచెప్పదు. అలాకాకుండా, ఆఫీస్ లో ఇవి చేసుకోకూడదనికట్టడి చేస్తే ఏమవుతుంది? ముస్లిం ఉద్యోగులు,ఆ సమయానికి బయట దూరంగా ఉన్నమసీదులు వెళ్ళి వస్తారు. దానితో ఎంతప్రొడక్టివ్ టైం వేస్ట్ అవుతుంది? ఈ రకంగా కంపెనీకి నష్టమే ఎక్కువ. కాబట్టి, ఏ పెద్దకంపెనీ కూడా, ఇలాంటి వాటికి ఎప్పుడూ అడ్డుచెప్పదు. ఈ పద్దతి ఇండియాలోమాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా US,UKలోని అనేక ప్రముఖ గ్లోబల్ కంపెనీల్లోనూ ఈసిస్టం ఉంది. అక్కడ -సిస్కో,మైక్రోసాఫ్ట్,ఎరిక్సన్,గూగుల్ లాంటి కంపెనీల్లో పనిచేసే వివిధ దేశాలకు చెందిన ముస్లింలు, ప్రతి నమాజ్ టైంకూ ఓ మీటింగ్ రూం లోకి వెళ్ళి నమాజ్చేసుకుంటారు. ఇలా వైట్ కాలర్ ఉద్యోగులేకాదు. వ్యాపారాలు చేసుకునేవారు, శ్రామికులు, కార్మికులు అందరూ ఇది ఫాలోఅవుతారు. చివరికి తోపుడు బండిపై అరటిపండ్లు అమ్ముకునే వారు కూడా, నమాజు సమయానికి తమ బండి పక్కనే, ఓ గుడ్డలాంటిది పరుచుకుని నమాజు చేస్తారు. ఒక్కరే ఉంటే, ఒంటరిగానే నమాజ్చేసుకోవాలి. ఇద్దరు, లేదా అంతకంటే ఎక్కువైతే, గ్రూప్ గా ఏర్పడి, ఇమాం ముందు, మిగతావారు ఆయన వెనుక నిలబడి నమాజ్ చేయాలి.

ఈ రకంగా ఆఫీసుల్లో/తాత్కాలిక స్థలాల్లోచదివే నమాజ్, బయట మసీదుల్లో నమాజ్ కి ఏరకంగానూ తక్కువ కాదు. ప్రతి ముస్లిం రోజుకు ఐదు సార్లు నమాజ్ చదవాలనేది మాత్రమే నియమం తప్ప, ఐదు సార్లు మసీదు బిల్డింగ్‌లోకి వెల్లాలని కాదు.

దీనిని బట్టి ఏం తెలుస్తుంది?

ఇస్లాం లో, ప్రతి వ్యక్తికీ సృష్టికర్తతో ప్రత్యక్ష(డైరెక్ట్) సంబంధం ఉంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా,ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, రోజులో ఐదుసార్లు, నీ పరిసరాలతో,దైనందిన జీవితంతో డిస్కనెక్ట్అయి, ప్రవక్త చేసి చూపిన పద్దతిలో నమాజుచేయాలనేది – ” మానవునికి సృష్టికర్త ఇచ్చినడైరెక్ట్ కమాండ్. ఈ కమాండ్ ఫాలో అవ్వడానికి, ఏ ముస్లిం కీ మరో ముస్లిం యొక్క మద్దతు అవసరం లేదు. ఎలాంటి భౌతిక వస్తువులు, హంగూ,ఆర్భాటాలు, ఖర్చులూ అవసరం లేదు.

దీనిని ఫాలో అవ్వడానికి ప్రతి ముస్లిం(బిలీవింగ్ ముస్లిం) శాయశక్తులా ప్రయత్నిస్తుంటాడు. ఒక్కోసారి, తన చేతుల్లోలేని కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల, అదివీలుకాకపోవచ్చు. ఉదాహరణకి, సరిగ్గానమాజు సమయంలోనే ఆఫీస్ లో టీం-మీటింగ్ఉండొచ్చు. లేదా, ఓ డాక్టర్ కి , ఏదైనా యాక్సిడెంట్ అయి రక్త స్రావం అవుతున్నపేషేంట్ రావచ్చు. ఇలాంటి సంధర్భాల్లో, అప్పటి పరిస్థితుల్ని బట్టి నమాజ్ ని కొద్ది సేపు వాయిదా వేసుకోవచ్చు. ఇది ఎవరికివారు వ్యక్తిగతంగా,స్వచ్చందంగా తీసుకునే నిర్ణయమే తప్ప, నమాజు చదవమని ఎవరూఎవరినీ బలవంత పెట్టరు. నమాజు చేయనందుకు ఎవరూ,ఎవరికీ సంజాయిషీలుఇవ్వరు, ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, సృష్టికర్త కమాండ్స్ నిఫాలో అవ్వడానికి చేసే స్ట్రగులే అసలైన జీహాద్. ముస్లిం పేరున్నోల్లందరూ ఇలా చేస్తారని కాదు. ఇస్లామిక్ భక్తి భావం గురించి అవగాహన కలిగిఉండి, ఖురాన్ దైవత్వం మీద నమ్మకం ఉన్నోల్లు మాత్రమే ఇలా చేస్తారు. ఈ నమ్మకంఅనేది – ఓ మానసిక స్థితి. ప్రతివ్యక్తికీ అనుభవంలోకి వచ్చిన అంశాలు, తెలిసినఅంశాలూ అన్నీ క్రోఢీకరించుకుని పుట్టుక,చావువంటి అంశాలపై తనదైన నమ్మకాన్నిఏర్పరచుకుంటాడు, అంతే తప్ప, ప్రలోభాలకులొంగో, భయం ఆధారంగానో ఎవరూనమ్మకాల్ని ఏర్పరచుకోరు. ఒకవేల అలా ఏర్పరచుకున్నా, ఏర్పరచుకున్నట్లు నటించినా, దానిని రోజులో 5 సార్లు నటించడం ఎవరివల్లా కాదు. ఈ విషయం ఇస్లాం ని ఫాలో అవ్వని నామ్ కే వాస్తే, ముస్లిం ల కంటే, మతాన్ని సీరియస్ గా ఫాలో అయ్యే ముస్లిం లకే బాగా తెలుసు.

Leave a Reply

Your email address will not be published.