15 ఏళ్ళు దలిత ఉద్యమంతో మమేకమై ఉన్న, దలిత్ కెమెరా అనే యూటూబ్ ఛానెల్ వ్యవస్థాపకుడు కూడా ఐన రవిచంద్రన్ – ఇస్లాం మతం స్వీకరించి, మహమ్మద్ రాయిస్ గా మారారు. ఇస్లాంలోకి ఎందుకు మారాడో వివరిస్తూ ఓ వ్యాసం కూడా రాశారు. ఇది చదివి ముస్లింలకు సమ్మగా అనిపించొచ్చు. కానీ, ముస్లింలు ఆలోచించాల్సింది దీనిగురించి కాదు.
ఇస్లాం లోకి మారకముందు, ముస్లింల గురించి ఆయన ఒపీనియన్స్ ఎలా ఉండేవో – కారవాన్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ప్రచురించింది. అదీ ముస్లింలు పట్టించుకోవాల్సింది.
ఆయనేమన్నారంటే –
“నేను చాలా యాంటీ-ముస్లిం గా ఉండేవాన్ని. నాకు ముస్లింల గురించి చాలా నెగెటివ్ అభిప్రాయాలుండేవి. బయట వారి గురించి అందరూ చెప్పేవి విని ఉండటం వల్ల కావొచ్చు.
ఇలా నేనొక్కన్నే కాదు , మొత్తంగా దలిత సమాజమే యాంటీ-ముస్లిం ఇన్-జనరల్ అనీ , ముస్లింలు చెడ్డోల్లనీ, టెర్రరిస్టులని ఎంకరేజ్ చేస్తారనే అభిప్రాయం కలిగి ఉంటారనీ కూడా చెప్పాడు.
English and Foreign Languages Institute( EFLU) లో, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(SIO) కి చెందిన ముస్లిం విద్యార్థులతో సన్నిహితంగా మెలగడం మొదలైనప్పటినుండే, వారితో వివిధ అంశాల గురించి లోతుగా చర్చించినప్పుడే తనకు ఇస్లాం గురించీ, దాని విలువల గురించీ ఓ క్లారిటీ వచ్చిందనీ చెప్పాడు.
**************
ఇదీ ముస్లింలు ఆలోచించాల్సిన విషయం.
రవిచంద్రన్ మరియు, అతను చెప్తున్న ఇతర దలితులెవరూ RSS శాఖలకో, భజరంగ్ దళ్ క్యాంపులకో వెళ్ళి ఉండరు. మరి ముస్లింలపై వారికింత నెగెటివ్ ఒపీనియన్ ఎందుకుంది..? ఎలా వచ్చింది?
దలితుల సంగతి సరే, బీసీలు, ఓసీలు, క్రిష్టియన్లు,నాస్తికులూ.. వీరందరి ఒపీనియన్ ముస్లింల గురించి ఎలా ఉండొచ్చు..?
రవిచంద్రన్ కి SIO సభ్యులు స్నేహితులుగా, యాక్సిడెంటల్ గా దొరకడం వల్ల, ముస్లింలపై ఆయన అభిప్రాయం మారింది?
మరి మిగతా వారి సంగతేంటి? వారికి ఇస్లాం గురించి ఎవరు చెప్పాలి?
భారతదేశం లాంటి విభిన్న మతాలు,కులాలు,జాతులు ఉన్న దేశంలో- 85% ప్రజలు, ముస్లింల గురించి నెగెటివ్ అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు – వారి బతుకులు ఇలాకాక, వేరేగా ఉండే అవకాశం ఉందా..?
వీటికి సమాధానాలు ఆలోచించండి. కామెంట్లలో రాయండి. తర్వాత మాట్లాడుకుందాం.