ఆడోల్లు-మొగోల్లు అని రెండుకేటగిరీలు మాత్రమే ఉంటాయని మనకు చిన్నప్పటినుండీ తెలుసు.
ఇవి కాక కొందరు ‘తేడా’ గా ఉంటారనీ, పుట్టుకతోనే కొన్ని ఉండాల్సినవి ఉండవని, అంగవైకల్యం లాగానే అదీ ఓ వైకల్యం అనీ కొంచెం పెద్దయ్యాక తెలుస్తుంది. అంగవైకల్యం ఉన్నోల్లను తక్కువగా చూడటం, వారిని కించపరిచేలా మాట్లాడటం తప్పు అనే స్పృహ వచ్చాక, ఈ తేడా వ్యక్తుల్ని కూడా కించపరచకూడదని, అదో సంస్కారానికి సంబంధించిన విషయమనీ అర్థమవుతుంది.
ఇక్కడిదాకా అంతా బాగుంది. కానీ, ఇప్పుడు ఆ తేడా అనేది ఎలాంటి వైకల్యమూ కాదనీ, అది స్త్రీ-పురుషులు అనే రెండు కేటగరీలలాగానే, వీటికి సరిసమానమైన మూడో కేటగరీ అనీ ఎవరైనా వాదిస్తే..? కేవలం వాదించడమే కాకుండా –
పుట్టిన బిడ్డ ఆడా,మగా అనేది, పురుడుపోసిన డాక్టర్ కాళ్ళమధ్య చూసి చెప్పాల్సిన విషయం కాదనీ – ఆ బిడ్డ స్కూల్ కెళ్ళే వయసుకు వచ్చాక, ఓ బాలుడు -“నాకు అమ్మాయిల డ్రెస్సులేసుకోవడం ఇష్టం అనగానే” – ఆ బాలున్ని ‘ఉమన్ ఇన్ మేల్ బాడీ’ అని డిక్లేర్ చేసేసి, ఆ బాలున్ని హాస్పిటల్ టేబుల్ మీద పడుకోబెట్టి అతని అంగాన్ని కోసేసి, అక్కడ ప్లాస్టిక్ యోనిని అతికించేసి, రోజూ పొద్దున్నా, సాయంత్రం ఈస్ట్రోజన్ హార్మోన్లు ఎక్కిస్తే..?
అట్లే, ఓ టినేజ్ బాలిక, “నాకు అబ్బాయిల్తో కంటే అమ్మాయిల్తో ఉండటమే ఇష్టం”- అని చెప్పగానే – అంటే, నువ్వు “మేల్ ఇన్ ఫిమేల్ బాడీ” అని డిక్లేర్ చేసేసి – ఆమె వక్షోజాల్ని కోసేసి, ఆమెకు టెస్టొస్టిరాన్ హార్మోల్ని ఎక్కిస్తే..?
ప్రస్తుతం అమెరికా, యూరప్ లాంటి వెస్ట్రన్ దేశాల్లో ఇదే జరుగుతోంది.ప్రతి సంవత్సరం ఈ ట్రెండ్ దారుణంగా పెరిగిపోతూంది. ఇలాంటి సర్జరీలు చేసే డాక్టర్లు, హార్మోన్ మందుల్ని తయారు చేసే కంపెనీలు, ట్రాన్స్ జెండర్ యూనియన్లు.. ఇవన్నీ ఓ మల్టీ-మిలియన్ డాలర్ మాఫియా వరల్డ్ ని సృష్టించుకున్నాయి. వీటికి వ్యతిరేకంగా ఎవరు ఏ చిన్న వ్యాఖ్య చేసినా, వారి ట్విటర్ అకౌంట్లు బ్లాక్ అవుతాయి. వారు డాక్టర్లైతే వారి లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ప్రొఫెసర్లైతే , వారి ఉద్యోగం ఊడిపోతుంది. హాలీవుడ్ సెలబ్రిటీలైతే, ఇక వారికి పని దొరకదు. ఇంత పవర్ఫుల్ ఈ మాఫియా.
అన్నిటికంటే ప్రమాదకర విషయం, అక్కడి పబ్లిక్ స్కూల్లల్లో, అంటే ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలోనే పిల్లలకి మీరు అమ్మాయా,అబ్బాయా అని డైరెక్ట్ గా అడగకుండా, మేల్-ఇన్-ఫిమేల్-బాడి, ఫిమేల్-ఇన్-మేల్-బాడి అనే పైత్యపు కాన్సెప్ట్ లను- అత్యంత సహజమైన కాసెప్టులుగా బోధించి ఇప్పుడు మీరు ఏకేటగరీనో తేల్చుకోమని చెప్తున్నారు. పైగా, ఇదంతా నికార్సైన ఆధునికతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
అమెరికోల్లు ఏది చేస్తే అదే చేసే మనపాలకులు, సెలబ్రిటీలు,విద్యావేత్తల వల్ల ఈ ట్రెండ్ మనదేశానికీ, మరియు ఇతర దేశాలకూ పాకడానికి ఎంతో కాలం పట్టదు.
ఈ అంశం గురించి పూర్తి అవగాహన కోసం – కింద ఇవ్వబడిన లింక్స్ ని జాగ్రత్తగా గమనించగలరు.
Assalam alekum va rahmtullahi wa barakatuh
Mi Facebook ID patandi miss ayeindi
Assalam alekum va rahmtullahi wa barakatuh
Mi Facebook ID patandi miss ayeindi