గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు,భారతదేశ భవిష్యత్తు ఎలాఉండబోతుందో సూచిస్తున్నాయి.
1. జైశ్రీరాం,హల్లేలూయా,అల్లాహుక్బర్ -ఇవి భక్తులు తమ,తమ దేవుల్లనుభక్తితో,పారవశ్యంతో స్తుతించడానికివాడే నినాదాలు. కానీ, ఇటీవల కొందరికిముస్లింలను చూసినప్పుడల్లా పూనకంవచ్చి ‘జై శ్రీరాం’ అని నినాదాలుచేస్తున్నారు. ఇది ఎక్కడో మారు మూలప్రదేశంలోనో, చాటు-మాటుగానో జరిగిందికాదు. సాక్షాత్తూ భారతదేశపార్లమెంటులో జరిగింది.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోగెలిచిన ముస్లిం యం.పీలు, ప్రతిపక్షయం.పీలు – ప్రమాణస్వీకారంచేస్తున్నప్పుడు, బీజేపీ యం.పీలుజైశ్రీరాం,భారత్ మాతాకీ జై,వందేమాతరం నినాదాలు చేశారు.ఇవన్నీ దేవుని మీద భక్తితోనో, దేశం మీదప్రేమతోనో చేశారా, లేక వేరే ఎందుకైనాచేశారా అనేది – చిన్నపిల్లోల్లకు కూడాఅర్థమవుతుంది.
కానీ, ఘనత వహించిన దేశ ప్రధానిగానీ,బీజేపీలోని వృద్ధనాయకులు రాజ్ఞాధ్సింగ్, రవిశంకర్ ప్రసాద్ లాంటి వారుగానీ, బీజేపీ యంపీల్ని వారించేప్రయత్నం చేయలేదు.
దేశ చరిత్రలో ఇలాంటి రోజొకటివస్తుందని కనీసం ఓ ఇరవై ఏళ్ళముందుఎవరైనా ఊహించి కూడా ఉండరు.
2. సాక్షాత్తూ దేశ పార్లమెంటులోనేఅలాంటి సంఘటన జరిగినప్పుడు, దానిప్రభావం సమాజంపై ఉండకుండాఉంటుందా. లేక సమాజంలో జరిగేవాటినే పార్లమెంటు ప్రతిబింబిస్తుందా? మొత్తానికి ఇది జరిగిన కొన్ని రోజులకే,జార్ఖండ్ లో ఓ ముస్లిం యువకున్ని జైశ్రీరాం నినాదాలు ఇవ్వాలని కట్టేసి, రక్తంకారేలా కొట్టి, దానిని చక్కగా వీడియోకూడా తీశారు. పోలీసులు వచ్చి ఆయువకున్నే అరెస్టు చేశారు. అతనికిఎలాంటి చికిత్స చేయించకుండాజైల్లోపడేశారు. అతనికోసం పోలీస్ స్టేషన్కి వచ్చిన కుటుంబసభ్యుల్ని కూడా తిట్టి,బెదిరించి పంపించారు. మూడు రోజులతర్వాత అతను లాకప్ లోనేచనిపోయాడు. అతను దొంగతనంచేశాడని, అందుకే అతన్ని కొట్టారని,కొత్తవాదన తెరమీదకి తెచ్చారు. మరి ఆవీడియోలో ‘జై శ్రీరాం’ నినాదాలుఎందుకు ఇప్పించారనేదానికి మాత్రంసమాధానం లేదు.
నెక్స్ట్ రోజు – కోల్కతాలో, జై శ్రీరాంనినాదాలు ఇవ్వలేదని ఓ ముస్లిం వ్యక్తిని,రైల్లో మిగతా ప్రయాణీకులందరూచూస్తుండగానే, రైల్ నుండి కిందికితోసేశారు.
తరువాతి రోజు – పూణే లో, ఓ ముస్లింట్యాక్సీ డ్రైవర్ ని జై శ్రీరాం నినాదాలుఇవ్వలేదని ముగ్గురు వ్యక్తులు కొట్టారు..అఫ్కోర్స్.. భక్తి తోనే లెండి.
లేటెస్ట్ గా నిన్న – ఉత్తర ప్రదేశ్ లోనికాన్‌పూర్లో, ఓ బైక్ పై వెలుతున్న ఓముస్లిం యువకున్ని అటకాయించి ‘జైశ్రీరాం ‘ అనమని అడిగారు. అతనునిరాకరిస్తే – కింద పడేసి కొట్టారు. అక్కడిపోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రం – “అబ్బే ఇదేమంత పెద్ద విషయం కాదు.ఈ ముస్లిం యువకుడు – వారిబైక్ని ఓవర్టేక్ చేశాడు. దానితో చిన్న గొడవైంది,అంతే” – అని విలేకరులకు సర్ది చెప్పాడు.
