రంజాన్ ఉపవాసాలు – కొంచెం లాజిక్!!
===========================
ప్రతిఒక్కరికీ, చాలా అంశాలపై, చాలా చాలా రకాల ఒపీనియన్స్ ఉంటాయి.
అన్నిటినీ మంచివి,చెడ్డవి అని విడగొట్టలేం. చాలా ఒపీనియన్స్ ఈ రెండింటి మధ్యలోనో, రెండింటికీ అవతలో ఉండొచ్చు.
ఉదాహరణకు, మహమ్మద్ ప్రవక్తపై ముస్లింలకు కొండంత ప్రేమ,అభిమానం,గౌరవం ఉంటాయి.
నాకు తెలిసినంతవరకూ, చాలా మంది ముస్లిమేతరులకు కూడా ఆయనపై మంచి అభిప్రాయమే ఉంటుంది. అప్పుడప్పుడు యుద్ధాలు చేసినా, ఆరోజుల్లో ఆత్మ సమ్రక్షణార్థం అవసరం కాబట్టి చేసి ఉంటారనీ, చాలా వరకూ మంచి పనులే చేశారనీ, మంచిపనులు చేయమనే తన అనుచరులకు బోధించారనీ, కాబట్టి ఆయన మంచి వ్యక్తే అయ్యుంటారని చాలామంది ముస్లిమేతరులు భావిస్తుంటారు. కానీ, సృష్టికర్త నుండీ దైవదూత రావడం, ఆయనకు ఖురాన్ బోధించడం ఇవన్నీ నిజం కాదనీ, అనుచరుల్ని సన్మార్గంలో నడిపించడానికి ఆయనే సొంతంగా ఖురాన్ రాసి, అనుచరుల్ని నమ్మించడం కోసం, అది సృష్టికర్తనుండీ వచ్చిన పుస్తకం అని చెప్పి ఉంటారని చాలామంది అనుకుంటుంటారు. నిజానికి, ఇలా అనుకునేవారిలో సో కాల్డ్ మాడరన్ ముస్లింలు కూడా ఉన్నారు.
భక్తి విషయంలో నేను వివిధ దశల్ని దాటి వచ్చాను కాబట్టి, ఈ రకమైన థాట్ ప్రాసెస్ పై నాకు కొంత అవగాహన ఉంది.
కాసేపు, ఫార్ ది సేక్ ఆఫ్ ఆర్గుమెంట్ ఇది నిజమే అనుకుందాం.
సౌదీ అరేబియా చాలా వరకూ ఎడారి ప్రాంతం. పురాతనమైన ఇంతింత పెద్ద,పెద్ద బండరాల్లు, ఇసుక తెప్పలు తప్ప, కనుచూపుమేరలో పచ్చదనమనేది ఎక్కడా కనిపించదు. అలాంటి సౌదీ అరేబియా ప్రాంతంలో వాతావరణం ఎంత తీవ్రంగా, కఠినంగా ఉంటుందో ఉంటుందో ఊహించుకోవచ్చు. కాసేపు ఎండలో అలా నడిచి రాంగానే, నాలుక దప్పికతో ఎలా పిడచగట్టుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అలాంటి చోట, 14 వందల సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి తన అనుచరుల్ని సన్మార్గంలో ఉంచాలనే లక్ష్యంతో, ఇదిగో, రేపటి నుండీ మీరు సుర్యోదయం నుండీ, సుర్యాస్తమయం వరకూ పస్తులుండాలి, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరాదు. అని చెప్పగలరా?”
యావరేజ్ తెలివితేటలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఇలాంటి ఓ కండీషన్ పెట్టేటప్పుడు ఆయన మైండ్ లో ఎలాంటి ఆలోచనలు కలిగిఉంటాయి?
