సమాజంపై “కాశ్మీర్ ఫైల్స్” సినిమా ప్రభావం

రాధేశ్యామ్ సినిమా తో పాటుగా రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ కాశ్మీరీ ఫైల్స్ చాలాపెద్ద విజయం సాధించింది.ఇది నిశ్శబ్ద విప్లవం …అని మన హిందూత్వ మూకలు చెప్పుకోవచ్చు.ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది అని మీడియా ప్రచారం చేస్తోంది.చాలా ట్యూబులు ఇదే చెప్తున్నాయ్.స్వామీజీలు … హిందూ సంస్థలూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు తప్ప …

విడిగా నిర్మాతలు సినిమా ప్రమోషన్స్ చేయడం లేదు. అవసరం లేదని కూడా చాలా సీరియస్ గా భావిస్తున్నారు. హిందూ అన్న ప్రతివాడూ ఈ సినిమా చూడాలి అనే ధోరణిలో ప్రచారం చాపకింద నీరులా సాగుతోంది. హిందూ ఓట్లను ఏకాత్మ చేయడం చేయడం ద్వారా ఎలాగైతే …హిందూత్వ శక్తులు రాజకీయ విజయం సాధించాయో అలాగే కాశ్మీర్ ఫైల్స్ సినిమా దేశంలోనూ విదేశాల్లోనూ ఉన్న ప్రతి హిందువూ చూసేస్తే చాలు అనే టార్గెట్ ఫిక్స్ చేసేశారు.చూడకపోతే చూసి బావుంది అంటేనే ఈ దేశంలో ఉండాలి అన్నా అనవచ్చు…కాబట్టి చూసేయడమే బెటర్.

మీకిది మాకిది అన్నట్టుగా సినిమా వాళ్లూ రాజకీయాలవాళ్లూ కల్సి వ్యాపారం అద్భుతంగా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ప్రాజెక్ట్ సక్సస్ అయ్యింది.సినిమా కమర్షియల్ గానూ హిట్ కొట్టింది. రాజకీయంగానూ హిట్ కొట్టింది. ఈ సినిమా ప్రధానంగా చేసిన పనేంటంటే … కావ్మీర్ లో కలసి బ్రతికిన , కాశ్మీర్ కోసం కలసి పోరాడిన వారిని…ఒకరికొకరిని అభిముఖంగా నిలబెట్టి రాజకీయ పబ్బం గడుపుకోడానికి హిందూత్వ శక్తులు చేస్తున్న ప్రయత్నానికి . .. ఊతంగా నిలబడడం. బిజేపీ కాశ్మీరీ పండితుల మీద గత కొంత కాలంగా కారుస్తున్న మొసలి కన్నీటికి లెజిటమసీ తెచ్చే ప్రయత్నం ఈ సినిమా .

కాశ్మీరీ ఫైల్స్ సినిమా ఈ అన్ని విషయాల్లో హిందూత్వ సంస్ధలకు అండగా నిలబడుతోంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సినిమా గురించి మాట్లాడుతున్న వారిలో చాలా మంది కాశ్మీర్ లో హిందువుల మీద ముస్లింలు జరిపిన దాడులుగా మాట్లాడుతున్నారు.తీవ్రమైన ముస్లిం వ్యతిరేకత తో మాట్లాడుతున్నారు. కాశ్మీరీ పండితులు వలసలు పోవడానికి … ముస్లింలే కారణం అన్న పద్దతిలో మాట్లాడుతున్నారు.

సినిమా చూసిన వారు … ముఖ్యం హిందూత్వ సంస్ధల్లో సభ్యులు … చాలా సీరియస్ గా ముస్లింలు కాశ్మీరీ పండితులను ఊచకోత కోశారనీ …ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు చేశారనీ … బలంగా చెప్తూన్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి .. హిందువులు సాయుధులు కావాల్సిన అవసరం ఉందని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టేదాకా వెళ్లారు. వెళ్తున్నారు.ఒక ప్రత్యేక హిందూ ఆర్మీ తయారు చేయాల్సిన అవసరం గురించి బల్ల గుద్దివాదిస్తున్నారు.

