ముస్లిం ఓట్ల చీలిక – కొన్ని కామెంట్లు!!

ఈ డిస్క్లైమర్ చివర్లో చెప్తారు, నేను ముందే చెప్తున్నా – నాకు యం.ఐ.యం పార్టీలో నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైంది – వాటిలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, అంటే – ఎవరు ఎక్కడి నుండీ పోటీచేయాలి, ఎవరెవరితో, ఏ అంశాల ఆధారంగా పొత్తు పెట్టుకోవాలి – వంటి ముఖ్యమైన విషయాల గురించి, ఎలాంటి విధానాలూ, చర్చలూ, డిస్కషన్లూ లేకుండా, కేవలం ఓవైసీ సోదరులిద్దరు మాత్రమే అన్ని నిర్ణయాలూ తీసుకుంటారు. ఇది మంచి పద్దతి కాదు. డెమోక్రటిక్ సిస్టమ్ లో పార్టీలు నడవాల్సిన పద్దతి ఇది కాదు. బట్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్షన్స్ లో, కంపారెటివ్ గా చూసుకుంటే, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో ముస్లింలు యం.ఐ.యం.కే ( Or PFI, ముస్లిం లీగ్, ఆ ఏరియాల్లో ఏది బలంగా ఉంటే దానికి) ఓటు వేయడం మంచిదనేది నా అభిప్రాయం. ఇది క్లియర్.

ఓట్ల చీలిక గురించి చూద్దాం –
ఇప్పటికిప్పుడు – మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, అష్ఫఖుల్లా ఖాన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లు మళ్ళీ బతికి వచ్చి – దేశం కోసం, ముస్లింల కోసం, ఓ పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడితే ఏమవుతుంది..? ఆల్రెడీ ఇతర పార్టీల్లో ఉన్న ముస్లిం నాయకులు కొందరు, వీరివైపుకు వస్తారు. రాని వారు, వీల్లు ఎలాగూ గెలవరనీ, కేవలం ముస్లిం ఓట్లని చీల్చి- తమ అపోజిషన్ పార్టీలను గెలిపించడానికే వీరు ప్రయత్నిస్తున్నారనీ నిందిస్తారు. ఆ రకంగా, వీరికి ఇతర పార్టీలతో లోపాయకారీ ఒప్పందాలున్నాయని కూడా విమర్శిస్తారు. వారు నిందించినట్లుగానే – ఎన్నికల ఫలితాల్లో, రకరకాల కూడికలూ, తీసేతలూ చేసి – ఈ పార్టీ అస్సలు పోటీ చేయకుండా ఉండి ఉంటే, వీరి ఓట్లు ఆ ఫలానా పార్టీకి పడిఉంటే , ఇది కాక అది గెలిచేది, ఆ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చి ఉండేవి , ఈ రకమైన కన్‌క్లూజన్లు కూడా తీస్తారు. ఆ రకంగా – ఏ పార్టీకైనా, వేరే ఇతర పార్టీలతో లింకులు పెట్టి బద్నాం చేయొచ్చు. లాజిక్ ని ఎలాగైనా వాడుకోవచ్చు.

ఏ పార్టీకైనా ఇదే పరిస్థితి. మొదటిసారి పోటీ చేయగానే, జనాలు బ్రమ్హరధం పట్టేసి, గంపగుత్తగా ఓట్లన్నీ ఒకే పార్టీకి వేసేయరు. కొన్ని సార్లు మూడో స్థానం, కొన్ని సార్లు రెండు, కొన్ని సార్లు ఒకటి – పరాజయం తర్వాత కూడా జనాల మధ్యలో తిరుగుతూ, వారి కోసం పనిచేసేవారిని కాస్త ఆలస్యంగానైనా జనం గుర్తిస్తారు. ఈ మధ్య కాలంలో , కొన్ని ఓట్లు అటూ, ఇటూ అయి, యాక్సిడెంటల్ గా వేరే పార్టీలు గెలిచే అవకాశం కూడా ఉంది. వేరే పార్టీలు గెలుస్తాయనే కారణంతో – ఒకర్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇంట్లో కూర్చోమని వాదించడం – అర్థరహితం. కాంగ్రెస్, ఇతర సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు – ముస్లింలు,దలితులు వంటి కొన్ని వర్గాల్ని ఇన్నాల్లూ కేవలం ఓట్ బ్యాంకుగా వాడుకున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు – కేవలం బీజీపీ గెలుస్తుందనే కారణంతో – ముస్లింలు గానీ, దలితులు కానీ సొంత పార్టీలు పెట్టుకోకుండా – కట్టప్పల లాగా కాంగ్రెస్ కి లొంగిపోయి ఉండాలని ఆశించడం అవివేకం. చేతనైతే, ఈ చిన్న పార్టీలతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీచేయమని కాంగ్రెస్ ని , ఆ ఇతర సోకాల్డ్ సెక్యులర్ పార్టీల్ని అడగండి. అది చేయకుండా – ఎంత సేపూ, ఓట్లు చీలుస్తున్నారని ఆవు వ్యాసాన్ని వల్లెవేయడం వల్ల ప్రయోజనం లేదు.

Leave a Reply

Your email address will not be published.