సమానత్వం – ప్రివిలైజెస్!!

సమానత్వం – ప్రివిలైజెస్!!

===================

“కూలీ కావాలా సార్!!”

ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానోలెక్కలేదు.

టోలీచౌకి, రుమాన్ హోటల్ కి చాయ్తాగడానికి ఉదయంపూట వెళ్ళి, ఫై ఓవర్కింద బైక్ పార్క్ చేయగానే, అక్కడిఅడ్డాకూలీల కళ్ళన్నీ ఆశగా మనవైపేచూస్తుంటాయి, కూలీల కోసంవచ్చామేమోననుకుని.

ప్రతి ఉదయం 8-10 గంటల మధ్య, ఆప్రాంతమంతా కూలీలతో, మేస్త్రీలతోకిక్కిరిసి ఉంటుంది. అందరి చేతుల్లోనూ,మధ్యాహ్నం కోసం అన్నం పెట్టుకున్నస్టీలు బాక్సులు, పలుగు-పార,  టూల్ కిట్లులాంటివి ఉంటాయి. బేరం మాట్లాడుకుని,పని దొరికినోల్లను ఏజెంట్లు, సేట్లు, షేర్ఆటోల్లో సైట్ దగ్గరికి తీసుకెల్తారు. అలాపొద్దెక్కేదాకా ఎదురుచూసి, పనిదొరకనోల్లు మాత్రం, ఉసూరు మంటూతమ బస్తీలకు,ఇండ్లకు వెల్లిపోతారు.

వీరిలో 15 ఏళ్ళ నూనూగు మీసాలపోరగాల్ల నుండీ, నిదానంగా కుంటుతూనడిచే పెద్దవయసు వారు, చంటి బిడ్డలతల్లులనుండీ,  నడి వయసు మహిళలుకూడా ఉంటారు. పని దొరకని రోజు, వీరుతమ ఒక రోజు సంపాదన కోల్పోయినట్లేలెక్క. జ్వరమొచ్చినా, జబ్బు చేసినా,ముందు రోజు పనిలో ఏదైనా గాయమైనా-దానికి  వీరిదే పూర్తి జవాబుదారీ తప్ప,పని చేయించుకునే  వారికి ఏం సంబంధంఉండదు. స్త్రీ-కూలీలకు బహిస్టురోజుల్లోకూడా అదే బరువులెత్తుతూ, అదే చాకిరీచేయాల్సి ఉంటుంది. లేదంటే ఆరోజుకుసంపాదించుకునే  400-500 రూపాయలువదులుకోవాల్సిందే. కొంచెం వయసులోఉన్న ఆడకూలీల్ని,  మేస్త్రీలు, ఏజెంట్లు’చేరదీయాలని ‘ చూడటం, తమకులొంగని వారిని పనికి తీసుకు పోకుండా,లేదా ఎక్కువ పని చేయించి వేధించడంలాంటివి ఉండే ఉంటాయి.

వీరందరితో పోల్చుకుంటే   MNCల్లో   పనిచేస్తున్నవారు చాలా ప్రివిలైజ్డ్.

పని కోసం రోజూ ఎదురు చూడాల్సినఅవసరం లేదు. ఒంట్లో బాగోలేకపోతే, ‘ఈరోజు సిక్ లీవ్ ‘ అని ఓ మెయిల్ రాస్తేసరిపోతుంది, దీని వల్ల నెలజీతంలోతగ్గించడం ఉండదు. హాస్పిటల్ లోచేయించుకున్న వైద్య ఖర్చులు కూడా,కంపెనీ రీ-ఎంబర్స్మెంట్ చేస్తుంది.  ఆఫీసుల్లో పని చేసే మహిళలకు 6 నెలలఫుల్ పెయిడ్ మెటర్నిటీ లీవులు, ఎవరైనాఅడ్డమైన వేషాలేస్తే కంప్లైంట్ ఇవ్వడానికి’సెక్సువల్ హరాస్మెంట్ సెల్ ‘లు,  HRపాలసీలు -ఇలా చాలా ఉంటాయి. అఫ్కోర్స్ ఇదంతా – కంపెనీకి ఉద్యోగితోఅవసరం ఉన్నన్ని రోజులే. ఓ సారి,ఇతను/ఈమె మాకు అవసరం లేదు అనికంపెనీ భావించి ఉద్యోగం నుండీ తీసేస్తే,ఇక అతను ఒక్కరోజులో జీరో స్థాయికిపడిపోతాడు. దినసరి కూలీ  ఆడ్డా దగ్గరనిలబడ్డట్లు, ఉద్యోగి కూలీ – నౌక్రీ.కాం అనేఅడ్డాలో నిలబడతాడు. కానీ, ఉద్యోగంలోఉన్నన్ని రోజులు మాత్రం అతను -ప్రివిలైజ్డ్ క్లాస్ కిందే లెక్క.

మరో రకం ప్రైవిలైజ్డ్ క్లాస్ -ప్రభుత్వోద్యోగులు.

