వినాశనానికి సిద్ధంకండి!!

వినాశనానికి సిద్ధంకండి!!
========================
“38 మార్కులు వచ్చినోడు ఫర్స్ట్ క్లాస్.
77 మార్కులు వచ్చినోడు సెకండ్ క్లాస్.
104 మార్కులు వచ్చినోడు థర్డ్ క్లాస్.
ఇదీ మన ప్రజాస్వామ్యం.”

*************
“అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రతిపక్షంలో,
రెండో,మూడో స్థానంలో ఉన్న పార్టీలు ప్రభుత్వంలో,

ఇదీ మన దేశ దౌర్భాగ్యం.”

**************
ఈ టైపు మెసేజీలు నిన్నటి నుండీ, నా మొబైల్ కి, వివిధ వాట్స్ అప్ గ్రూపుల్లో, వివిధ భాషల్లో కనీసం ఓ ఇరవై వచ్చాయి.

పైకి చూడ్డానికి కామెడీగానూ, ‘నిజమే కదా’ అనిపించే విధంగానూ ఉన్న ఈ మెసేజ్ లు, చదివేవారికి బీజేపీ పై సానుభూతిని, కాంగ్రెస్-జేడీయస్ లు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏదో తప్పు చేయబోతున్నాయనే భావనను కలిగిస్తాయి. ఇక్కడ అసలు విషయం – ఆ మెసేజ్ లు నాకు పంపిన వారెవ్వరూ హార్డ్ కోర్ బీజేపీ/ఆరెసెస్ మద్దతు దారులు కాదు. అట్లే, ఆ మెసేజ్ గ్రూప్ లో నాతోపాటూ రిసీవ్ చేసుకున్న వారు చాలా మంది, ఆ మెసేజ్ ని కశ్చితంగా ఇతర గ్రూప్ లకు ఫార్వర్డ్ చేసే ఉంటారు. ఎందుకు? అది బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్.

ఇప్పుడు కొన్ని నెలలు వెనక్కి వెల్దాం. ప్రస్తుతం గోవా, మణిపూర్, బీహార్ లలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో ఆపార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి. ఏ విధంగా అది అధికారంలోకి రాగలిగింది? కానీ అసలు ప్రశ్న అది కాదు. ఆ ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు పైన చెప్పినటువంటి మెసేజ్ లు ఒక్కటంటే ఒక్కటీ నాకు రాలేదు.

ఎందుకు ఈ డిఫరెన్సు? అక్కడే బీజేపీ ఐటీ సెల్ అనేది పిక్చర్ లోకి వస్తుంది. దానిలో సుమారు 20 వేల మంది ఫుల్ టైం ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కోక్కరి దగ్గర పదేసి స్మార్ట్ ఫోన్లు, ఒక్కో ఫోన్లో వేలకొద్దీ కాంటాక్ట్ నంబర్లు ఉంటాయి. ఐటీ సెల్ వారు ఓ మెసేజ్ క్రియేట్ చేసి మొదట కొన్ని గ్రూప్ లకు పంపిస్తారు. ఇక ఆ తర్వాత మనుషుల్లోని ‘ఇతరులకు ఫార్వర్డ్ చేయాలనే బేసిక్ ఇన్స్టింక్ట్’ ఆధారంగా ఆ మెసేజ్ బీజేపీ మద్ధతు దారులు కాని వారి ద్వారానే లెక్కలేని సార్లు ఫార్వర్డ్ చేయబడి, ఇంటర్నెట్ లో సర్క్యులేషన్లోకి వస్తుంది. దీనినే ప్రాపగాండా అంటారు. హిట్లర్ సమయంలో ఇది ఎలా పనిచేసిందో గతంలో ఓ పోస్ట్లో రాశాను. అప్పట్లో రేడియో, ఇప్పుడు ఇంటర్నెట్ అదే తేడా.

