BJP- 42%
SP- 32%
BSP- 13%
INC- 2.4%
MIM – 0.46% (2% for 100 seats, which AIMIM contested)
ఇదీ లెక్క. దీని ఆధారంగా కొన్ని కన్క్లూజన్లు డెరైవ్ చేయొచ్చు.
నియోజకవర్గాల వారీగా డాటా తీసి, ఇక్కడ ఫలానా పార్టీ పోటీ చేయకపోయి ఉంటే, ఆ వోట్లు ఫలానా పార్టీకి పడి ఉంటే, ఈ పార్టీ కాకుండా- ఆ పార్టీ గెలిచి ఉండేది – అని మరో టైపు కన్క్లూజన్ లు కూడ డెరైవ్ చేయొచ్చు. అలా MIM పోటీ చేసిన కారణంగానే SP ఓడిపోయిందని చెప్పగల స్థానాలేవైనా ఉంటే, ఆ డీటైల్స్ కామెంట్స్ లో రాయమని మనవి. ఆధారాలు లేకుండా, కేవలం ఊహాగానాలు చేయడం టైమ్ వేస్ట్.
చాలా మంది విశ్లేషణ ఎలా ఉందంటే – BSP ఓ సారి అధికారంలోకి వచ్చింది కాబట్టి అదెందుకు -ఒంటరిగా, చేయాలా-వద్దా అన్నట్లు పోటీ చేసిందని అనకూడదు. రాహుల్ గాంధీ స్వాతిముత్యం టైప్ కాబట్టి, అంత సీన్ లేదని తెలిసినా ఎగేసుకుని అన్ని చోట్ల ఎందుకు పోటీ చేశావని అడగకూడదు. “ఎక్కడోచోట సైలెంటుగా పడి ఉండకుండా, నీకు రాజకీయమెందుకు” అని ఓవైసీ ని మాత్రం అనొచ్చు. – చాలా మంది టైంలైన్స్ పై కనిపిస్తున్నది ఇదే.
ఓవైసీ కూడా తన స్ట్రాటెజీ గురించి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అస్తమానం నేషనల్ మీడియాలో బీజేపీకి ప్రత్యర్థిగా కనిపిస్తుండటం వల్ల, తాను ఇతర సోకాల్డ్ సెక్యులర్ పార్టీలకు అంటరానివాడిగా మారడం తప్ప, ఎలాంటి ప్రయోజనం లేదని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. అఫ్కోర్స్, ఆ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు బీజేపీతో చేతులు కపులుపుతాయి. వాటి నాయకులు అక్కడి నుండీ ఇక్కడికీ, ఇక్కడి నుండీ అక్కడికి రొటీన్ గా ఫిరాయింపులు చేస్తుంటారు. అవన్నీ లెక్కలోకి రావు. మైనారిటీ గా ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.ఇది రియాలిటీ.
ప్రస్తుత ఇస్లామోఫోబిక్ వాతావరణంలో, కేరళలోని IUML పార్టీలాగా, చాపకింద నీరులా,సైలెంట్ గా గ్రౌండ్ లెవల్ లో క్యాడర్ ని నిర్మించుకుంటూ వెళ్ళాలితప్ప, బీజేపీ వాళ్ళు చెప్పే ప్రతి అడ్డమైన మాటలకు తగుదునమ్మా అంటూ కౌంటర్లివ్వడం వల్ల, మీడియాలో స్పేస్ దొరుకుతుంది గానీ, ముస్లింల వోట్లు మాత్రం రాలవు. ఆ గోదీ మీడియా వాల్లు స్పేస్ ఇచ్చేది కూడా, వారి హిందూ-ముస్లిం న్యారేటివ్ కి పనికొస్తారనే తప్ప, ముస్లింలను/ఓవైసీ ని ఉద్ధరించాలని కాదు. ఓవైసీ ఇవన్నీ తెలుసుకోలేనంత అమాయకుడా అనేది – ఇంకో వ్యాలిడ్ ప్రశ్న.