3. గుజరాత్ లో గత 16 సంవత్సరాలలో,అధికారికంగా 180 లాకప్ డెత్ లుజరిగాయి. కానీ వీటిలో ఏ ఒక్కదానిలోనూ, ఏ ఒక్క పోలీసుకు కూడాశిక్షపడింది లేదు. అనధికారిక డెత్ లు,ఫేక్ ఎంకౌంటర్ల గురించిమాట్లాడకపోవడమే మంచిది. కానీ ఒక్కపోలీస్ కు, అది కూడా ఐపీయస్ ఆఫీసర్కి మాత్రం యావజ్జీవ కారాగార శిక్షపడింది. అది కూడా, ఓ పాతికేళ్ళ కేసువిషయంలో. పాతికేళ్ళ ముందు, ఓవ్యక్తిని పోలీసులు మాదక ద్రవ్యాలవిషయంలో అరెస్టు చేశారు. తరువాతఅతను రిలీజయ్యాడు. రిలీజైన తొమ్మిదిరోజులకు చనిపోయాడు. ఇది లాకప్లోపోలీసులు కొట్టడం వల్లే జరిగిందని-ఓ పోలీసుకు, ఆ ఏరియా యస్పీ కీ, గుజరాత్ లోని, ఓ కింది కోర్టు గతవారం యావజ్జీవ శిక్ష వేసింది.
చట్టం,న్యాయం ఎంత గొప్పగా పనిచేస్తున్నాయో కదా. ఆ ఐపీయస్ ఆఫీసర్- సంజీవ్ భట్. గుజరాత్ అల్లర్లసమయంలో, ముస్లిం లపై అల్లరిమూకలు ఏం చేసినా, జస్ట్ చూస్తూఉండండని, అప్పటి సీయం గా ఉన్న నరేంద్ర మోడీ, ఓ పోలీసుఉన్నతాధికారుల మీటింగ్ లోసూచనలిచ్చాడని – సంజీవ్ భట్ వివిధవిచారణా సంఘాల ముందు వాంగ్మూలంఇచ్చాడు. అలా వాంగ్మూలం ఇవ్వడానికి,పై అధికారులకు చెప్పకుండా ఢిల్లీకివెల్లాడని, అతన్ని ఐపీయస్ ఉద్యోగంనుండి సస్పెండ్ చేశారు. మామూలుగాఐతే, ఎవరికీ చెప్పకుండా, నెలల తరుబడిఆఫీసుకి డుమ్మా కొట్టిన వారిని కూడా,ఉద్యోగం నుండీ తొలగించరు. కానీ,ఈయన విషయంలో మాత్రంఉద్యోగసంఘాలూ,యూపీయస్సీ అన్నీఆయన్ను తొలగించాల్సిందే అనితీర్మానించేశాయి. మోడీ ఇచ్చిన ఆదేశాలగురించి అడిగినప్పుడు – మిగతాఅందరు అధికారులు మాత్రం, ఆ మీటింగ్గురించి తెలీదు-గుర్తులేదు-మర్చిపోయాఅని చెప్పారు. వాల్లందరూ ఇప్పుడుమంచి-మంచి హోదాల్లో చట్టాన్నిపరిరక్షిస్తున్నారు. పాపం సంజీవ్ భట్మాత్రం ఉద్యోగం కోల్పోయి, జైల్లోమగ్గుతున్నాడు. సత్యమేవ జయతే..హ..హ..
4. రెండేళ్ళముందు, రాజస్థాన్, అల్వాల్లో, సంతలో పశువులు కొనుక్కునివెల్తున్న పాల వ్యాపారి పెహ్లూ ఖాన్ నిగోగ్రవాదులు రోడ్డుపై అటకాయించికొట్టి,కొట్టి చంపారు. ఆ వీడియోలుదేశ,విదేశీ మీడియాలో సైతం కోట్లాదిమంది చూసి తరించారు. రాజస్తాన్ప్రభుత్వం కొందరిని అరెస్టు చేసింది.తరువాత అందరినీ నిర్దోషులుగావదిలేసింది. గత ఏడాది, అక్కడ అసెంబ్లీఎన్నికలు జరిగాయి. బీజేపీ ప్రభుత్వంఓడిపోయి, కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ వారికిమాత్రం గోభక్తి ఉండదా. అసలే ఎన్నికల్లోగెలిపించేది అదేనాయే.. తమ గోభక్తినినిరూపించుకోవడానికి కొత్తగా వచ్చినకాంగ్రెస్ ప్రభుత్వం – చనిపోయిన పెహ్లూఖాన్ తో పాటు, బతికున్న అతని ఇద్దరుకొడుకులపై కూడా, గో హత్యా నేరం కిందకేసులు నమోదు చేసింది. మరి ఆ కొట్టిచంపిన గోగ్రవాదుల్ని శిక్షించడానికికాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనిఅడగకండి. అసలే రోజులు బాగాలేవు.ఎందుకొచ్చిన గొడవ.