“అసలు నా అనుచరులు దీనిని ఫాలో అవుతారా? ఇంత కఠినమైన రూల్స్ మేము ఫాలో అవ్వలేం అని నాకు ఎదురుతిరిగితే ఏమిటి పరిస్థితి? పోనీ, నా ముందు ఓ.కే అని తలాడించి చాటుగా ఇంట్లో కెళ్ళి తాగేసి,తినేసి వస్తే, అప్పుడు నేను నిర్మిస్తున్న ఈ ఉద్యమం ఏమైపోవాలి? ”
ఎలాంటి నాయకుని మైండ్లోకి అయినా పై అణుమానాలు వచ్చి, వెంటనే ఆ ఆలోచనను విరమించుకుంటారు.
అన్నిటికీ మించి, ఆయనను, ఆయన అనుచరుల్ని మక్కా నుండి తరిమేసి, వీరిని ఎప్పుడెప్పుడు మట్టుబెట్టాలా అని ఖురైష్ శత్రువులు నిరంతరం స్కెచ్ వేసుకుంటున్నారని తెలిసినప్పుడు – నాయకుడనేవారు ఎవరైనా ఏం చేస్తారు? తన అనుచరులు ఇంకా ఎక్కువగా తిని,తాగి బలంగా తయారవ్వాలనీ, శత్రువుల్ని చీల్చి చండాలేలా కృరంగా, భీకరంగా, అగ్రెసివ్ గా తయారు చేయాలని ప్రయత్నిస్తారు తప్ప, వారికి అస్తమానం శాంతి, క్షమాగుణం ల గురించి బోధించి, వారిని నెల రోజులపాటు కఠోర ఉపవాసాలుంచి వారిలో నెమ్మదితనం తేవాలని ప్రయత్నిస్తారా?
కానీ, మహమ్మద్ ప్రవక్త ఇదే చేశారు. ఆయన అనుచరులు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారు, దీని వల్ల కలిగే ఫలితాలెలావుంటాయి.. ఇవేవీ ఆయన ఆలోచించి ఉండరు. ఎందుకంటే – సృష్టికర్త నుండీ వచ్చిన సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే ఆయన పని. అది జనాలు రిసీవ్ చేసుకుంటారా లేదా, ఫాలో అవుతారా లేదా అనేది ఆయనకు అనవసరం.
ఆయన అనుచరులు కూడా మరోమాట లేకుండా, ఇలా చేస్తే ఆరోగ్యం చెడిపోతుందేమో, బలహీనమైపోతామేమో వంటి అణుమానలేవీ లేకుండా ఆయన చెప్పిందాన్ని తూచాతప్పకుండా ఫాలో అయ్యారు. గత 14 వందల సంవత్సరాల నుండీ ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు. ఎందుకంటే – ఆ చెప్పినాయన మామూలు అందరిలాంటి నాయకుడు కాదనీ, తన మెసేజ్ ని జనాలకు అందివ్వడానికి సాక్షాత్తూ సృష్టికర్త ఎంచుకున్న ప్రవక్త అనే నమ్మకం వల్ల.
మతం, లాజిక్ కి నిలవదని కొందరు లాజిక్ ప్రియులు తీర్మానించేస్తుంటారు.
అలాంటి లాజిక్ బ్రెయిన్స్ కి ఓ ప్రశ్న.
గత 1400 సంవత్సరాల్లో చాలా మారాయి. ఎంతో మంది నాయకులు వచ్చారు వెల్లారు. రాజులూ, రాజ్యాలూ, సిధ్ధాంతాలూ,సరిహద్దులూ, సామ్రాజ్యాలూ అన్నీ మారాయి. కానీ, ఆ మెసేజ్ మారలేదు. ఆ మెసెంజర్ పై ఫాలోవర్స్ యొక్క నమ్మకం మారలేదు. ఆ ఫాలోవర్స్ సంఖ్యా తగ్గలేదు. ఎలా.. హౌ?
-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in
He is greate but i have one doubt god is why create tha peiole . Telugu lo chepta devudu srushti ni yenduku taharu chesadu
Thank you. Keep reading further.