మ్యాథమేటిక్స్ టాపరు !!!!

మ్యాథమేటిక్స్ టాపరు !!!!
==================
“అల్లాహ్ ఒక్కడే.ఆయన/ఆమె అఖండుడు.అవిభాజ్యుడు. అల్లాఎవరికీ జన్మించలేదు, ఎవరికీ జన్మనివ్వలేదు. అల్లాతో పోల్చదగినది వేరేదీ లేదు.” -ఇది అల్లాను వర్ణించే ఖురాన్లోని ఒక సూరా. సూరా ఇఖ్లాస్-112.

మ్యాథమేటిక్స్ టాపర్ : “అఖండుడు, ఎవరికీ జన్మించలేదు, ఎవరికీ జన్మనివ్వలేదా. ఇది ఎలా సాధ్యం. ఎవరికీ జన్మించకుండా, అసలు మనుగడ ఎలాఉంటుంది. నేను మ్యాథమేటిక్స్ తోపుని, క్లారిటీ లేనిదే దేన్నీ నమ్మను. దేన్నైనా రీజనింగ్ గానే ఆలోచిస్తా.

-సరే. 1,2,3,4,5… ఈ సిరీస్ లో నీకు తెలిసిన అత్యంత పెద్ద సంఖ్య ఎదో చెప్పు.
మ్యాథమేటిక్స్ టాపర్ : ఇన్ ఫినిటీ. అనంతం.

-అంటే ఎంత?
మ్యాథమేటిక్స్ టాపర్: హ్మ్మ్.. తెలీదు, అది చెప్పడం అసాధ్యం.

-మరి ఇదే సిరీస్ వెనక్కి వెలితే? -1,-2,-3.. ఇలా వెన్నక్కి వెల్లే కొద్దీ పెద్ద సంఖ్య ఏదో చెప్పు?
మ్యాథమేటిక్స్ టాపర్: అప్పుడు కూడా ఇన్ ఫినిటీ.నే , కాకపోతే ‘-ఇన్ ఫినిటీ’

-అంటే ఎంత?
మ్యాథమేటిక్స్ టాపర్: హ్మ్మ్.. తెలీదు, అది చెప్పడం అసాధ్యం

-సరే , ఇన్ ఫినిటీ లో నుండి ఓ 100 తీసేస్తే ఎంతవుద్ది?
మ్యాథమేటిక్స్ టాపర్: ఇన్ ఫినిటీ.

-దాన్లో నుండి ఓ 200 తీసేస్తే?
మ్యాథమేటిక్స్ టాపర్: ఇన్ ఫినిటి.

-దానికి ఓ 400 కలిపితే ఎంతవుద్ది?
మ్యాథమేటిక్స్ టాపర్: ఇన్ ఫినిటీ.

-ఏడిసినట్టే ఉంది నీ క్లారిటీ,రీజనింగు. ఎంత కలిపినా, ఎంత తీసేసినా ఒకే విలువ ఉంటుందా. సరేగాని నీ రీజనింగ్ ప్రకారమే ఇన్ ఫినిటీని నిర్వచించు చూద్దాం.

మ్యాథమేటిక్స్ టాపర్: “ఇన్ ఫినిటీ.. దానికి ఆది లేదు, అంతం లేదు. దానికి ఎంత కలిపినా దాని విలువ మారదు, దానిలోనుంచి ఎంత తీసేసినా దాని విలువ మారదు.దానిలాంటిది మరేదీ లేదు.”
ఈ నిర్వచనం, ఖురాన్లోని సృష్టికర్త నిర్వచనానికి దాదాపు సమానంగా లేదూ. సృష్టికర్త నిర్వచనాన్ని ప్రశ్నించినట్లే, నువ్వు క్లాసులో ‘ఇన్ ఫినిటీ’ నిర్వచనాన్ని కూడా ప్రశ్నించి ఉండాల్సింది. ఆ విలువేదో పక్కాగా తెలిసే వరకూ, నేను క్యాల్కులస్ చదవనని లెక్కల మాస్టారుతో తెగేసి చెప్పిఉండాల్సింది. కానీ అలా చేయలేదు.. ఎందుకంటే, ‘ఎగ్జాం ‘ అనేది ఒకటుంటుందనీ, సార్ చెప్పింది బుద్దిగా విని ఫాలో అవ్వకుంటే, ఆ ఎగ్జాం లో ఫెయిల్ అవుతామేమోననే భయం మనల్ని ఎక్కువగా ఆలోచించనీయదు. పైగా, క్లాసు లో మిగతా పిల్లలందరిలా లేకుంటే, Outcast ఐపోతామేమోననే భయం. కాబట్టి ఏదో ఓ లిమిటేడ్ నిర్వచనానికి/అండర్స్టాండింగ్ కి ఫిక్స్ అయిపోతాం.
కానీ ప్రతి మనిషీ ‘చావు ‘ అనే పరీక్షని, ఏదో ఒక సమయంలో తప్పకుండా ఎదుర్కోవలసి ఉంటుంది. మనకేం తెలీనట్లు, మనకేం సంబంధం లేనట్లు ఎంతగా నటిస్తూ కూర్చున్నా వచ్చే పరీక్ష రాకపోదు.. మ్యాథ్స్ పరీక్షకి నోటిఫికేషన్లు, ‘ప్రిపరేషన్ హాలిడేలు’ అన్నీ ఉంటాయి. కానీ, చావు పరీక్షకు అవేవీ ఉండవు. ఎనీ టైం రావచ్చు. సప్లిమెంటరీ కూడా ఉండదు.
“దేవుడు లేడు, మతం మత్తు లాంటిది” – లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఇప్పుడు ఫ్యాషన్. వీటికి విరుద్ధంగా నేను సృష్టికర్తను నమ్ముతానని చెప్పేవాన్ని ఫేస్ బుక్కు పురఫ్రముఖులు అవుట్ క్యాస్ట్ గానే డిక్లేర్ చేసేస్తున్నారు. ఇదో టైపు మైండ్ కండిషనింగ్.

మ్యాథ్స్ పరీక్ష క్లాస్ మొత్తానికి ఒకేసారి/ఒకే స్టాండర్డ్లో ఉంటుంది. కాబట్టి అర్థమైనా కాకున్నా, అందరితోపాటు వెల్లడంలో కొన్ని ప్రయోజనాలుంటాయి. కానీ, చావు పరీక్ష ఎవరిది వారికే. ఎవని సినిమా వాడిదే అన్నట్లు. ఎవరి ఆన్సర్లు వాల్లే ప్రిపేర్ చేసుకోవాలి. చావు కొచెన్ పేపర్ కళ్ళముందు వచ్చి నిలబడగానే, -“సృష్టి కర్త లేదు, గిష్టికర్త లేడూ ” అంటూ రాసిన పోస్టుకు లైకులు, ఆహా,ఓహో కామెంట్లు రాసిన వాళ్ళెవరూ అప్పుడు సపోర్టుకు రారు, రాలేరు. ఆలోచించండి.
Wish you Happy Preparation. 🙂

-మహమ్మద్ హనీఫ్.

Leave a Reply

Your email address will not be published.