5. నుస్రత్ జహాన్ – ఈవిడ బెంగాలీభాషలో ప్రముఖ హీరోయిన్. గతపార్లమెంటు ఎన్నికల్లో మమతా బెనర్జీపిలిచి టికెట్ ఇచ్చింది. బసిర్హత్ అనే లోక్సభ స్థానం నుండీ పోటీ చేసింది. అక్కడసుమారు 60% మంది ముస్లిం ఓటర్లేఉన్నారు. ఆవిడ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి.కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా పోటిలోఉన్నాయి గానీ, వాల్లు గెలుస్తారని వారికికూడా నమ్మకం లేదు.
మొత్తానికి అక్కడి ముస్లిం ఓటర్లకునుస్రత్ జహాన్ కి ఓటేయడం మినహామరో ఆప్షన్ లేదు. ఇక ఆమె సినిమాగ్లామర్ ఉండనే ఉంది. మొత్తానికి, ఆమెభారీ మెజారిటీతో గెలిచింది. గెలిచినవెంటనే ఆమె తన బాయ్ ఫెండ్ – నిఖిల్జైన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.పార్లమెంటులో, ముస్లిం యంపీలు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో-బీజేపీ యంపీలు వివిధ నినాదాలుచేశారు. కానీ ఈవిడ ప్రమాణ స్వీకారాన్నిమాత్రం వారంతా చక్కగా బల్లలు చరిచి,స్వాగతించారు. నినాదాలివ్వాల్సినఅవసరం రాలేదు. ప్రమాణస్వీకారంచివర్లో ఆవిడే వందేమాతరం అనినినాదాలిచ్చింది. అదేంటి -వందేమాతరం -దేశాన్ని కాలీమాతగాపిలిచే గేయం, కాబట్టి దానిని, మేం పాడంఅనేది కదా, ముస్లిం ల వాదన. మరిఅలాంటి ముస్లింల ఓట్లతో గెలిచినఈవిడ – వందే మాతరం అనినినదించడం ఏమిటి?
ఈ ప్రశ్న ఆవిడని నిలదీసి అడగాలి.ఇలాంటి వ్యక్తికి ఎందుకు టికెట్ఇచ్చావని మమతా బెనర్జీని నిలదీసిఅడగాలి.
అడిగారు కూడా. ఆయనెవరో ముస్లింమతపెద్ద అంట. ఆయన అడిగాడు.ఏమని అడిగాడు – ముస్లిం అయిననుస్రత్ జహాన్, జైన మతస్తుడైన వ్యక్తిని ఎలా పెళ్ళి చేసుకుందని అడిగాడు. ఆమెనుదుటి మీద బొట్టు పెట్టుకుని, ఇస్లాంమతాన్ని అవమానించిందనివాపోయాడు. వందేమాతరం గురించిమాత్రం అడగడం మర్చిపోయాడు.బీజేపీ యంపీలు, ఇతర ముస్లింయంపీల్ని ఇబ్బంది పెట్టిన విషయంగురించి ఈవిడ వైఖరి ఏంటని మాత్రంఅడగలేదు.
ఇదీ ప్రస్తుతం ముస్లింల, సోకాల్డ్ ముస్లింనాయకుల, ముస్లిం మతపెద్దల పరిస్థితి. ‘పెళ్ళి’ వ్యక్తిగత వ్యవహారం. భారత రాజ్యాంగం, చట్టాల ప్రకారం ఎవరు ఎవరినైనా పెళ్ళి చేసుకోవచ్చు. ఆమెఎవరిని పెల్లి చేసుకుంటే ఏమిటి, ఎలాఅలంకరించుకుంటే ఏంటి? అల్లాఆదేశాలకు వ్యతిరేకంగా ఆమె ఏమైనాచేస్తే, దానికి ఆమె రేపుచచ్చాక,అంతిమదినం నాడు సమాధానంచెప్పుకుంటుంది. దాని గురించి ఇతరముస్లింలకు ఏం సంబంధం? మధ్యలోఈ ముస్లిం మత పెద్దకు ఏం నొప్పి.వందేమాతరం రాజకీయాంశం కాబట్టి,ఆమెకు ఓట్లేసిన ముస్లింలకుసంబంధించిన అంశం కాబట్టి దానిగురించి నిలదీసి అడగొచ్చు. ఇంత మందిముస్లింలలో, నీకు టికెటివ్వడానికి ఈవిడేదొరికిందా అని మమతా బెనర్జీని నిలదీసిఅడగొచ్చు, ఇవేవీ చేయకుండా, ఆమెపెళ్ళిపై, నుదుటున పెట్టుకున్న బొట్టుపైమాట్లాడుతున్నారంటే ఇదీ ముస్లింలమూర్ఖత్వం. ఇలా అడిగే అవకాశంలేకుండా, మళ్ళీ చచ్చినట్లు , మమతాబెనర్జీకే ఓట్లేయాల్సి రావడం ముస్లింలదౌర్భాగ్యం.
-మహమ్మద్ హనీఫ్
శుక్రవారం.ఇన్