నాలుగు రోజుల క్రితం, ఆస్ట్రేలియా లో, ఆస్ట్రేలియా-A మరియు ఇండియా మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో, మహమ్మద్ సిరాజ్ చేసిన ఓ చిన్న పనిని ఆస్ట్రేలియన్ మీడియా వేనోల్ల కొనియాడుతోంది. భారత్ తరుపున బుమ్రా-సిరాజ్ బ్యాటింగ్ చేస్తున్నారు. సిరాజ్ నాన్-స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియా-A తరుపున పేసర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేస్తున్నాడు. అతను బౌల్ చేసిన ఓ బంతిని బుమ్రా స్ట్రెయిట్ షాట్ కొట్టాడు. కామెరూన్ గ్రీన్ దానిని క్యాచ్ పట్టబోగా, అది చేతుల మధ్యనుండీ దూసుకువెళ్ళి నేరుగా తలకు బలంగా తగిలి, అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. నాన్-స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న సిరాజ్, ఏదైతే అదైంది ముందు రన్ కంప్లీట్ చేద్దాం అనుకోకుండా, వెంటనే తన బ్యాట్ ని కిందపడేసి, పరిగెత్తుకుంటూ కామెరూన్ గ్రీన్ దగ్గరికి వెళ్ళాడు. గ్రీన్ భుజాన్ని తడుతూ, ఆర్ యు ఒకే.. అని సముదాయించే ప్రయత్నం చేశాడు. వీడియోలో రికార్డైన ఈ దృశ్యం చూసి, ఆస్ట్రేలియన్లు సిరాజ్ చూపిన స్పోర్ట్స్-మ్యాన్షిప్ ని మెచ్చుకుంటున్నారు. link below –
ఇలాంటి మరిన్ని పాజిటివ్ వార్తలు, విశ్లేషణలకోసం చూడండి – www.shukravaram.in