ఇది ఈ సమయంలో ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అంశం… హిందువుల్లో ఒక భయంకరమైన అభద్రతను రెచ్చగొట్టి … ఆ అభద్రతలో వారు వివేకం కోల్పోయే పరిస్థితి కల్పించి …ఉన్మాదంతో ఊపేయడం తద్వారా వారిని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనే ఫాసిస్ట్ మెథడ్ ను అమలు చేయడంలో కాశ్మీర్ ఫైల్స్ హిందూత్వ శక్తులకు అందివచ్చిన ఆయుధం అయ్యింది. ఇప్పటికే దేశంలో ఉదారవాదాన్ని పూర్తి స్థాయిలో చంపేశారు …సెక్యులరిస్టులను సెక్యురిజం అనే పదాన్నీ ఎంతగా రెడిక్యూల్ చేయాలో అంత చేసేశారు …

కుహానాగాళ్లు అనే పదాన్ని అలవాటు చేసేశారు. సినిమా తీసిన వారి ఉద్దేశ్యం కూడా అదే …సినిమాను ప్రమోట్ చేస్తున్న శక్తుల అజండా కూడా అదే.జాతీయ వాదం అనగా హిందూ వాదం అని తెల్సిందేగా…కేవలం కాశ్మీరీ పండితుల పేరు చెప్పి కాశ్మీర్ లో జరిగిన అన్ని దారుణాలనూ ముస్లింల ఖాతాలో తోసేయడం …హిందువులను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం …తద్వారా వారు తమ రోజువారీ జీవిత సమస్యలను పట్టించుకోకుండా …. ఒక ఉన్మాదంలో బతికేసేలా చేయడం అనేది వ్యూహం. ఆ వ్యూహం అద్భుతంగా వర్కౌట్ అయ్యింది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో. కాశ్మీర్ లో నరమేథం జరిగిన మాట వాస్తవమే ….89 నుంచీ 2018 వరకూ దాదాపు లక్ష మంది ముస్లింలు హత్యకు గురయ్యారు.

వాళ్లెవరూ కాశ్మీర్ ను వదిలి వెళ్లలేదు.కాశ్మీర్ విముక్తి పోరాటాల్లో హిందూ ముస్లింలు కల్సే పనిచేశారు.షేక్ అబ్దుల్లాతో సన్నిహితంగా మెలిసిన పండిట్ లు అనేక మంది ఉన్నారు. ఇలాంటి అనేక అంశాలు … చాకచక్యంగా విస్మరించి …కాశ్మీరీ పండితులను కాశ్మీర్ లో హిందూవులను ఊచకోత కోశారు అనే ఒకే మాటను జనం మనస్సుల్లోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది …ఈ సిన్మా చూసి వస్తున్న నేనే… రోడ్డు మీద ఓ ముస్లిం ను చూసి భయం పడిపోయానంటే… ఈ సిన్మా ఎంత భయం పెట్టిందో అర్థం చేసుకోవచ్చు.ఈ సినిమా విజయం చాలా స్పష్టంగా దేశం ఎంత ప్రమాదంలోకి వెడుతోందో చెప్తోంది …దాన్ని అడ్డుకోడానికి సీరియస్ గా ప్రయత్నం చేయాల్సి ఉంది …. ఈ నాలుగు మాటలు చెప్దామనే ఈ వయసులో నా తాపత్రయం నాయనా

ఏదో పెద్ద ముండావాణ్ణి … చెప్పాను…ఇక మీ ఇష్టం…ఓం శాంతి

రచయిత – భరద్వాజ రంగావఝల,
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ,
దర్శకత్వ విభాగం.

Leave a Reply

Your email address will not be published.