ఒక్కసారి జాయిన్ అయితే,ప్రధానమంత్రి, రాష్ట్రపతులు కూడాఅతన్ని/ఆమెని ఉద్యోగం నుండీ పీకలేరు.కరువొచ్చినా, వరదొచ్చినా, వీరికి మాత్రం ఠంచనుగా పీఆర్సీలు గ్యారంటీ.అఫ్కోర్స్.. వీరికి ఇలాంటి అమూల్యమైనప్రివిలైజెస్ తో పాటు, కొన్ని ప్రత్యేకబాధలు కూడా ఉంటాయి. ఉదాహరణకి,ప్రైవేటు కంపెనీల్లో బాసు నచ్చకుంటే, “చీఈ వెధవ కింద ఎవరు పనిచేస్తార”నుకుని, ఇంకో కంపెనీకి మారొచ్చు,కానీ పాపం  ప్రభుత్వోద్యోగులకు ఆఫెసిలిటీ ఉండదు. ఇక దాన్లో ఉన్న ఇగోలు,కుల వేధింపులు, మత వేధింపులుఅదంతా మరో కధ. కాకపోతేజీతభత్యాల విషయంలో మాత్రం, వీరిప్రివిలైజెస్ కి సాటి మరేదీ లేదు.

మరో రకం ప్రివిలైజ్ – ఫ్యామిలీ

తాతలు తండ్రులు  సంపాదించి పడేసినఆస్తిని   కష్టపడి ఖర్చు చేయడం. ఆడబ్బును  వడ్డీలకు తిప్పిరెండింతలు,నాలుగింతలు చేయడం. ఆస్తిపంపకాల్లో వచ్చిన షాపులు, ఇండ్లబాడుగల నెలసరి అద్దెలే కొందరికిలక్షలు,కోట్లలో ఉంటాయి.చిన్నప్పటినుండీ కష్టపడి సదివి,ర్యాంకులు సాధించీ విప్రో, టీసీయస్లాంటి కంపెనీల్లో నైటవుట్లు చేసి, కష్టమర్లడెడ్ లైన్లు మీట్ అయి సాధించిననెలజీతం కంటే ఎక్కువే కొందరికి సెంటర్లోఓ షాప్ ఉండటం వల్ల రెంటు రూపంలోవస్తుంది. అంత కష్టపడ్డా,  ఆ ఉద్యోగికినిద్దర్లో జాబ్ ఊడిపోతే, EMI  గుర్తొచ్చినిద్రపట్టదు. అఫ్కోర్స్ రేపు రోడ్డు వైడెనింగ్లో నా షాప్ పోతే, నా పరిస్థితి ఏంటనేవిషయం ఒక్కోసారి, ఇతనికి కూడానిద్రలేకుండా చేస్తుందనుకోడి, అది వేరేవిషయం.

ఇదీ ప్రివిలైజ్ సంగతి. కొందరికి కొన్నిరకాల ప్రివిలైజెస్ ఉంటాయి. ఎవరికి, ఏది,ఎందుకు  ఉందదేది లాజిక్ కు అందనివిషయం. కొందరు – ‘ట్యాలెంట్ ‘ అంటారుకానీ, ట్యాలెంట్ అంత చెత్త పదం,మిస్లీడింగ్ పదం మరోటి ఉండదు.కొందరికి కొన్ని కారణాల వల్ల కొన్నిఅంశాల్లో మెదడు చురుగ్గా పని చేసుంది,అంతే. అంతకు మించి ‘ట్యాలెంట్ ‘ కి,ప్రివిలైజెస్ కి సంబంధం లేదు.

 మనకున్న ప్రివిలైజెస్ ఏమిటి, వాటితోమనం ఏం చేస్తున్నామనేది ముఖ్యం.

ఇలాంటి ప్రివ్లైజెస్ ని చూసి నువ్వేదో పెద్దపోటుగాడివి కాబట్టే, నీకు ఇవన్నీఉన్నాయని ఫీల్ కావొద్దు. ఇదంతా, నీకుఓ టెస్ట్, ఓ పరీక్ష అని ఖురాన్ చెప్తుంది.

And it is He who has made you successors upon the earth and has raised some of you above others in degrees [of rank] that He may try you through what He has given you. Indeed, your Lord is swift in penalty; but indeed, He is Forgiving and Merciful.  6:165

డబ్బు, పేరు, హోదా, అధికారం – ఇవన్నీమనిషి ఇంకా,ఇంకా కావాలని కోరుకునేప్రివిలైజెస్. అలా కోరుకోవడంలో, దానికైప్రయత్నించడంలో తప్పులేదు. కానీ,ఇప్పటికే ఉన్న ప్రివిలైజెస్ ని గుర్తించమనీ,ఆ ప్రివిలైజెస్ కి సృష్టికర్తకు థ్యాంక్స్చెప్పమనీ, అవి లేని ఇతర మనుషుల్తో,బంధు,మిత్రులతో న్యాయంగా, గౌరవంగామెలగమనీ, విధిగా దానిలో వాటాఇవ్వమనీ ఇస్లాం చెప్తుంది.

 -మహమ్మద్ హనీఫ్.

శుక్రవారం.ఇన్

Leave a Reply

Your email address will not be published.