యూదు-ముస్లిం చరిత్ర: కొన్ని విషయాలు (యూదు మేధావుల వ్యాఖ్యల ఆధారంగా)

David J Wasserstein – విద్యావేత్త,రచయిత, చరిత్రకారుడు. జ్యూయిష్ బ్యాక్-గ్రౌండ్ నుండీ వచ్చాడు. ఇజ్రాయెల్ లోని టెల్-అవీవ్ యూనివర్సిటీలో 1990 నుండీ 2004 వరకూ బోధన చేసి, ప్రస్తుతం ఒక అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఇతను రాసిన పుస్తకాలు – The Rise and Fall of the Party-Kings: Politics and Society in Islamic Spain 1002-1086 (Princeton University Press, 1985) and The Caliphate in the West: an Islamic Political Institution in the Iberian Peninsula (Oxford, 1993) and numerous articles on topics including Jewish history, Islamic history, and medieval numismatics. His most recent book is The Legend of the Septuagint from Antiquity to Today (Cambridge, 2006)

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే – ఇతను చెప్పేవిషయాలకు ఎంత వెయిటేజి ఇవ్వొచ్చు అనే విషయంలో, రీడర్స్ ఓ అంచనాకు రాగలుగుతారని.

దజేసీ డాట్ కాం(thejc . com, jewish chronicle) అని ఒక జ్యూవిష్ విషయాలగురించి రాసే ప్రముఖ వెబ్ మ్యాగజైన్ ఉంది. దీని ఓనర్లు, రాసేవారు,చదివే వారు – దాదాపుగా అందరూ యూదులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు కదా.

అలాంటి జేసీ డాట్ కామ్ లో, David J Wasserstein ఇచ్చిన ప్రసంగం ఆధారంగా ఓ వ్యాసం వచ్చింది. దాని టైటిల్ – “So, what did the Muslims do for the Jews”, యూదులకోసం ముస్లిం లు ఏం చేశారు – అని.(దాని లింక్ కామెంట్లలో ఉంది) ‘Islam saved Jewry’ ‘యూదు జాతిని ఇస్లాం కాపాడింది ‘- అని మొదలు పెట్టి, క్రైస్తవం కారణంగా యూదుమతం, యూదుజాతి ఏ రకంగా అంతరించి పోయే దశకు చేరాయో, ఇస్లాం వచ్చాక -వారి పరిస్థితి ఎలా మెరుగుపడిందో, యూదు సంస్కృతిని, యూదుల ప్రాణాల్నీ ముస్లిం రాజులు వివిధ కాలాల్లో ఎలా కాపాడారో డీటైల్డ్ గా అందులో వివరించారు.

Thomas Loren Friedman అమెరికన్ రైటర్, పొలిటికల్ కామెంటేటర్, న్యూయార్క్ టైంస్ కాలమిస్ట్. మూడుసార్లు పులిట్జర్ బహుమతి గెలుచుకున్నాడు. ఇతను కూడా యూదుడే. ఇతను ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన విషయం – “నేను ఒక జ్యూ ని. ఐదేళ్ళు అరబ్ దేశాల్లో నివసించాను. నా స్వంత అనుభవాల ఆధారంగా నేను బల్లగుద్ది చెప్పగలిగే విషయం ఏంటంటే – అప్పటి యూదులు యూరప్ లోనో, జర్మనీ లోనో కాకుండా అట్టోమన్ సామ్రాజ్యంలో ఉండి ఉంటే, అరవై లక్షల యూదులు ప్రాణాలతో ఉండగలిగేవారు. ఇస్లాం యొక్క పరమత సహనం అలాంటిది”. (ఇంటర్వ్యూ లింక్ కామెంట్లలో ఉంది, 37వ నిమిషం వద్ద వినొచ్చు )

అల్-ఆండలూసియా(ప్రస్తుత స్పెయిన్) లో 16వ శతాబ్ధంలో ముస్లిం రాజులశకం ముగియగానే, అధికారంలోకి వచ్చిన క్రైస్తవ రాజులు, కేవలం వందేళ్ళలో అక్కడ ఒక్క ముస్లింగానీ, జ్యూ గానీ లేకుండా చేశారు. అప్పుడు అక్కడి జ్యూలు తరలివెళ్ళి తలదాచుకున్నది – అట్టోమన్ రాజ్యంలోనే. యూరప్ లో క్రైస్తవులైన నాజీలు(హిట్లర్ సైనికులు) యూదుల్ని తరిమి,తరిమి చంపుతుంటే, చుట్టుపక్కలున్న అనేక ముస్లిం మెజారిటీ ప్రాంతాలు వారికి షెల్టర్ + సేఫ్ ప్యాసేజ్ కల్పించాయి. దీని గురించి The Forgotten Stories of Muslims Who Saved Jewish People During the Holocaust పేరుతో టైమ్ మ్యాగజైన్ లో 2017 లో ఓ వ్యాసం వచ్చింది.(లింక్ కామెంట్లలో). “అప్పట్లో ముస్లింలు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మమ్మల్ని రక్షించారు. యూరప్ లోని వేరే దేశాలేవీ మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేయలేదు”- అని, ఒక ముస్లిం ఇంట్లో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్న, ప్రస్తుతం 86 సంవత్సరాల యూదు మహిళ -Neumannలాంటి వారి మాటల్ని అక్కడున్న వీడియోలో చూడొచ్చు.

రెండో భాగం ఇంకో పోస్ట్ లో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published.