వ్యాక్సీన్ తయారీలో ఆవులు:

సుమారు పదేల్ల క్రితం, హైదరాబాద్, అశొక్ నగర్లో గ్రూప్-1 మెయిన్స్ కి కోచింగ్ తీసుకున్నా. సైన్స్ అండ్ టెక్నాలజీ కి హరిక్రిష్ణ అనే ఆయన ఫేమస్.

వ్యాక్సీన్ ల గురించిన టాపిక్ లో -వ్యాధికారక వైరస్ ను ల్యాబ్ లో వృద్ధి చేసి, దానిలోనుండీ కేంద్రకాన్ని తీసేసి, పైన మిగిలిపోయిన షెల్ ని మాత్రం వ్యాక్సిన్/టీకా రూపంలో మనిషి శరీరంలోకి ఎక్కిస్తారు. దానిని చూసి తెల్ల రక్తకణాలు యాంటీబాడీస్ ని పెద్దమొత్తంలో తయారు చేసుకుని రెడీగా ఉంటాయి. నెక్స్ట్ టైమ్, నిజంగానే వైరస్ గనక బాడీలోకి ఎంటరైతే- ఈ రెడీగా ఉన్న యాంటీ-బాడీలు దానిని తొలిదశలోనే చంపేస్తాయి – అని చెప్పిండు. ఇదంతా బాగా గుర్తుంది.

దీంతోపాటూ – ఇంకో విషయం కూడా గుర్తుంది. వైరన్ ను ల్యాబ్ లో వృద్ధిచేయడానికి గుర్రాలను చంపి, వాటినుండీ కలెక్ట్ చేసిన సేరం ఉపయోగిస్తారని చెప్పాడు. గుర్రాన్నే ఎందుకంటే, దాని శరీరతత్వం వైరస్ పెరుగులకు అనుకూలం అని చెప్పాడు.


ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయమేమంటే – వ్యాక్సీన్లపై పరిశొధనలు చేసే తొలిదినాల్లో, అంటే 19 వ శతాబ్ధంలో, గుర్రాల సేరం ని ఉపయోగించేవారు. కానీ, తర్వాత ఆవుల నుండీ దీనిని విరివిగా సేకరిస్తున్నారూ అని. ఆవుల్నే ఎందుకంటే, చంపేసిన తర్వాత ఆవు బాడీని ఫుడ్డుగా వాడుకోవచ్చు, ఆ రకంగా కమర్షియల్ గా కూడా వర్కవుట్ అవుతుందని.

ఇప్పుడు ఇండియాలోగానీ, ప్రపంచంలో ఎక్కడైనా గానీ, వ్యాక్సీన్ తయారీ ప్రక్రియలో ఆవుల్ని చంపడం అనేది చాలా కామన్ గా జరిగిపోతుంది. శరీరంలో ఎక్కించే వ్యాక్సీలో ఆవుకు సంబంధించినదేదీ ఉండదు, కానీ ఆ తయారీ ప్రక్రియలో మాత్రం దానిని వాడతారు.

ఇక్కడ రెండు విషయాలు:
1.వ్యాక్సీన్ల తయారీలో గుర్రాలను కాకుండా, ఆవుల్ని చంపుతున్నారనే విషయం – సివిల్స్/గ్రూప్-1 కు కోచింగ్ ఇచ్చేవారికి కూడా తెలీదనుకోవాలా?
2.గోహత్య పేరుతో, కేవలం ఆ అనుమానంతో, జనాలను చుట్టిముట్టి చంపుతున్న గోగ్రవాదులు – ఇప్పుడు వ్యాక్సిన్ ని బహిష్కరిస్తారా? ఎలాగూ ప్రభుత్వం మీదే కాబట్టి, దానిని నడుపుతున్నది మీ 56 ఇంచీలవాడే కాబట్టి, ఈ వ్యాక్సీన్ తయారీకేంద్రాల్ని మూసేయమని గానీ, కనీసం ఆవుల్ని గుర్రాలతో రీప్లేస్ చేయమని గానీ ఉద్యమాలు చేసేదేమైనా ఉందా?
Note: కొన్ని సార్లు పోర్క్ రిలేటెడ్ మెటీరియల్స్ ని కూడా మదులుగా వాడుతారు. మరి ముస్లింలు వాటిని బహిష్కరిస్తారా అని కొందరు దేడ్-దమాఖ్ లు అడగవచ్చు. వారికోసం – ముస్లింలు పోర్క్ ని ఆహారంగా తినకూడదనేది మాత్రమే నియమం, ఇతరులెవ్వరూ దానిని తినకుండా చూడమనిగానీ, పందుల్ని ఎవ్వరూ చంపకుండా ఆపి, వాటి సంఖ్య పెరిగేలా కృషిచేయమనిగానీ కాదు. సగం-సగం నాలెడ్జీతో, లేని బైనరీల్ని సృష్టించి ఆపసోపాలు పడకండి.
-మహమ్మద్ హనీఫ్
www.shukravaram.in

Leave a Reply

Your email address will not be published.