*******************

‘ఏ మీట నొక్కినా ఓటు ఆ గుర్తుకే’ అనేది, దేశవ్యాప్తంగా ఇప్పటికి కొన్ని వందల సార్లు జరిగింది. ప్రతిసారీ, స్థానిక ఎన్నికల అధికారులు ఆ ఈవీయం ని వేరే ఈవీయంతో మార్చి ఎన్నికలు కొనసాగించడం , ఆ తర్వాత ఆ విషయాన్ని అందరూ మర్చిపోవడం రొటిన్ అయిపోయింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఈవీయం చెడిపోయిన ప్రతిసారి ఓటు కమలం గుర్తుకే ఎందుకు పడుతుంది అని. ఈవీయం ని టాంపరింగ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇది ఆల్రెడీ చాలా మంది నిరూపించారు కూడా. తమకు కొన్ని నిమిషాలు ఇస్తే చాలు, ఎలాంటి ఈవీయం ని అయినా టాంపరింగ్ చేసి మీరు కోరిన ఫలితాలు వచ్చేలా చేస్తామని ఎలక్షన్ కమీషన్ ని ఛాలెంజ్ కూడా చేశారు. ఈ ఛాలెంజి కి ఈ.సీ. రెస్పాండ్ అవ్వలేదు. అవ్వదు కూడా. తమ సాటి జడ్జి అణుమానాస్పదంగా చనిపోతే, దానిమీద ప్రాధమిక విచారణకు కూడా మన సుప్రీం కోర్టు అనుమతించని పరిస్థితిలో, ఈసీ నుండీ,గవర్నర్ల నుండీ ఎక్కువ ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది.

ఈ వాదనని ఒప్పుకోని వారు వినిపించే ఆర్గుమెంటు – మధ్యలో కాంగ్రెస్ కూడా గెలుస్తుంది కదా. టాంపరింగ్ చేసేవారు మొత్తం చేస్తారు తప్ప, హంగ్ వచ్చేలా ఎందుకు చేసుకుంటారు – అని .

దీనికి సమాధానం – ఓ వ్యక్తి దొంగనోట్ల చెలామనీ చేస్తున్నాడంటే దానర్థం – మంచి నోట్లన్నిటినీ తగలబెట్టి, వాటి స్థానంలో దొంగనోట్లు పెడుతున్నాడని కాదు. మంచి నోట్ల మధ్యలో అక్కడక్కడా దొంగ నోట్లు పెడుతున్నాడని. ఆ ‘దొంగఈవీయం’ లను తెలివైన ఓటర్లెవరైనా గమనించి హంగామా చేస్తే, ఈ.సీ అధికారులు హడావిడిగా వాటిని మార్చేసి పోలింగ్ కానిచ్చేస్తున్నారు. అలా ఎవరూ గుర్తించని ఈవీయం ల సంగతేంటి?

కేంద్రంలో ఈ నాలుగేల్లలో చేసిన మంచిపని ఒక్కటంటే ఒక్కటీ లేకుండా, నెల రోజుల ముందు వరకూ గెలుస్తామనీ తాము కూడా నమ్మని స్థితి నుండీ 104 స్థానాలు పొందారంటే దానినెలా అర్థం చేసుకోవాలి.

నా దృష్టిలో – జనాల అమాయకత్వం, ఐ.టీ సెల్ ప్రాపగాండా, ఈవీయం ల ర్యాండమ్ టాంపరింగ్ ఇవన్నీ కారణాలు. వీటి ఆధారంగానే 2014 ఎన్నికలకు ముందూ, నిన్నటి కర్నాటక ఎన్నికలకు ముందూ , బీజేపీ గెలవబోతుందని చెప్పాను. ఇప్పుడు అదే కాంఫిడెన్స్ తో చెప్తున్నా. ఈ సంవత్సరం చివర్లో ఎన్నికలు జరగబోతున్న చత్తీస్ఘర్, మధ్యప్రదేశ్,రాజస్థాన్ లలో బీజేపీ రెండు రాష్ట్రాలు గెలవబోతుంది. తటస్థుల లాజిక్లను చల్లార్చడానికి ఒక్క రాష్ట్రంలో ఓడిపోతుంది.( చత్తీస్ ఘర్ లో కావచ్చు). ఇదే టెక్నిక్ తో 2019 లో కూడా అఖండ మెజారిటీతో గెలవబోతుంది. అప్పుడు జరగబోయే పరిణామాల గురించి రాసి మైనారిటీల్ని, దలితుల్ని, మహిళల్ని, నాస్తికుల్ని,హేతువాదుల్ని, ఆలోచనా గ్ఞానం కలిగినవారందరినీ భయపెట్టదల్చుకోలేదు, కాబట్టి ఇక్కడితో ఆపేస్తా.

ఒక్క సారి ఫాసిజం మొదలైతే- అది పూర్తిగా నాశనం చేసేదాకా వదల్దు. ఇది పక్కా.
“By the Time! Man is surely in loss, except those who believed and did good works, and exhorted one another to Truth, and exhorted one another to patience. Quran Chapter#103 ”

-మహమ్మద్ హనీఫ్.
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.